Viral News: 300 మందితో న్యూడ్ ఫోటో షూట్.. దీని వెనుక ఇంత స్టోరీ ఉందా ?

న్యూడ్ ఫోటో షూట్

ఇజ్రాయిల్ డెడ్ సీ (మృతసముద్రం) సమీపంలో నగ్న ఫోటో తీసేందుకు ఓ కళాకారుడు ఏకంగా 300 మంది మగ, ఆగ వాలంటీర్లను నియమించుకున్నాడు. అయితే వారంతా తెల్లటి బాడీ పెయింట్ అద్దుకుని ఆదివారం ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

  • Share this:
ఫోటోగ్రాఫర్లు అరుదైన ఫోటోలు తీయడానికి నానాపాట్లు పడుతుంటారు. చాలా కష్టపడి వారు తీసే ఫోటోలు ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలుస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని చర్చకు కూడా దారితీస్తాయి. ఇలాంటి అరుదైన ఫోటో షూట్ ఒకటి ఇజ్రాయెల్‌లో చోటు చేసుకుంది. ఏకంగా 300 మంది మగ, ఆడ వాలంటీర్లతో నగ్నంగా ఫోటోలు తీసి వార్తలో నిలిచారు అమెరికాకు చెందిన ఓ కళాకారుడు. ఫోటో ఎక్కడా అసభ్యకరంగా లేకపోవడం ఇందులో మరో విశేషం. ఇదేదో ఫోటోగ్రాఫర్ సొంత లాభం కోసం తీసిన ఫోటో కాదు. ఇజ్రాయెల్ ప్రభుత్వం అతనితో ఈ ఫోటో తీయించడం విశేషం.

ఇజ్రాయిల్ డెడ్ సీ (మృతసముద్రం) సమీపంలో నగ్న ఫోటో తీసేందుకు ఓ కళాకారుడు ఏకంగా 300 మంది మగ, ఆగ వాలంటీర్లను నియమించుకున్నాడు. అయితే వారంతా తెల్లటి బాడీ పెయింట్ అద్దుకుని ఆదివారం ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అమెరికాకు చెందిన ఫోటోగ్రాఫర్ స్పెన్సర్ టునిక్ ఈ అరుదైన ఫోటోలను తన కెమెరాలో బంధించారు. గతంలోనూ ఇలాంటి ఫోటోలు ఆయన తీశారు. ఫ్రెంచ్ వైన్ కంపెనీ, స్విస్ లోని మంచు పర్వతాల వద్ద, దక్షిణాఫ్రికాలోని బీచ్ లో ఇలాంటి ఫోటోలను స్పెన్సర్ తన కెమెరాల్లో బంధించారు. మధ్య ఆసియాలో ఇలాంటి కళాత్మక ఫోటోలు తీయించేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇజ్రాయెల్ లో ఇలాంటి ఫోటో తీయడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని ఫోటోగ్రాఫర్ స్పెన్సర్ చెప్పారు. 2011 లో కూడా మృత సముద్రం వద్ద ఇలాంటి అరుదైన ఫోటోను స్పెన్సర్ తీశారు.

300 మంది వాలంటీర్లు ముందుగా ఇజ్రాయెల్ నగరం అరబ్‌లో ఆదివారం మధ్యాహ్నం ఒకచోట చేరారు. వారంతా శరీరాలకు తెల్లటి పెయింట్ వేయించుకున్నారు. ఆ తరవాత అందరూ కలిసి బీచ్‌లో ఫోటో షూట్‌లో పాల్గొన్నారు. ఈ ఫోటో చిత్రీకరణ మూడు గంటల పాటు సాగింది. ఫోటోగ్రాఫర్ సూచనల మేరకు వాలంటీర్లు ఫోజులు ఇచ్చారు.

Revanth Reddy: ఆ సీనియర్ నేతతో టీఆర్ఎస్, బీజేపీలకు చెక్.. రేవంత్ రెడ్డి ప్లాన్ ?

Avoid Diabetes: డయాబెటిస్ రావొద్దని కోరుకుంటున్నారా ? అయితే ఈ 5 సూత్రాలు పాటించండి..

డెడ్ సీని రక్షించుకోవాల్సిన ప్రాముఖ్యతను ఈ ఫోటో తెలియజేస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. క్రమంగా ఉప్పునీటి వనరులు క్షీణించి పోవడంతో ఇజ్రాయెల్ సహా పొరుగు దేశాలు వ్యవసాయంకోసం భూఉపరితల జలాలను వినియోగించాల్సి వస్తోంది. దీనికి తోడు కరోనా మహమ్మారి కారణంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం సంవత్సరం నుంచి విదేశీ పర్యాటకులను నిలిపివేసినట్టు ఆ దేశ పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కళాత్మక నగ్న ఫోటో ద్వారా పర్యాటకుల దృష్టి మళ్లీ ఇజ్రాయెల్ పై పడుతుందని వారు భావిస్తున్నారు. ఈ ఫోటో చిత్రీకరణ తరువాత కరోనా టీకా వేయించుకున్న విదేశీ పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరగనుందని ఇజ్రాయెల్ పర్యాటక మంత్రిత్వ శాఖ భావిస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published: