ఒడిశాలోని (Odisha) గంజాం జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. బెర్హంపూర్ లో ఉంటున్న వ్యక్తి.. కడుపు నొప్పిగా ఉందని, ఆరోగ్యం విషమిచండంతో అతడిని వెంటనే ఎంకేసీజీ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడి అతడిని చూసిన వైద్యులు కనీసం మల విసర్జనకు కూడా వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు. వెంటనే అతడికి ఎక్స్ రే తీయించారు. దానిలో పురీష నాళం (సిగ్మాయిడ్ కోలన్ ) లోపల గుండ్రంగా గ్లాస్ ఉండటాన్ని గమనించారు.. "అతని పరిస్థితి విషమంగా ఉన్నందున అదే రోజు శస్త్రచికిత్స నిర్వహించి గాజును వెలికితీసేందుకు వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు.
అసలేం జరిగిందంటే..
ఒడిశా కు చెందిన కృష్ణ చంద్ర రౌత్ అనే వ్యక్తి (45) జీవనోపాధికోసం గుజరాత్ లోని సూరత్ కు వెళ్లాడు. అక్కడ స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నారు. అయితే.. పార్టీ మధ్యలో స్నేహితులు పైశాచికంగా ప్రవర్తించారు. రౌత్ ప్రైవేటు పార్ట్ లో స్టీల్ గ్లాసును చొప్పించి, పైశాచికానందం పొందారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయారు. అప్పటి నుంచి రౌత్ ఆరోగ్యం విషమించింది. కనీసం మల విసర్జనకు కూడా వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. దీంతో తన ఒడిశా లోని తన సొంత గ్రామానికి వెళ్లిపోయాడు. అతడిని చూసిన కుటుంబ సభ్యులు , స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఎక్స్ రే తీశారు. దానిలో పురీష నాళం లో ఒక గ్లాసు ఉండటాన్ని గమనించారు.
దీనికి ఆపరేషన్ చేయాలని కుటుంబ సభ్యులకు తెలిపారు. కాగా, ప్రారంభంలో, సర్జన్లు మలద్వారం ద్వారా గాజును తొలగించడానికి ప్రయత్నించారు. తరువాత, మలద్వారంలో రేప్చర్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉన్నందున కొలోస్టోమీ ద్వారా పొత్తికడుపు కోత అనే లాపరోటమీని నిర్వహించాలని వారు నిర్ణయించుకున్నారు. గాజును తొలగించడానికి దాదాపు 2.5 గంటలు పట్టింది. రోగి పరిస్థితి బాగానే ఉందని, మరో నాలుగైదు రోజులు అబ్జర్వేషన్ లో ఉంటారని వైద్యులు తెలిపారు. అయితే ఆయనకు ప్రస్తుతం మూత్ర విసర్జన సమస్య లేదని డాక్టర్లు తెలిపారు. కాగా, 8 సెంటీమీటర్ల వ్యాసం, 15 సెంటీమీటర్ల పొడవున్న గాజును 10 రోజుల క్రితం మద్యం మత్తులో స్నేహితులు కృష్ణ చంద్ర రౌత్ మలద్వారంలో చొప్పించారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Odisha, Trending news, VIRAL NEWS