హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

OMG: అమానుషం.. మృతదేహాన్ని నడిరోడ్డు మీద వదిలేశారు.. కారణం ఏంటంటే..

OMG: అమానుషం.. మృతదేహాన్ని నడిరోడ్డు మీద వదిలేశారు.. కారణం ఏంటంటే..

అంబులెన్స్..

అంబులెన్స్..

Odisha: సభ్య సమాజం తలదించుకునే సంఘటన జరిగింది. అనారోగ్యంతో చనిపోయిన మహిళ మృతదేహాన్ని నడిరోడ్డుమీద వదిలేసి దారుణంగా ప్రవర్తించారు.

కొందరు కాసుల కోసం అత్యంత దారుణాలకు పాల్పడుతున్నారు. అవతల వారు ఎన్ని కష్టాలు పడుతున్న, ఎంత దుఖంలో ఉన్న వారిని పీడించుకుని తింటున్నారు. డబ్బుల ఆశలో రక్తసంబంధాలను కూడా పట్టించుకోవడం లేదు. ఇలాంటి అమానుష సంఘటనలు ప్రతి రోజు వార్తలలో ఉంటున్నాయి. సాధారణంగా మనం ప్రభుత్వ కార్యలయాలు, ఆస్పత్రులలో అమాయకులను డబ్బుల కోసం వేధిస్తుండం తరచుగా చూస్తుంటాం. ప్రధానంగా ఆస్పత్రులలో డబ్బుల కోసం మనుషులను పీడించుకుని తింటుంటారు. ఎదుటివారి ప్రాణాలు పోతున్న సరే.. వారి బంధువులు పుట్టేడు దుఖంలో ఉన్నసరే.. వారికి అవేం పట్టవు. ఇక కొన్ని చోట్ల అంబులెన్స్ సిబ్బంది కూడా అత్యంత నీచానికి దిగుతున్నారు. డబ్బుల కోసం పెషెంట్ ను, వారి బంధువులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఒడిశాలో భువనేశ్వర్ లో దారుణమైన ఘటన జరిగింది. హేమంత్ మిశ్రా, ఛబీ మిశ్రా భార్య భర్తలు. వీరు కూలీ పనులు చేసుకుంటూ తమ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఛబీ తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను భర్త.. ధెంకనల్ జిల్లాలోని భూబన్ ప్రాంతంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి ఛబీ మిశ్రా చనిపోయింది.

దీంతో అతను తీవ్ర దుఖంలో మునిగిపోయాడు. అతడిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఇక.. ఆస్పత్రి వద్ద ఉన్న ఒక అంబూలెన్స్ లో ఛబీ మిశ్రా శవాన్ని పెట్టుకుని అతని గ్రామానికి పంపించారు. ఈ క్రమంలో తెల్లవారు జామున అంబులెన్స్ డ్రైవర్ తనకు 5000 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తన వాహనాన్ని కటక్, చండీఖోల్ పట్టణాల మధ్య ఉన్న ఛతియా ప్రాంతంలో నిలిపేశాడు.

బాధితుడు తన దగ్గరు 3000 మాత్రమే ఉన్నాయని చెప్పాడు. అయినప్పటికి అంబూలెన్స్ డ్రైవర్ ఏమాత్రం కనికరించలేదు. తనకు 5000 వేలు ఇస్తేనే గ్రామానికి తీసుకెళ్తానని లేకపోతే ఇక్కడే వదిలేస్తానని చెప్పాడు. ఆ తర్వాత.. శవాన్ని అక్కడే నడిరోడ్డుమీద దింపేసి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో బాధితుడు హేమంత్ మిశ్రా అక్కడే నడిరోడ్డుమీద భార్య శవంతో పాటు రోడ్డు పక్కన కూర్చున్నాడు. స్థానికులు ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా మారింది.

First published:

Tags: Free ambulance, Odisha

ఉత్తమ కథలు