HOME »NEWS »TRENDING »odishas mountain man wants to return padma shri to government as it has effectively snatched his source of livelihood away bs

పద్మశ్రీ వల్లే దరిద్రం పట్టుకుందట.. నాకు ఆ అవార్డు వద్దే వద్దంటున్న..

పద్మశ్రీ వల్లే దరిద్రం పట్టుకుందట.. నాకు ఆ అవార్డు వద్దే వద్దంటున్న..
దైతరీ నాయక్

Padma Shri: ఒడిశాలోని కియోంఝర్ జిల్లా తాళబైతరణి గ్రామానికి చెందిన గిరిజన రైతు దైతరీ నాయక్(75).. సాగునీటి వసతి లేక ఊరి రైతులు పడుతున్న అరిగోసను తీర్చేందుకు పలుగు, పార పట్టి ఒంటిచేత్తో గోనాసికా పర్వతాల మధ్య 3 కిలోమీటర్ల మేర కాల్వను తవ్వారు.

  • Share this:
    పద్మశ్రీ.. భారత ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక అవార్డు. ఈ అవార్డు దక్కడం అంటే మామూలు విషయం కాదు. పలు రంగాల్లో గొప్ప ప్రతిభ చూపే వారికి దక్కే ఈ అవార్డు.. ఓ రైతుకు మాత్రం దరిద్రం తెచ్చి పెట్టిందట. వివరాల్లోకెళితే, ఒడిశాలోని కియోంఝర్ జిల్లా తాళబైతరణి గ్రామానికి చెందిన గిరిజన రైతు దైతరీ నాయక్(75).. సాగునీటి వసతి లేక ఊరి రైతులు పడుతున్న అరిగోసను తీర్చేందుకు పలుగు, పార పట్టి ఒంటిచేత్తో గోనాసికా పర్వతాల మధ్య 3 కిలోమీటర్ల మేర కాల్వను తవ్వారు. బైతరణీ నదీ జలాలను ఊరివైపు మళ్లించాడు. దీంతో గ్రామంలోని మరో 100 ఎకరాల పంట పొలాలకు సాగుజలాలు అందాయి. ఈ గొప్ప పని చేసినందుకు ఆయనకు పద్మశ్రీ అవార్డు దక్కింది. అయితే, ఆ అవార్డు దక్కినప్పటి నుంచే ఆయన పేదరికంలోకి వెళ్లిపోతున్నారట. ఎందుకంటే.. అంతకుముందు వరకు ఊళ్లో అందరితో కలిసి కూలీ పనులు చేసిన ఆయనకు.. పనులు ఇవ్వడం మానేశారు. కూలీ పనులు చేసే స్థాయి తమది కాదంటూ ఆయనకు గౌరవం ఇస్తూ పనులు అప్పజెప్పడం లేదంట. దీంతో గౌరవం దక్కుతున్నందుకు సంతోషపడాలో.. పని దొరకనందుకు బాధపడాలో తెలియక నాయక్‌ మనోవేదన అనుభవిస్తున్నారట.

    దీంతో ఆయన సంచలన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఆ అవార్డు అందుకున్న తర్వాతే తనను దరిద్రం పట్టుకుందని, డబ్బుల్లేక చీమగుడ్డు తింటూ కడుపు నింపుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారాయన. తునికాకు ఏరుతూ, మామిడి తాండ్ర అమ్ముతూ వచ్చే కొద్దిపాటి డబ్బులతో కష్టంగా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పద్మశ్రీ అవార్డును సర్కారుకు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే, ఆయనకు నచ్చజెప్పి, నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేస్తామని అధికారులు చెబుతున్నారు.

    Published by:Shravan Kumar Bommakanti
    First published:June 26, 2019, 11:44 IST