Home /News /trending /

NUCLEAR BOMB BEING DETONATED UNDERWATER IN 1958 VIRAL VIDEO PVN

Viral Video : సముద్రంలో న్యూక్లియర్ బాంబ్ పేలుడు..అగ్నిపర్వతం లావాలా ఆకాశంపైకి నీరు!

సముద్రంలో న్యూక్లియర్ బాంబు పేలుడు

సముద్రంలో న్యూక్లియర్ బాంబు పేలుడు

Nuclear bomb  detonated underwater :  సోషల్ మీడియా(Social Media) అద్భుతమైన వీడియోల స్టోర్‌హౌస్. మనల్ని ఆశ్చర్యపరిచే అనేక వీడియోలను సోషల్ మీడియాలో చూడవచ్చు. తాజాగా అటువంటి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. సముద్రంలో పేలుడు వీడియోలో కనిపిస్తుంది.

ఇంకా చదవండి ...
Nuclear bomb  detonated underwater :  సోషల్ మీడియా(Social Media) అద్భుతమైన వీడియోల స్టోర్‌హౌస్. మనల్ని ఆశ్చర్యపరిచే అనేక వీడియోలను సోషల్ మీడియాలో చూడవచ్చు. తాజాగా అటువంటి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. సముద్రంలో భారీ పేలుడు ఆ వీడియోలో కనిపిస్తుంది. అయితే ఇది చిన్నపాటి పేలుడుకు సంబంధించిన వీడియో మాత్రమయితే కాదు. వరల్డ్ ఆఫ్ హిస్టరీ అనే ట్విట్టర్ ఖాతాలో హిస్టరీకి సంబంధించిన షాకింగ్ వీడియోలు, ఫొటోలు తరచూ పోస్ట్ అవుతుంటాయి. ఇటీవల ఈ ట్విట్టర్ అకౌంట్ లో ఒక వీడియో షేర్ చేయబడింది. ఈ వీడియోలో, సముద్రం లోపల పేలుడు కనిపిస్తుంది. వీడియో క్యాప్షన్ ప్రకారం ఇది 1958 సంవత్సరానికి చెందినది. ఓ టెస్ట్ లో భాగంగా సముద్రపు అడుగున అణుబాంబును( Nuclear Bomb Denotad Underwater)పేల్చారు, అంటే అణుబాంబు నీటి అడుగున పేల్చడం వల్ల దాని ప్రభావం తెలుసుకోవచ్చు.

సముద్రంలో పెద్ద పేలుడు
వీడియో ప్రారంభంలో, నీరు చాలా నిశ్చలంగా సాధారణంగా కనిపిస్తుంది. అకస్మాత్తుగా బలమైన పేలుడు తర్వాత అగ్నిపర్వతం లావాలా నీరు ఆకాశం వైపు ఎగురుతున్నట్లు కనిపిస్తుంది. ఒక్క క్షణం అది నీరు కాదు, మేఘమా అని అనిపిస్తుంది. ఆకాశంలోకి వెళ్తే ఆ నీరు దూదిలా కనిపించి, ఇంత భారీ రూపం దాల్చినట్లుంది. చుట్టూ నీరు మాత్రమే ఎగురుతున్నట్లు కనిపిస్తుంది. ఈ పేలుడు వల్ల సముద్ర జీవులకు ఎంత నష్టం వాటిల్లుతుందో కూడా ఆలోచించాల్సిందేనని ఈ వీడియో చూసిన నెటిజన్లు అంటున్నారు.





Viral Video :కలికాలం..పులి పిల్లలకు పాలిస్తున్న కుక్క

ఈ వీడియోపై నెటిజన్ల స్పందన
ఈ వీడియోకు 63 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇది చరిత్రలో సిగ్గుచేటని ఓ నెటిజన్ కామెంట్ చేయగా... ఇది మనుషులు చేసే పిచ్చి అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. చాలా మంది ఈ వీడియోపైనే ప్రశ్నల వర్షం కురిపించారు. 1958 వరకు కలర్ కెమెరాలు లేవని ఇది ఫేక్ వీడియో అని అంటున్నారు. అయితే కలర్ కెమెరాలు 1958కి చాలా కాలం ముందు తయారు చేయబడినందున ఫేక్ వీడియో అనే కామెంట్స్ తప్పు మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Nuclear, Viral Video

తదుపరి వార్తలు