మనలో చాలా మంది ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ కనబరుస్తారు. రోజు సూర్యనమస్కారాలు, వాకింగ్ లు చేస్తుంటారు. మరికొందరు.. యోగా, రన్నింగ్ కూడా చేస్తారు. అదే విధంగా.. కొంత మంది జిమ్ లకు కూడా వెళ్తుంటారు. కరోనా మహమ్మారి బయట పడ్డనుంచి జనాల్లో హెల్త్ కాన్షియస్ ఎక్కువయ్యింది. తమ ఆరోగ్యం పట్ల ఎక్కువ మంది శ్రద్ధ కనబరుస్తున్నారు. అందుకు తమ ఆరోగ్యం కోసం రకరకాల మార్గాలను అనుసరిస్తున్నారు.
కొందరు అత్యంత చల్లని ప్రదేశాల్లో కూడా ఎక్సర్ సైజ్ లు, ఆసనాలు వేస్తుంటారు. కొందరు నేల మీద, నదుల్లో నీటిపైన తేలుతూ ఆసనాలు వేస్తుంటారు. అదే విధంగా ఎముకలు కొరికే చలిలో కూడా ఆసనాలు వేసిన అనేక ఘటనలు గతంలో వెలుగులోనికి వచ్చాయి. తాజాగా, మరో ఘటన నెట్టింట వైరల్ గా (viral video) మారింది.
#WATCH | An ITBP officer practicing 'Surya Namaskar' at 18,000 feet in Ladakh in snow conditions & sub-zero temperatures
(Source: ITBP) pic.twitter.com/URB8CIMHQk
— ANI (@ANI) July 20, 2022
పూర్తి వివరాలు.. లడక్ లో (Ladakh) భూమి నుంచి దాదాపు.. 18 వేల అడుగుల ఎత్తులో ఒక అధికారి యోగాసనాలు వేశాడు. ఇండో టిబెటర్ బార్డర్ పోలీసు అధికారి షర్ట్ తీసివేసి.. సూర్యనమస్కార్ ఆసనాలు వేస్తున్నారు. ఎముకలు కొరికే చలిని ఏమాత్రం కూడా లెక్కచేయకుండా అధికారి వేస్తున్న ఆసనాలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది. కాగా, ఐటీబీపీ అధికారి ఫిట్ నెస్ ధైర్యం, యోగాసనాలపై పలువురు అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇది తోటి ఉద్యోగులలో మనో ధైర్యం నింపుతుందని తెలిపారు. దేశం కోసం శత్రుమూకలు మన దేశంలో ప్రవేశించకుండా... గడ్డకట్టే చలిలో కూడా జవాన్లు పగలు, రాత్రి లెక్కచేయకుండా.. గస్తీ కాస్తుంటారు. ప్రస్తుతం ఈ వీడియో (viral video) మాత్రం నెట్టింట (social media) తెగ ట్రెండింగ్ మారింది. దీన్ని చూసిన అధికారులు షాకింగ్ కు గురౌతున్నారు.
ఇదిలా ఉండగా వెడ్డింగ్ రిసెప్షన్ లో షాకింగ్ ఘటన జరిగింది.
హవాయి బిగ్ ఐలాండ్ పశ్చిమ తీరంలో కైలువా-కోనాలోని హులిహీ ప్యాలెస్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఉన్న హోటల్ లో పెళ్లి రిసెప్షన్ వేడుకను ప్లాన్ చేశారు. అప్పుడు బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున అక్కడ హజరయ్యారు. కార్యక్రమం ఎంతో సందడిగా జరుగుతుంది. అతిథులంతా.. పార్టీలో నిమగ్నమయ్యారు. ఇంతలో షాకింగ్ ఘటన జరిగింది. హవాయిలో సముద్రతీర వివాహ వేడుకలో భారీ అలల శ్రేణిని ఢీకొట్టింది.
దీంతో అక్కడి వారు.. భయంతో దూరంగా పరుగులు పెట్టారు. చూస్తుండగానే.. వెంట వెంటనే అలలు, ఒడ్డువైపునకు వచ్చాయి. దీంతో అతిథులు భయంతో పరుగులు పెట్టారు. కొంత మంది నీళ్లలో తడిసిపోయారు. అక్కడ ఉన్న కుర్చీలు, పదార్థాలంతా నీళ్లలో తడిసిపోయాయి. అక్కడి వారు.. ఈ ఘటనను వీడియో తీస్తున్నారు. ప్రస్తుతంఈ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ గా (Viral video) మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ladakh, Viral Video