దుప్పట్లో మిన్నాగు.. పరుపులోకి దూరిన కింగ్ కోబ్రా

Snake in the bed | శరత్ పండిట్ అనే వ్యక్తి ఇంట్లోకి పాము ఎలా వచ్చిందో కానీ, మెల్లగా జొరబడింది. వాళ్లు బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లోకి వచ్చి మంచం ఎక్కేసింది. పరుపు కవర్‌లో దూరింది.

news18-telugu
Updated: August 26, 2020, 5:07 PM IST
దుప్పట్లో మిన్నాగు.. పరుపులోకి దూరిన కింగ్ కోబ్రా
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Cobra on bed | దుప్పట్లో మిన్నాగు అనేది యండమూరి వీరేంద్రనాథ్ రాసిన ఓ ఫేమస్ నవల. చాలా కాలం పాటు సాహిత్యాభిమానులను ఆకట్టుకుంది. అయితే, నిజంగా దుప్పట్లో కింగ్ కోబ్రా చేరితే ఎలా ఉంటుంది. తలుచుకోవడానికే భయం వేస్తుంది కదా. అలాంటి ఘటన నిజంగా జరిగింది. ఒడిశాలోని కటక్ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శరత్ పండిట్ అనే వ్యక్తి ఇంట్లోకి పాము ఎలా వచ్చిందో కానీ, మెల్లగా జొరబడింది. వాళ్లు బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లోకి వచ్చి మంచం ఎక్కేసింది. పరుపు కవర్‌లో దూరింది. ఆ విషయం తెలియని శరత్ పండిట్ ఇంటికి వచ్చిన తర్వాత మంచం మీద కూర్చున్నాడు. చేతికి ఏదో మెత్తగా తగిలేసరికి గుండె ఝల్లుమంది. వెంటనే హఠాత్తుగా కిందకు దూకేశాడు. ఆ తర్వాత భయం భయంగా కర్ర తీసుకుని వచ్చి దాన్ని టచ్ చేసి చూస్తే అది పాము అని అర్థమైంది. కానీ, దాన్ని ఎలా బయటకు తీయాలో అర్థం కాలేదు. వెంటనే స్నేక్ హెల్ప్ లైన్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. అక్కడి నుంచి స్నేక్ హెల్ప్ లైన్ మెంబర్స్ ఇద్దరు వచ్చారు. వారికి కూడా ఆ పామును బయటకు తీయడం చాలాఇబ్బందిగా మారింది. మొత్తానికి కష్టపడి పామును పట్టుకున్నారు. తీసుకుని వెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేశారు.

కొన్ని రోజుల క్రితం యూపీలోని మీర్జాపూర్‌లో ఓ యువకుడి ప్యాంట్‌లో పాము దూరి.. ప్రత్యక్ష నరకాన్ని చూపించింది. మీర్జాపూర్ జిల్లా సిందకర్‌పూర్ గ్రామంలో విద్యుత్ అధికారులు స్తంభాలు, వైర్లు బిగించే పనులు చేపట్టారు. ఈ పనులు చేసేందుకు వచ్చిన కార్మికులు గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో బస చేస్తున్నారు. పనులు పూర్తయ్యాక అక్కడే నిద్రపోతారు. ఈ క్రమంలో మంగళవారం లవ్లేష్ అనే కార్మికుడి ప్యాంటులోకి పాము దూరింది. ప్యాంట్‌లోకి ఏదో వెళ్లిందని నిద్రలేచి చూసుకుంటే పాము కనిపించింది. దాంతో అతడు వణికిపోయాడు. చేయి పెట్టి తీసేద్దామంటే కాటు వేస్తుందేమోనని భయం. ఓ స్తంభాన్ని పట్టుకొని పక్కకు కదలకుండా అలాగే నిలబడిపోయాడు. అలా రాత్రంతా బిక్కు బిక్కుమంటూ ప్రాణాలరచేత పట్టుకొని గడిపాడు. తెల్లవారిన తర్వాత స్థానికులకు విషయం తెలిసి పాములు పట్టేవారికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చాకచక్యంగా పామును బయటకు తీశారు. ఏడు గంటల నరకయాతన తర్వాత ఎట్టకేలకు లవ్లేష్ ప్యాంటు నుంచి పామును తీశారు. ముందు జాగ్రత్తగా అంబులెన్స్‌ను సిద్ధం చేశామని.. అతడికి ఎలాంటి హాని కలగలేదని గ్రామ పెద్దలు తెలిపారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 26, 2020, 5:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading