హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

నిన్నటి వరకు పల్లీలు అమ్మాడు..ఇప్పుడు పాప్‌ సింగర్‌గా బాప్ అయ్యాడు

నిన్నటి వరకు పల్లీలు అమ్మాడు..ఇప్పుడు పాప్‌ సింగర్‌గా బాప్ అయ్యాడు

Bhuban Badyakar: ఒక్క పాట అతని లైఫ్‌ని టర్న్ చేసింది. పని చేసుకుంటే తీసిన కూనిరాగం ఇప్పుడు లక్షల అడ్వాన్స్‌లు ఇచ్చే స్టేజ్‌కి తీసుకెళ్లింది. పల్లీలు, శనగలు అమ్ముకునే వాడ్ని పాప్‌ సింగర్‌ రేంజ్‌కి తీసుకెళ్లింది. సోషల్ మీడియా పుణ్యమా అంటూ కచా బాదమ్ సింగర్ భుబన్‌ కాస్తా పబ్‌లో లైవ్‌ సింగర్‌గా మార్చేసింది.

ఇంకా చదవండి ...

పల్లీలు అమ్ముకునే వ్యక్తి పాట పాడటం, అది ప్రపంచమంతా వినడం, అతనో పాపులర్ సింగర్ అవడం ఇదంతా చెప్పుకోవడానికి కాస్త ఇమాజినేషన్‌గా ఉంటుంది. కాని సోషల్ మీడియా వల్లే ఇదంతా సాధ్యమైంది. పశ్చిమ బెంగాల్‌(West Bengal)కి చెందిన భుబన్ బడైకర్ (Bhuban Badyakar)తన జీవనోపాధి కోసం ఏదో అలా హమ్మింగ్ చేసిన కచా బాదమ్ (Kacha Badam) ట్యూన్ ఇప్పుడు తెగ వైరల్ అయిపోయింది. లక్కు అతనికి సోషల్ మీడియా రూపంలో ఎదురై సైకిల్ మోటర్‌పై పల్లీలు, శనగలు అమ్ముకునే వ్యక్తిని కోల్‌కతా (Kolkata)లో ఓ నైట్‌ క్లబ్‌లో లైవ్‌ సింగర్‌(Nightclub Live Singer)గా మార్చేసింది. ఇప్పుడు ఓ పాపులర్ సింగర్‌గా మారిపోయిన భుబన్ ఇకపై తాను శనగలు, పప్పులు అమ్ముకోవాల్సిన అవసరం లేదంటున్నాడు. ఎందుకంటే అతను పాడిన ఫస్ట్ సాంగ్ పాపులారిటీ చూసి బోలెడన్ని ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. గత వారంలోనే ఓ మ్యూజిక్‌ ఆల్బమ్ తయారు చేసే సంస్థ భుబన్ రాబోయే ట్యూన్ కోసం 3 లక్షలు అడ్వాన్స్‌(Next tune ‌ 3 lakhs)గా ఇవ్వడం విశేషం. సెలబ్రిటీ, పబ్లిక్‌ ఫిగర్‌ కావాలంటే గతంలో చాలా కష్టపడాల్సిన అవసరం ఉండేది. కాని ప్రజెంట్‌ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ దాన్ని చాలా సులువుగా మార్చేసింది. వెస్ట్ బెంగాల్‌ బీర్బూంలోని మారుమూల గ్రామానికి చెందిన వ్యక్తి భుబన్‌ బడైకర్ లైఫ్‌ స్టైలే అందుకు ఎగ్జామ్‌పుల్‌. మోటర్‌ సైకిల్‌పై శనగలు,పప్పులు అమ్ముకుంటూ జీవనోపాధి పొందేవాడు.

పల్లీవాలా పాప్‌ సాంగ్‌ కా బాప్ బన్‌గా..

రోజు ఊరూరు తిరిగి శనగలు అమ్మితే వచ్చే డబ్బు కనీసం కూలీ డబ్బులు కూడా గిట్టేవి కావు. అదే సంపాదనతో కుటుంబాన్ని పోషించుకుంటున్న భుబన్ కచా బాదమ్ పాటతో ఓవర్‌ నైట్ స్టార్‌ అయిపోయాడు. ఎంతగా అంటే బెంగాలీలో పాడిన కచా బాదమ్ పాట భాషలు, ప్రాంతాలకు అతీతంగా వరల్డ్‌ వైడ్‌గా పాపులర్ అయ్యింది. మనోడికి విపరీతమైన పేరు తెచ్చిపెట్టింది. ఆ పాపులారిటీతోనే కోల్‌కతాలోని ఓ ఫేమస్ నైట్‌ క్లబ్‌లో లైవ్‌ సింగర్‌గా అవకాశాన్ని కల్పించింది.

సోషల్ మీడియా తయారు చేసిన స్టార్..

లైఫ్‌లో ఓ రేంజ్‌ గుర్తింపు, సెలబ్రిటీ హోదాకి చేరుకోవాలంటే చాలా కష్టపడాలి. కాని కచా బాదమ్ సింగర్ భుబన్‌కు గుర్తింపు, పాపులారిటీ ఒకే సారి రావడంతో కష్టాలన్ని తొలగిపోయాయి. అతని పాటలకు మిలియన్‌ వ్యూస్‌ వస్తున్నాయి. సెలబ్రిటీలు సైతం ఆ పాటలకు స్టెప్పులు వేస్తున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తే కూడా లక్షల్లో వ్యూస్ దాటిపోతున్నాయి.

ఇకపై భుబన్ లీఫ్‌ అంతా బిందాస్..

లైఫ్‌లో ఇంత గొప్ప స్థానానికి చేరుకున్న భుబన్ కోల్‌కతాలోని నైట్‌క్లబ్‌లో లైవ్ ప్రోగ్రామ్‌ చేస్తూ తన హ్యాపీనెస్‌ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు. తనకు ఇంత పేరు , ప్రతిష్టలు, గుర్తింపు రావడానికి కృషి చేసిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. నిన్నటి వరకు కామెన్‌ జీవితాన్ని గడిపిన భుబన్ ..సూటు వేసుకొని కళ్లకు కూలింగ్ గ్లాసెస్‌ పెట్టుకొని తన ఫేమస్ సాంగ్‌ కచా బాదమ్ సాంగ్‌ని పాడటంతో పబ్‌కి వచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలు కేకలు పెట్టారు.

First published:

Tags: Social medai, West Bengal

ఉత్తమ కథలు