Home /News /trending /

ODISHA BRIDES MOTHER STABBED TO DEATH FOR OBJECTING TWO MEN FROM DANCING IN WEDDING PROCESSION PAH

OMG: యువకుల అత్యుత్సాహం...పెళ్లి బరాత్ లో నానా హంగామా.. వధువు తల్లి అడ్డు చెప్పడంతో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Odisha: పెళ్లి బరాత్ లో ఇద్దరు యువకులు డ్యాన్స్ చేస్తు తోటివారిని ఇబ్బందులకు గురిచేశారు. డ్యాన్స్ చేస్తున్న తోటి వారిని అసభ్యంగా తాకుతు నానా రచ్చ చేశారు.

పెళ్లి వేడుక (Wedding) అంటే డ్యాన్స్ లు, డీజేలు, తీన్మార్ స్టెప్పులతో నానా రచ్చ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ వేడుకలో అందరు జోష్ గా పాల్గొంటారు. పెళ్లి వేడుకలో బంధువులు, స్నేహితులు నానా రచ్చ చేస్తుంటారు. కొన్ని సార్లు.. వధువు, వరుడు కూడా వెడ్డింగ్ లో నానా రచ్చ చేస్తుంటారు. దుమ్మురేపే స్టెప్పులతో అతిథులను షాకింగ్ కు గురిచేసిన అనేక వీడియోలు (Dancing videos) గతంలో వైరల్ అయ్యారు. ఒక్కొసారి బరాత్ లో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించడం వలన కొన్ని అనుకొని సంఘటనలు కూడా జరిగాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఒడిశాలో (Odisha) పెళ్లివేడుక విషాదంగా మారింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. బారాఘడ్ జిల్లాలోని మెల్చముండాలో ఇది జరిగింది. కిషోరి రాజన్స్ అనే మహిళ గురువారం తన కూతురు పెళ్లి వేడుకని ఘనంగా నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా బరాత్ (marriage barat) నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బద్మల్ గ్రామానికి చెందిన సుమంత్ నాయక్, సుబోధ్ రాజన్ బరాత్ లో డ్యాన్స్ చేస్తు నానా హంగామా చేశారు. తోటి వారికి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు.

దీంతో వధువు తల్లి వారిని డ్యాన్స్ చేయోద్దని వారించింది. ఈ క్రమంలో ఆమెతో వాగ్వాదానికి దిగారు. తాగిన మైకంలో పదునైన కత్తిలో ఆమెపై దాడికి పాల్పడ్డారు. దీంతో మహిళ బరాత్ వేడుకలోనే కుప్పకూలింది. వెంటనే ఆమెను బంధువులు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Odisha, Wedding

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు