Home /News /trending /

OLD AGE HOME COUPLE MARRIAGE AT WEST BENGAL KNOW THEIR STORY HERE NEWS GOES VIRAL VB

Old Couple | Love Story: ‘లవ్ స్టోరీ’ అంటే ఇది..! ఈ జంట ఆరుపదుల వయస్సులో ఏం చేశారో చూడండి..

పెళ్లి చేసుకున్న జంట

పెళ్లి చేసుకున్న జంట

Old Couple | Love Story: మన భారతదేశంలో వివాహానికి కనీస వయస్సు అనేది ఉంటుంది. కానీ.. ఫలానా వయస్సులో వివాహం చేసుకోవద్దు అనే నిబంధన మాత్రం లేదు. ఈ లాజిక్ నుంచి పుట్టిందే.. ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు అని.

  మన భారతదేశంలో(India) వివాహానికి కనీస వయస్సు(Age) అనేది ఉంటుంది. కానీ.. కనీస వివాహ వయస్సు దాటిన తర్వాత ఫలానా వయస్సులో వివాహం చేసుకోవద్దు అనే నిబంధన మాత్రం లేదు. ఈ లాజిక్ నుంచి పుట్టిందే.. ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు అని. ఇద్ద‌రి మ‌న‌సుల క‌ల‌యిక‌కు వివాహ బంధం(Marriage) శాశ్వ‌త గుర్తును ఇస్తుంది. ప్రేమ‌కు మారు పేరు అయిన ఎంద‌రినో చ‌రిత్ర మ‌నుకు చూపిస్తోంది. ప్రేమ‌కు వ‌య‌స్సుతో సంబంధం లేద‌ని ఇద్ద‌రి మ‌న‌సుల మ‌ధ్య ఉన్న బంధం స‌రిపోతుంద‌ని మ‌రోసారి నిరూపిస్తూ పశ్చిమ బెంగాల్‌లోని(West Bengal) ఓ వృద్ధ జంట ప్రేమ వివాహం(Love Marriage) చేసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సుబ్రతా సేన్‌గుప్తా , అపర్ణ చక్రబర్తి అనే వారు నదియా జిల్లాలోని ఒక నర్సింగ్ హోమ్‌లో కలుసుకున్నారు.

  అతడికి 70 ఏళ్లు, ఆమెకు దాదాపు 65 ఏళ్ల వయస్సు ఉంటుంది. సుబ్రత సేన్‌గుప్తా రిటైర్డ్ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో ఉద్యోగిగా పనిచేశాడు. తర్వాత అతడి శేష జీవితాన్ని నర్సింగ్‌హోమ్‌లో గడపాలని నిర్ణయం తీసుకున్నాడు. అతడితో పాటు తన సోదరుడితో రాణాఘాట్ సబ్ డివిజన్ లోని చక్దాలో నివిసిస్తుండేవారు. కానీ అతడికి అ ఫ్యామిలీతో ఉండటం ఇష్టం లేక 2019 లో ఇంటి నుంచి బయటకు రావాలనుకున్నాడు. అనుకున్న విధంగానే అతడు బయటకు వచ్చేసి.. రానాఘాట్‌లోని వృద్ధాశ్రమానికి చేరాడు. అక్కడే అతడు శేషజీవితాన్ని గడపడం మొదలు పెట్టాడు. అక్కడ అతడికి 65 ఏళ్ల అపర్ణ చక్రవర్తి అనే వృద్ధురాలు పరిచయం అయింది.

  Kia Carens : కియా కార్ లవర్స్‌కు షాక్.. పెరిగిన కియా కారెన్స్ ధరలు.. కొత్త ప్రైజెస్ ఇవే..!


  ఆమె కూడా అదే ఆశ్రమంలో శేషజీవితాన్ని గడుపుతోంది. గత 5 ఏళ్ల నుంచి కూడా ఆమె అదే ఆశ్రమంలో ఉంటోంది. ఆమె ఈ ఆశ్రమానికి రావడానికి ముందు కోల్‌కతాలోని బెలేఘాటాలోని ఓ ప్రొఫెసర్ ఇంట్లో సుమారు 30 ఏళ్లపాటు పనిమనిషిగా పనిచేసింది. ఇలా వారిద్దరి పరిచయం అక్కడే ఏర్పడింది. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఇద్దరికీ ఇంతవరకు పెళ్లి కాలేదు. దీంతో సుబ్రతా సేన్‌గుప్తా ఓ రోజు అపర్ణను ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటాను అంటూ ప్రపోజ్ చేశాడు. కానీ అందుకు ఆమె నిరాకరించింది. కొన్ని రోజుల వరకు బాధపడ్డ అతడు.. తర్వాత 2020 మార్చిలో ఆశ్రమం నుంచి బయటకు వచ్చి.. అదే కాలనీలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకొని అందులో ఉంటున్నాడు.

  Volkswagen: వోక్స్‌వ్యాగన్ నుంచి కొత్త కారును లాంచ్ చేసిన కంపెనీ.. ఆ వివరాలు ఇలా..

  ప్రేమను అంగీకరించలేదని అతడు ఎంతో బాధ పడ్డాడు. తర్వాత రెండు మూడు రోజులకు అతడి ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. సడన్ గా అతడు అస్వస్థతకు గురయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ వృద్ధురాలు అతడి ఇంటికి పరుగున వచ్చింది. ఏమైందంటే ఆప్యాయంగా పలకరించింది. అతడికి మనోధైర్యాన్ని ఇస్తూ.. అతడి ప్రేమను అంగీకరించింది. సుబ్రతా సేన్‌గుప్తాకి ఇది మొదటి చూపులోనే ప్రేమ.. అయితే అతడి భావాలను ఆమె అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఇలా ప్రేమలో కొన్నాళ్లుసాగుతూ.. ఇటీవల చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారు. వీరిద్దరి ప్రేమ, పెళ్లి వ్యవహారం తెలిసిన ప్రతీ ఒక్కరు అభినందిస్తున్నారు. ప్రేమకు వయస్సుతో పనిలేదని నిరూపించారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. వారి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
  Published by:Veera Babu
  First published:

  Tags: Love marriage, Love story, Trending, Westbengal

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు