హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

68 రోజుల పాటు హనీమూన్.. పెళ్లైన కొంత జంటకు వింత అనుభవం..

68 రోజుల పాటు హనీమూన్.. పెళ్లైన కొంత జంటకు వింత అనుభవం..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఆరు రోజుల హనీమూన్ కాస్త 68 రోజులయ్యింది. వివరాల్లోకెళితే.. ఒడిసాలోని నవరంగపూర్‌ జిల్లా ఇచ్చాగుడ గ్రామానికి చెందిన శంకర హల్దార్‌, పల్లవి మిశ్రాలకు కొత్తగా పెళ్లైంది.

వారిద్దరికి కొత్తగా పెళ్లైంది.. జీవితంలో మధురానుభూతులను పంచుకుందామని హనీమూన్ ప్లాన్ చేసకున్నారు. మలేషియాకు వెళ్లేందుకు రాను పోను టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. ఆరు రోజులు అక్కడే ఉందామనుకున్నారు. ఆనందంగా ఫ్లైట్ ఎక్కి గమ్యం చేరుకున్నారు. అక్కడ ఉన్నన్ని రోజులు ఫుల్ ఎంజాయ్ చేశారు. కానీ.. ఇండియాకు వచ్చేందుకు రెడీ కాగానే.. కరోనా దెబ్బ పడింది. విమానాలన్నీ రద్దయ్యాయి. దీంతో ఆరు రోజుల హనీమూన్ కాస్త 68 రోజులయ్యింది. వివరాల్లోకెళితే.. ఒడిసాలోని నవరంగపూర్‌ జిల్లా ఇచ్చాగుడ గ్రామానికి చెందిన శంకర హల్దార్‌, పల్లవి మిశ్రాలకు కొత్తగా పెళ్లైంది. వీళ్లు మార్చి 12వ తేదీన మలేషియా వెళ్లారు. హానీమూన్‌ ముగించుకొని మార్చి 17వ తేదీన భారత్‌ రావాల్సి ఉంది. అదే సమయంతో లాక్‌డౌన్ పడింది.

అయితే మార్చి 17వ తేదీ రాత్రి మలేషియా విమానాశ్రయానికి చేరుకోగా అప్పటికే విమానాలు రద్దయ్యాయి. దీంతో వారు విమానాశ్రయంలో చిక్కుకు పోయారు. మలేషియా ప్రభుత్వం అక్కడే వారికి వసతి ఏర్పాట్లు చేసింది. చివరికి వందే భారత్ మిషన్‌లో భాగంగా ఈ నవ దంపతులు దాదాపు 68 రోజుల తరువాత శుక్రవారం నాడు భువనేశ్వర్‌ చేరుకున్నారు.

First published:

Tags: Bhuvaneshwar, Malaysia

ఉత్తమ కథలు