ఆకాశంలో వింత మనిషి... ఆశ్చర్యపోయిన అమెరికా అధికారులు

అతను ఎవరు? ఎలా ఎగురుతున్నాడు? 3వేల అడుగుల ఎత్తుకు ఎలా వెళ్లాడు? ఎటువెళ్లాడు? ఏమైపోయాడు? ఇలా ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు సవాల్ విసురుతున్నాయి.

news18-telugu
Updated: September 5, 2020, 6:38 AM IST
ఆకాశంలో వింత మనిషి... ఆశ్చర్యపోయిన అమెరికా అధికారులు
ఆకాశంలో వింత మనిషి... ఆశ్చర్యపోయిన అమెరికా అధికారులు (credit - twitter - File)
  • Share this:
అమెరికా... లాస్ ఏంజిల్స్ ఎయిర్‌పోర్ట్ దగ్గర్లో జరిగిన ఓ ఘటన... ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఏంటంటే... ఏకంగా 3వేల అడుగుల ఎత్తులో ఓ వ్యక్తి ఎగురుతూ వెళ్లాడని అమెరికా విమాన పైలెట్లు చెప్పారు. అతను జెట్‌ప్యాక్ సాయంతో ఎగురుతూ వెళ్లి ఉండొచ్చని అన్నారు. సమస్యేంటంటే... అంత ఎత్తుకి మనిషి జెట్‌ప్యాక్‌తో ఎగురుతూ వెళ్లలేడని అంటున్నారు అధికారులు. ఎయిర్‌పోర్టుకి విమానాన్ని నడుపుతూ వస్తున్న పైలెట్లకు ఏదో కనిపించింది. అది ఏంటి అని చూస్తే... సైడ్ విండోల్లోంచీ చూశారు. నల్లటి నీడలాంటి ఆకారం ఆకాశంలో అలా దూసుకుపోతోంది. అచ్చం మనిషిలా అనిపించాడు. వెంటనే కంట్రోల్ రూంకి విషయం చెప్పారు. అలా ఎగిరే ఛాన్సే లేదన్నారు అధికారులు. పైలెట్లు మాత్రం తాము చూసింది మనిషినే అంటున్నారు. దీనిపై FBI దర్యాప్తు ప్రారంభించింది.




జెట్‌ప్యాక్ ఏవియేషన్ సంస్థ మాత్రం CEO డేవిడ్ హేమాన్ మాత్రం 3వేల అడుగుల ఎత్తుకు వెళ్లి... తిరిగి కిందకు రావడం కష్టమని తెలిపారు. అంత ఇంధనాన్ని జెట్‌ప్యాక్‌లో తీసుకెళ్లడం కుదరదన్నారు. పైలెట్లు చూసింది డ్రోన్ కావచ్చేమో అని అన్నారు. ఒకవేళ అది మనిషే అయితే... సొంతంగా తయారుచేసుకున్న జెట్ ప్యాక్‌తో ఎగిరి ఉంటారని అనుకోవచ్చని తెలిపారు. తాము మాత్రం ఎవరికీ జెట్‌ప్యాక్ అమ్మలేదని స్పష్టం చేశారు.




ఈ సంవత్సరం ఫిబ్రవరిలో దుబాయ్‌లో విన్స్ రెఫెట్... జెట్‌ప్యాక్‌తో 6వేల అడుగుల ఎత్తుకు వెళ్లి... తిరిగి ప్యారాచూట్ వాడి కిందకు దిగాడు. ఒకవేళ పైలెట్లు చూసిందే నిజమైతే... ఆ వ్యక్తికి రూ.20లక్షల దాకా ఫైన్ వేస్తారని అంటున్నారు. మొత్తానికి ఈ ఘటన ఎయిర్‌పోర్ట్ అధికారులకు టెన్షన్ తెప్పించింది.
Published by: Krishna Kumar N
First published: September 5, 2020, 6:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading