హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

OMG: ఏందిరా ఇది.. చనిపోయిన కూడా ఏనుగు మహిళను వదల్లేదు.. చితిమీద నుంచి శవాన్ని తుండంతో పైకెత్తి....

OMG: ఏందిరా ఇది.. చనిపోయిన కూడా ఏనుగు మహిళను వదల్లేదు.. చితిమీద నుంచి శవాన్ని తుండంతో పైకెత్తి....

మహిళపై దాడిచేసిన ఏనుగు

మహిళపై దాడిచేసిన ఏనుగు

Odisha: మహిళ గొట్టపు బావి నుంచి నీటిని తొడుకుంటుంది. ఇంతలో ఒక ఏనుగు అడవి నుంచి దారితప్పి బైటకు వచ్చింది. మహిళ దగ్గరకు కోపంగా వెళ్లింది.

ఏనుగులు  (Elephant) సాధారణంగా ఒక్కొసారి అడవి నుంచి దారితప్పి జనావాసాలకు వస్తుంటాయి. కొన్ని సార్లు అవి ఆడ తోడు దొరకనప్పుడు క్రూరంగా ప్రవర్తిస్తుంటాయి. అప్పుడు కంటికి కన్పించిన వారి మీద దాడికి పాల్పడతాయి. కొన్ని సార్లు మనుషులను కాళ్లతో తొక్కి చంపేస్తుంటాయి కూడా. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఒడిశాలోని (Odisha) మయూర్ భంజ్ లో ఒక ఏనుగు బీభత్సం చేసింది. 70 ఏళ్ల వృద్ధురాలు మాయ ముర్ము అనే మహిళ బావి నుంచి నీటిని తొడుకుంటుంది. ఆమె వెనుకాల నుంచి ఏనుగు వచ్చింది.ఆమెను కిందపడేసి కాళ్లతో తొక్కి దాడిచేసింది. ఆ తర్వాత.. స్థానికులు అక్కడికి చేరుకొవడంతో ఏనుగు దూరంగా వెళ్లిపోయింది. ఆమెను వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మహిళ చనిపోయింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆమెకు అంత్య క్రియలకు ఏర్పాట్లు చేశారు. మహిళను చితి మీద పడుకొబెట్టారు.

అప్పుడు షాకింగ్ ఘటన జరిగింది. మరోసారి ఏనుగు అక్కడికి వచ్చింది. చితిమీద ఉన్న మహిళ శవాన్ని ఏనుగు తన తొండంతో తీసుకుంది. మరోసారి తన కాలికింద పడేసింది. శవాన్ని తొక్కుతూ..  దూరంగా విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొన్ని గంటల తర్వాత అంత్యక్రియలు నిర్వహించినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఏనుగు వింత ప్రవర్తనకు కారణం ఏంటని ఆరా తీస్తున్నారు.

ఇదిలా ఉండగా ఒక గొరిల్లా సైక్లింగ్ చేసింది.

మీరు ఎప్పుడైన గొరిల్లా సైక్లింగ్ చేసింది చూశారా..?.. అసలు చూసుండరు. అయితే.. ఇక్కడో గొరిల్లా (Gorilla cycling) ఏంచక్కా సైకిల్ ఎక్కింది. అది తన రెండు కాళ్లతో అచ్చం మనుషుల మాదిరిగా పైడిల్ తొక్కుతూ సైకిల్ నడిపిస్తుంది. దాని పక్కనే మరో గొరిల్లా కూడా కూర్చుని ఉంది. దాని ముందు సైకిల్ తొక్కుకుంటూ పోజులు కొట్టింది. కానీ ఇంతలో ఊహించని సంఘటన జరిగింది. గొరిల్లా కాస్త బ్యాలెన్స్ తప్పి కింద పడింది. (Fall From Bicycle) దీంతో దానికి చిర్రెత్తుకొచ్చింది. యూ.. స్టుపిడ్ నన్నే పాడేస్తావా అన్నట్లు కోపంతో ఊగిపోయింది. వెంటనే తన ముందు ఉన్న సైకిల్ ను పైకి ఎత్తింది. ఆ తర్వాత దాన్ని దూరంగా పడేసింది.

పాపం.. సైకిల్ దెబ్బకు అందనంత దూరం పోయి పడింది. ప్రస్తుతం ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి సామ్రాట్ గౌడ తన ఇన్ స్టా హ్యండిల్ లో పోస్ట్ చేశారు. దీనికి స్టుపిడ్ సైకిల్ అనే కామెంట్ జతచేశారు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో  నెట్టింట వైరల్ గా మారింది. దీన్నిచూసిన నెటిజన్ లు షాక్ తో నోరెళ్లబెడుతున్నారు. ఇంకా నయం.. దాని కోపం మరో గొరిల్లా మీద చూపించ లేదంటూ కామెంట్ లు చేస్తున్నారు.

First published:

Tags: Attack, Elephant, Odisha

ఉత్తమ కథలు