Home /News /trending /

OFFICERS SENT SHOW CAUSE NOTICE TO THE DECEASED PERSON IN SANGAREDDY DISTRICT NS

చనిపోయిన వ్యక్తితో జీహెచ్ఎంసీ ఎన్నికల డ్యూటీ చేయిస్తామంటున్న అధికారులు.. షాకవుతున్న ప్రజలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad-GHMC Elections: చనిపోయిన వ్యక్తితో డ్యూటీ చేయించడమేంటని షాకవుతున్నారా? నిజం నమ్మండి. ఇలా చేసి సంచలనం సృష్టించేందుకు సంగారెడ్డి జిల్లా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇందు కోసం చనిపోయిన అధికారికి జీహెచ్ఎంసీ ఎన్నికల డ్యూటీ కూడా వేశారు. ఈ నెల 26న ట్రైనింగ్ కు రావాలని ఆదేశాలు పంపించారు.

ఇంకా చదవండి ...
    చనిపోయిన వ్యక్తితో డ్యూటీ చేయించడమేంటని షాకవుతున్నారా? నిజం నమ్మండి. ఇలా చేసి సంచలనం సృష్టించేందుకు సంగారెడ్డి జిల్లా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇందు కోసం చనిపోయిన అధికారికి జీహెచ్ఎంసీ ఎన్నికల డ్యూటీ కూడా వేశారు. ఈ నెల 26న ట్రైనింగ్ కు రావాలని ఆదేశాలు పంపించారు. అంతటితో ఆగకుండా ట్రైనింగ్ కు ఎందుకు రాలేదని.. ఇందుకు కారణం చెప్పాలంటూ షోకాజ్ నోటీస్ సైతం జారీ చేశారు. అయితే ఆ నోటీస్ అందుకున్న కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. చనిపోయిన వ్యక్తి ఎలక్షన్ డ్యూటీ ఎలా చేస్తాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుననారు. వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రానికి చెందిన ఎండీ మొయిజొద్దీన్ గతంలో పంచాయతీ సెక్రటరీగా ఉద్యోగం చేసేవాడు.

    అయితే విధి నిర్వహణలో భాగంగా అతడు గత సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీనా సంగారెడ్డి నుంచి న్యాల్కల్ కు బైక్ పై వెళ్తుండగా యాక్సిడెంట్ జరగడంతో అతను అక్కడిక్కడే చనిపోయాడు. ఇదిలా ఉంటే.. సంగారెడ్డి కలెక్టరేట్ అధికారులు చనిపోయిన మోయిజోద్దీన్ కు జీహెచ్ఎంసీ ఎన్నికల డ్యూటీ వేశారు. ఈ నెల 26న సంగారెడ్డి కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి రావాలని ఆదేశించారు. ఆ సమయంలోనూ అధికారులు సరిగా వెరిఫై చేసుకోకుండా ట్రైనింగ్ రాలేందంటూ మరో నోటీస్ విడుదల చేశారు.

    నీపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోవద్దో చెప్పాలని.. 27వ తారీఖున కలెక్టరేట్ కు వచ్చి వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసును జారీ చేశారు. ఆ నోటీస్ ఈ సారి ఇంటికి రావడంతో కుటంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. చనిపోయిన 21 నెలల తర్వాత ఈ నోటీసులు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యానికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తుందని పలువురు వాఖ్యానిస్తున్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Death, GHMC, Hyderabad - GHMC Elections 2020, Sangareddy

    తదుపరి వార్తలు