Home /News /trending /

OLA ELECTRIC STARTS INVESTIGATION OF FIRE INCIDENT IN PUNE WHERE OLA ELECTRIC BIKE BURNT VIRAL VIDEO MKS GH

Ola Electric Scooter: ఎండకే మండిందా? తయారీ లోపమా? -ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఘటన ఎలా? -Video

పుణెలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ దగ్ధం

పుణెలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ దగ్ధం

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి దానంతట అదే మంటల్లో కాలిపోయిన ఘటన పుణెలో కలకలం రేపింది. ఓలా బైక్ తగలబడుతోన్న దృశ్యాలు వైరలయ్యాయి. దీనిపై ఓలా ఎలక్ట్రిక్ సంస్థ స్పందించింది..

రెండు రోజుల క్రితం పూణె (Pune)లోని లోహెగావ్ ప్రాంతంలో పార్క్ చేసిన ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro) స్కూటర్‌లో మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. చూస్తుండగానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooter) మంటల్లో కాలిపోయింది. ఇలా అగ్నికి ఆహుతి అయిన ఈ ఓలా స్కూటర్‌కు సంబంధించి ఓ వీడియో దదేశవ్యాప్తంగా వైరల్ అయింది. దీంతో ఈ కంపెనీ స్కూటర్లపై పెద్ద ఎత్తున అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఘటనపై పూణె ఓలా ఎలక్ట్రిక్ (Pune Ola Electric) సంస్థ స్పందించింది. శనివారం మధ్యాహ్నం పూణెలో తమ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు చెలరేగడానికి కారణమేంటో తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపింది. అలానే ఈ స్కూటర్ బాధ్యతలు కూడా టేకప్ చేసినట్లు ఓలా కంపెనీ వెల్లడించింది. అయితే ఈ అగ్నిప్రమాదానికి గల ప్రాథమిక కారణమేంటో కూడా కంపెనీ ఇప్పటికీ ప్రకటించకపోవడం గమనార్హం.

ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షి జబ్బర్ సింగ్ పురోహిత్ మాట్లాడుతూ, “ఈ ఓలా స్కూటర్ పార్క్ చేసిన మెయిన్ రోడ్డుపై మా కమర్షియల్ షాప్ ఉంది. ఈ స్కూటర్ నుంచి మొదట పొగలు బయటకొచ్చాయి. కొన్ని సెకన్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద శబ్ధం రావడంతో బైక్ దగ్గరికి వెళ్లేందుకు ఎవరూ ధైర్యం చేయలేదు. ఈ స్కూటర్ యజమాని కూడా ఎక్కడా కనిపించలేదు. మా సొసైటీ వాచ్‌మెన్ మంటలను ఆర్పడానికి ప్రయత్నించాడు, కానీ ఫలితం లేదు" అని చెప్పుకొచ్చాడు.


CM KCR లెక్క తప్పిందా? -హ్యాండివ్వనున్న ప్రశాంత్ కిషోర్ -కాంగ్రెస్‌ గూటికి ఎన్నికల వ్యూహకర్త!


ఈ సంఘటన ఎలక్ట్రిక్ స్కూటర్ల సేఫ్టీపై కొన్ని సీరియస్ ప్రశ్నలను లేవనెత్తింది. పెట్రోల్ ధరల పెరుగుదల కారణంగా ప్రజలు ఎలక్ట్రిక్ బైక్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే వీటి కొనుగోళ్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం వీటికి పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఈ ఇన్సిడెంట్ పై ఇన్వెస్టిగేషన్ చేసి ఓలా కంపెనీ ఏం చెబుతుందో చూడాలి.

Petrol Diesel Prices: భారీగా తగ్గిన క్రూడ్ ఆయిల్ రేటు.. దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెంపు..


ఈ దుర్ఘటన తర్వాత ఎలక్ట్రిక్ స్కూటర్ల టెక్నికల్ అంశాల గురించి పూణెలోని ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ల షోరూమ్‌ మేనేజర్ అభిప్రాయాలను వెల్లడించారు. “ఎలక్ట్రిక్ బైక్‌ల టెక్నాలజీ, ఇంజిన్ భారతీయ కమ్యూనిటీకి కొత్తది. ఎలక్ట్రిక్ బైక్ రంగంలో నిరంతరం అప్‌గ్రేడేషన్, పరిశోధనలు జరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ బైక్‌కు మంటలు అంటుకోవడం వంటి ఒక సంఘటన, ఇతర ఆటగాళ్లందరినీ అప్రమత్తం చేస్తుంది. రైడర్ సేఫ్టీ మాకు అత్యంత ముఖ్యమైనది, ” అని ఒక షోరూమ్‌ మేనేజర్ చెప్పుకొచ్చాడు.

Telangana: కొత్త కారు కొనివ్వలేదని యాసిడ్‌ తాగాడు.. మంట తట్టుకోలేక అరుపులు.. చివరికి..


ఓలా ఎలక్ట్రిక్ తాజా అధికారిక ప్రకటనలో ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని వెల్లడించింది. "మంటల్లో దగ్ధమైన స్కూటర్ ఘటనపై విచారణ జరుగుతోంది. ఓలా కాలిపోయిన స్కూటర్ బాధ్యతను తీసుకుంది. దర్యాప్తు కొన్ని రోజుల్లో పూర్తవుతుంది. అప్పటి వరకు దయచేసి ఎలాంటి నిర్ధారణలకు రావద్దని మేం మిమ్మల్ని కోరుతున్నాం" అని ఓలా ఎలక్ట్రిక్ పేర్కొంది.


Mayawati: రాష్ట్రపతిగా మాయావతి.. బీజేపీ అనూహ్య ఎత్తుగడ.. బీఎస్పీ అధినేత్రి రియాక్షన్ మామూలుగా లేదు!


ఓలా పూణె బ్రాంచ్ తో పాటు ఓలా మెయిన్ బ్రాంచ్ కూడా ఈ ఘటనపై స్పందించింది. "ఓలా స్కూటర్ యజమానితో టచ్‌లో ఉన్నాం. ఓలా దృష్టిలో వెహికల్స్ సేఫ్టీ చాలా ముఖ్యమైనది. మేం మా వెహికల్స్ లో అత్యధిక నాణ్యత ప్రమాణాలకు కట్టుబడి ఉన్నాం. మేం ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నాం. వీలైనంత త్వరగా తగిన చర్యలు తీసుకుంటాం. దీనిపై అప్డేట్ త్వరలోనే అందరికీ తెలియజేస్తాం" అని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Published by:Madhu Kota
First published:

Tags: Ola, Ola electric, Ola Electric Scooter, Pune, Viral Video

తదుపరి వార్తలు