• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • NURSE BATTLES COVID WITH ONE LUNG IN 14 DAYS IN MADHYA PRADESH SU

ఒకే ఊపిరితిత్తితోనే కరోనాపై పోరులో విజయం.. ఓ నర్సు విజయగాథ..

ప్రతీకాత్మక చిత్రం

ఓ మహిళ నర్సు తనకు ఒకే ఊపిరితిత్తి ఉన్నప్పటికీ కరోనాపై పోరులో విజయం సాధించారు. మనో ధైర్యంతో కరోనాపై గెలుపొందారు.

  • Share this:
    కరోనా వైరస్ ముఖ్యంగా ఊపిరితిత్తులపైన ప్రభావం చూపుతోంది. చాలా మంది రోగులు.. వైరస్ ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపడంతోనే మృత్యువాత పడుతున్నారు. కానీ ఓ మహిళా నర్సు మాత్రం ఒకే ఊపిరితిత్తితోనే కరోనాపై పోరాడి విజయం సాధించింది. ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా.. కరోనా మహమ్మారిపై పోరాడి తన ప్రాణాలను నిలుపుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. ప్రస్తుతం నర్సుగా పనిచేస్తున్న ప్రఫులిత్ పీటర్‌కు.. చిన్నప్పుడు జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో.. ఆపరేషన్ చేసిన వైద్యులు ఒక ఊపిరితిత్తిని తొలగించారు. అప్పటి నుంచి ఆమె ఒక్కదానితోనే జీవిస్తోంది. అయినప్పటికీ ఆ విషయం ఆమెకు తెలియదు. 2014లో చెస్ట్ ఎక్సరే తీసినప్పుడు ఈ విషయం గురించి తెలిసింది.

    ప్రస్తుతం ఆమె టికామ్‌గర్హ్ ఆస్పత్రిలోని కోవిడ్ వార్డులో ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇటీవల ఆమె కోవిడ్ బారిన పడ్డారు. ఆమె ఆరోగ్య పరిస్థితి తెలిసిన చాలా మంది ఆమె కరోనాను ఎలా జయిస్తుందోనని కంగారు పడ్డారు. కుటుంబ సభ్యులు కూడా ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందారు. అయితే 14 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉన్న ఆమె కోవిడ్ నుంచి కోలుకుంది. మనోధైర్యంతో కరోనాను జయించింది.

    Hyderabad: మీ కూతురి వీడియోలు నా దగ్గరున్నాయి.. ఏం చేసుకుంటారో చేసుకోండి..

    Telangana Lockdown: లాక్‌డౌన్ ఎఫెక్ట్.. ఒక్క రోజే అంతా మద్యం అమ్ముడుపోయిందా.. లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..

    కరోనా నెగిటివ్‌గా నిర్దారణ అయిన తర్వాత ప్రఫులిత్ పీటర్‌ మాట్లాడుతూ.. హోం ఐసోలేషన్‌లో ఉన్న సమయంలో ఏ మాత్రం కూడా ధైర్యం కోల్పోలేదని చెప్పారు. రెగ్యులర్‌గా యోగా, ప్రాణాయామం, శ్వాస సంబంధిత వ్యాయామం చేసినట్టుగా తెలిపారు. అదే విధంగా ఊపిరితిత్తికి మేలు చేసేలా బెలూన్లు ఊదినట్టుగా వివరించారు. ఇక, ఆమె ఇప్పటికే రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోగా.. నమ్మకమే తాను కరోనాను జయించడానికి తోడ్పడిందని చెప్పారు.
    Published by:Sumanth Kanukula
    First published: