అరుదైన ఆపరేషన్‌లు ఎక్కడైనా మనుషులు ప్రాణపాయస్థితిలో ఉంటే చేస్తారు. లేదంటే సమాజానికి మేలు జరుగుతుందన్న సందర్భాల్లో జంతువులు, వన్యప్రాణులకు డాక్టర్లు వారి శాస్త్రపరిశోధనల ఆధారంగా సర్జరీ(Surgery)లు చేస్తారు. కానీ ఒడిశాలో మాత్రం ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకరమైన విషం చిమ్మే సర్పానికి అద్భుతమైన ఆపరేషన్ చేసి ఔరా అనిపించుకున్నారు. ఒడిషాలో డాక్టర్లు ఆ అరుదైన ఆపరేషన్ ఎవరికి చేశారో తెలుసా..? ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విషసర్పంగా పేరున్న నల్లత్రాచు(King cobra)కి సర్జరీ (Surgery)చేశారు. మనిషిని చూస్తే పది అడుగుల ఎత్తు వరకు ఎగిరి పడగ విప్పి బుసలు కొడుతూ కాటేసే నల్లత్రాచుకి ఆపరేషన్ చేశారు. అదేంటి..ప్రాణాలు తీసే పాముని కాపాడటం కోసం ఇంత రిస్క్ చేశారా అని ఆశ్చర్యపోకండి. మీరు నమ్మకపోయినా ఇది వాస్తవంగా జరిగింది. ఒడిశాలోని చిలికా అనే ప్రాంతంలో జనాలు నివసిస్తున్న ప్రాంతానికి 12అడుగు(12 feets)లకుపైగా పొడవున్న కింగ్ కోబ్రా (King cobra)వచ్చింది. అతి పొడవైన నల్లత్రాచుని చూస్తే అక్కడున్న వాళ్లంతా హడలిపోయారు. అయితే ఎలాగైనా దాన్ని చంపాలన్న కోపంతో ఒకరు ఇంటి పైకప్పు పైనుంచి ఇటుకను దానిపై విసిరేశారు. ఆ దాడిలోనే కింగ్ కోబ్రా స్పల్పంగా గాయపడింది.
కింగ్ కోబ్రాపై అంత జాలి ఎందుంకో..
జనం చేసిన దాడిలో కింగ్ కోబ్రా గాయపడిన విషయాన్ని వెటర్నరీ వైద్యుల బృందం తెలుసుకుంది. స్పాట్‌కి చేరుకొని.. బుసలు కొడుతున్న నల్లత్రాచుని అత్యంత జాగ్రత్తగా పట్టుకున్నారు. ఎవర్ని కింగ్ కోబ్రా కాటేయకుండా దాని విషం ఎవరికి తగలకుండా తలను ఓ ప్రత్యేకమైన పైప్‌లో పెట్టి పాముకి ఎక్స్‌రే నిర్వహించారు. అటుపై పాము పక్కటెముకలు పగుళ్లు వచ్చినట్లు గుర్తించిన డాక్టర్లు దానికి ఏ భాగంలో పగుళ్లు వచ్చాయో గుర్తించారు. ప్రొఫెసర్ వెటర్నరీ సర్జన్ అండ్ రేడియాలజిస్ట్ డాక్టర్ ఇంద్రమణినాథ్ (Dr Indramani Nath)తన వైద్య బృందంతో కింగ్ కోబ్రా ఆపరేషన్‌కి అన్నీ సిద్ధం చేసుకున్నారు. పాము నాలుగు పక్కటెముకలు విరిగినట్లుగా గుర్తించారు. ఆ ప్రదేశంలో వాటిని అతికించడానికి మూడు అంగుళల మందం కలిగిన పీవీసీ(Pvc pipe) పైప్‌ని కట్ చేసి దాని లోపల కాటన్, మైక్రోపోర్ బ్యాండెజ్,ల్యూకోప్లాస్ట్‌తో ఓ కవచాన్ని తయారు చేసారు. దాన్ని పాముపై ఒత్తిడి పడకుండా గాయపడిన ప్రదేశంలో పీవిడాన్, ఐయోడిన్ పౌడర్(Iodine powder)ని వేసి పాముకి రెండువైపుల కవచాన్ని అమర్చారు. కింగ్ కోబ్రా విరిగిపోయిన పక్కటెముకలు అతికించేందుకు డాక్టర్లు సుమారు రెండు గంటలకుపైగా శ్రమించారు.
విషసర్పానికి వెరైటీ సర్జరీ ..
రెండు వైపుల పక్కటెముకలు దెబ్బతిన్న కింగ్ కోబ్రాకు సర్జరీ చేసిన డాక్టర్లు దాన్ని రెండు, మూడు వారాల పాటు తమ అబ్జర్వేషన్‌లో ఉంచుతున్నారు. దాన్ని ఉంచేందుకు ప్రత్యేకంగా ఓ గది లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసి అందులో పెట్టారు. ఆ విషసర్పానికి ఎలాంటి ఆహారం ఇవ్వకుండా కేవలం నీళ్లు మాత్రమే ఆ గదిలో ఉంచారు. కింగ్ కోబ్రా గాయం పూర్తిగా తగ్గిపోగానే ఫారెస్ట్ అధికారులకు అప్పగిస్తామన్నారు వైద్యులు. ప్రాణాలు తీసే ప్రమాదకరమైన పామును అటవీశాఖ అధికారులు జాగ్రత్తగా అడవుల్లో వదిలివేస్తామని చెప్పారు.
పాముకు ప్రాణం పోసిన వైద్యులు..
మనుషి ప్రాణాన్ని ఒక్క కాటుతో క్షణాల్లో తీసేసే అత్యంత ప్రమాదకరమైన నల్లత్రాచుని బతికించేందుకు డాక్టర్లు ఇంతలా కష్టపడాలా అని చిలికా గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. వైద్యం నేర్చుకున్న వాళ్లు ఆలోచించేది ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదా..అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాటిని కాపాడటానికే తాము ఉన్నది అంటూ బదులిచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kings XI Punjab, Odisha, Snake, Surgery twit