HOME »NEWS »TRENDING »odisha transport department changes bus timings after school student complains of being late for school every day krs

స్కూల్ పిల్లాడి రిక్వెస్ట్​.. బస్సు టైమింగ్స్ మార్చిన రవాణా శాఖ

స్కూల్ పిల్లాడి రిక్వెస్ట్​.. బస్సు టైమింగ్స్ మార్చిన రవాణా శాఖ
Twitter image

పాఠశాలకు వెళ్లేందుకు తనకు ప్రతీరోజు లేట్ అవుతోందని, బస్సు టైమింగ్స్ మార్చాలని ఓ విద్యార్థి చేసిన ట్వీట్​కు స్పందించింది ఒడిశా రవాణా శాఖ. వెంటనే సమస్యను పరిష్కరించింది.

  • Share this:
    సోషల్ మీడియా వేదికగా ఎన్నో సమస్యలు వెలుగులోకి వస్తాయి. కొన్నిసార్లు ప్రభుత్వాలు, అధికారులు స్పందించి ఆ సమస్యలను తీర్చిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో ప్రజల ఇబ్బందులను సోషల్ మీడియా వేదికగానూ స్వీకరిస్తున్నారు. ఇదే తరుణంలో ఒడిశాకు చెందిన ఓ విద్యార్థి కోరడంతో బస్సు టైమింగ్​ను ఒడిశా రవాణా శాఖ మార్చింది.

    సాయి అన్వేష్ అనే విద్యార్థి భువనేశ్వర్​లోని ఎంబీఎస్​ పాఠశాలలో చదువుకున్నాడు. స్కూల్​కు అతడు ఉదయం 7.30 కల్లా చేరుకోవాల్సి ఉంది. అయితే లింగిపూర్​లో ఉంటున్న అతడు రూట్​ నంబర్​-13 బస్సు ఎక్కి స్కూల్​కు చేరుకునే సరికి 7.40 అవుతోందట. దీంతో రోజూ 10 నిమిషాలు ఆలస్యంగా పాఠశాలకు వెళుతుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయట. ఈ విషయాన్ని క్యాపిటల్ రీజనర్​ అర్బర్ ట్రాన్స్​పోర్ట్​ భువనేశ్వర్​ (సీఆర్​యూటీ)తో పాటు ఆ సంస్థ ఎండీ, ఐపీఎస్ అధికారి అరుమ్​ బోత్రాను ట్యాగ్ చేస్తూ ఆ పిల్లాడు ట్వీట్ చేశాడు.



    “రెస్పెక్టెడ్ సర్​. భువనేశ్వర్​లోని ఎంబీఎస్ పబ్లిక్ స్కూల్​లో నేను చదువుతున్నా. స్కూల్​కు వెళ్లేందుకు నేను ప్రతీ రోజు Mobus​లో ప్రయాణిస్తున్నా. ఇటీవలి కాలంలో బస్సు టైమింగ్స్ మార్చారు. నేను స్కూలుకు ఉదయం 7.30గంటల కల్లా వెళ్లాలి. కానీ రూట్​-13లోని ఫస్ట్ బక్ ఎక్కి లింగిపూర్ నుంచి స్కూల్​కు వెళ్లేసరికి 7.40 అవుతోంది. దీనివల్ల రోజూ లేట్​గా వెళ్లాల్సి వస్తోంది. అందుకే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. ఈ విషయాన్ని గమనించి సత్వర చర్యలు తీసుకుంటే చాలా సంతోషిస్తా” అని విద్యార్థి అన్వేష్ ట్వీట్లు చేశాడు.

    @CRUT_BBSR @arunbothra 

    ఈ పిల్లాడి ట్వీట్​ను చూసిన సీఆ​ర్​యూటీ ఎండీ అరున్ బోత్రా స్పందించారు. సోమవారం నుంచే బస్ టైమ్స్ మారుస్తున్నామని తెలిపారు. “మీ లాంటి ప్రయాణికులను ఎంవో బస్ ప్రేమిస్తుంది. సోమవారం నుంచి బస్ టైమ్స్​ మారుస్తున్నాం. మొదటి బస్ ఉదయం 7గంటలకే ప్రారంభం అవుతుంది. ఇక ఇప్పటి నుంచి నువ్వు స్కూల్​ వెళ్లడం లేట్ అవదు” అని ఆయన బదులుఇచ్చారు.


    ఓ విద్యార్థి అభ్యర్థనతో బస్ టైమింగ్స్ మార్చిన అరుణ్​తో పాటు ఒడిశా రవాణా శాఖను నెటిజన్లు అభినందిస్తున్నారు. చాలా సంతోషం వ్యక్తం చేశారు.

    No If & But

    ఇంత త్వరగా సమస్యను పరిష్కరించడం చాలా అరుదు అని, థ్యాంక్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అద్భుతమైన టీమ్ వర్క్​, సత్వర నిర్ణయం, భేష్ అని మరికొందరు స్పందిస్తున్నారు. అన్ని విషయాల్లో ప్రభుత్వాలు ఇలా త్వరగా స్పందిస్తే దేశం త్వరగా అభివృద్ధి చెందుతుందని మరికొందరు ట్వీట్లు చేశారు.
    Published by:Krishna P
    First published:January 10, 2021, 11:27 IST

    टॉप स्टोरीज