హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

గది తలుపులేసి.. ప్రొఫెసర్ ను పరిగెత్తించి చెప్పుతో కొట్టిన భార్య.. ఎక్కడంటే..

గది తలుపులేసి.. ప్రొఫెసర్ ను పరిగెత్తించి చెప్పుతో కొట్టిన భార్య.. ఎక్కడంటే..

భర్తను కొడుతున్న మహిళ

భర్తను కొడుతున్న మహిళ

Odisha: తన భర్త పనిచేస్తున్న కాలేజీ క్యాంపస్ కు వెళ్లింది. బయట నుంచి డోర్ వేసి మరీ భర్తతో గొడవకు దిగింది. అంతటితో ఆగకుండా.. భర్తను ఇంట్లోనే పరిగెత్తించి మరీ కొట్టింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Odisha (Orissa), India

పెళ్లయ్యాక కొందరు అన్యోన్యంగా కలిసి ఉంటే, మరికొందరు మాత్రం ఎప్పుడు చూసిన తగవులాడుకుంటునే ఉంటారు. కొందరు తమ మధ్య ఏదైన చిన్నపాటి గొడవలు వస్తే, మాట్లాడుకుని సాల్వ్ చేసుకుంటారు. కొన్నిసార్లు పెద్ద వాళ్లు కల్గ చేసుకుని ఇరువురికి సర్ది చెప్తారు. అయితే.. కొందరు పవిత్రమైన పెళ్లి బంధానికి మచ్చను తీసుకొచ్చేలా ప్రవర్తిస్తుంటారు. భార్య, భర్తలు, ఇతరులతో ఎఫైర్ లు పెట్టుకుంటారు. ఒకరికి తెలియకుండా మరోకరు ఇతరులతో ప్రేమాయణాలు సాగిస్తారు. ఉద్యోగం చేసే చోట భర్త ఘనకార్యం వెలగబెడుతుంటే.. ఇంట్లో ఉండే భార్య, భర్త ఆఫీసుకు వెళ్లగానే ఇంట్లోనే దుకాణం పెట్టేస్తుంది. ఇలాంటి సంఘటనల వలన పవిత్రమైన పెళ్లి అనే వేడుక అపహస్యం పాలవుతుంది. కొన్నిసార్లు.. ఎఫైర్ లు (Affair)  రెడ్ హ్యండేడ్ గా దొరికిపోయిన సంఘటనలు కూడా అనేకం వార్తలలో నిలిచాయి. దీంతో దంపతుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరి, విడిపోయే వరకు వెళ్తుంటాయి. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తివివరాలు.. ఒడిశాలోని (Odisha)  యూనివర్సీటిలో షాకింగ్ ఘటన జరిగింది. అనిల్ కుమార్ తిరియాగా బెర్హంపూర్ యూనివర్శీటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. శనివారం ఒక మహిళ అతను ఉన్న గదికి వెళ్లింది. డోర్ తీయగానే కోపంతో రెచ్చిపోయింది. వెంటనే చెప్పుతో అతగాడిని కొట్టడం ప్రారంభించింది. దీంతో గదిలో అరుపులు, కేకల విన్పిస్తుండటంతో చుట్టుపక్కల వారు అక్కడికి వెళ్లి చూశారు. కొందరు ఆ ఘటనను రికార్డు చేశారు. దానిలో ఒక మహిళ, ప్రొఫెసర్ అనిల్ కుమార్ ను పరిగెత్తించి మరీ చెప్పుతో కొడుతుంది.

దీంతో యూనివర్సీటీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. వారు పదేపదే రిక్వెస్ట్ చేయడంతో ఎట్టకేలకు మహిళ మెయిన్ డోర్ ను తెరచింది. అయితే.. గొడవకు పాల్పడిన మహిళ , ప్రొఫెసర్ భార్య అని తెలుసుకుని అందరు షాక్ కు గురయ్యారు. ఇంట్లో కూర్చుని, మాట్లాడుకొవాలని సూచించారు. అయితే.. అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై శారీరకంగా దాడి చేసిన మహిళ అతని జీవిత భాగస్వామి అనే వాస్తవం గురించి యూనివర్సీటీ సిబ్బందికి ఎటువంటి ఆధారాలు లేవు. అనంతరం సిబ్బంది.. పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా (Viral news)  మారింది.

First published:

Tags: Odisha, VIRAL NEWS

ఉత్తమ కథలు