కదులుతోన్న ఆర్టీసీ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. నిమిషాల్లోనే అగ్నికీలలు బస్సు మొత్తాన్ని చుట్టేశాయి.. అందులో ప్రయాణిస్తోన్న వారంతా అతి కష్టంమీద కిందికి దూకేశారు.. చూస్తుండగానే నడిరోడ్డుపైనే బస్సు దగ్ధమైపోయింది.. సర్వం కాలి బూడిదైపోయింది.. గగురుపాటుకు గురిచేసిన ఈ ఘటన విజయనగరం జిల్లా సరిహద్దు అవతల ఒడిశాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మావోయిస్టు ప్రభావిత అటవీ ప్రాంతంలో ఘటన జరగడంతో తొలుత అనుమానాలు తలెత్తినా ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా తెలుస్తోంది..
ఒడిశా స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్(ఓఎస్ ఆర్టీసీ)కి చెందిన బస్సు ఆదివారం రాత్రి కోరాపుట్ జిల్లాలో అగ్నికి ఆహుతైంది. రాయగడ జిల్లా కేంద్రం నుంచి కోరాపుట్ జిల్లా దండబాడికి వెళుతోన్న ఆర్టీసీ బస్సు.. కోరాపుట్ జిల్లా నారాయణపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదానికి గురైంది. నారాయణపట్నానికి 8 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో బస్సులో మంటలు చెలరేగాయి..
Omicron : ఖమ్మంలొ తొలి ఒమిక్రాన్ కేసు.. హైదరాబాద్ నుంచి వచ్చిన యువతికి పాజిటివ్..
బస్సులో మంటలను గుర్తించిన ప్రయాణికులు డ్రైవర్ ను అలర్ట్ చేయగా, బస్సును ఠక్కున ఆపేసి, హుటాహుటిన అందరూ కిందికి దిగి దూరంగా పరుగులు తీశారు. ప్రయాణికులు, సిబ్బంది కిందికి దిగన మరుక్షణంలోనే అగ్ని కీలలు బస్సంతా వ్యాపించాయి. భగభగ మంటల్లో ఆర్టీసీ బస్సు తగలబడుతోన్న దృశ్యాలను ప్రయాణికులు తమ ఫోన్లలో చిత్రీకరించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికొచ్చి మంటలను అదుపుచేశారు.
Ghulam Nabi Azad కాంగ్రెస్కు రాజీనామా.. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై కుండబద్దలు
కోరాపూట్ బస్సు దగ్ధం ఘటనలో ఏ ఒక్కరికీ గాయాలుగానీ, ప్రాణాపాయంగానీ జరుగలేదని తెలుస్తోంది. అయితే బస్సులో మంటలు తలెత్తడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు కాలిపోయిన తర్వాత చాలా సమయానికిగానీ ప్రయాణికులను మరో బస్సులో గమ్య స్థానాలకు చేర్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bus accident, Fire Accident, Odisha, RTC buses