రూ.150 కోట్ల క్లబ్‌లో చేరిన ‘వీరరాఘవుడు’... బయ్యర్లు సేఫ్!

12 రోజులకు ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల గ్రాస్ సాధించిన ‘అరవింద సమేత వీరరాఘవ’... ఎన్.టీ.ఆర్ కెరీర్లో ఈ ఫీట్ సాధించిన మొదటి చిత్రంగా రికార్డు!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: October 22, 2018, 9:44 PM IST
రూ.150 కోట్ల క్లబ్‌లో చేరిన ‘వీరరాఘవుడు’... బయ్యర్లు సేఫ్!
‘అరవిందసమేత వీరరాఘవ’ చిత్రం
  • Share this:
యంగ్ టైగర్ ఎన్.టీ.ఆర్ నటించిన తాజా చిత్రం ‘అరవింద సమేత వీరరాఘవ’ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పూజాహెగ్దే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. విలన్ పాత్రలో నటించిన జగపతిబాబు నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దసరాకి ముందు విడుదలైన ఈ చిత్రం తొలిరోజే రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. మొదటి రోజే దాదాపు రూ. 39 కోట్ల షేర్ రాబట్టిన వీరరాఘవుడు, మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరాడు. అయితే ఆ తర్వాత అదే ఊపును కొనసాగించడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. సినిమాకి యావరేజ్ టాక్ రావడం, బయ్యర్లు భారీ ధరలకు మూవీని కొనడంతో ఆ మొత్తాన్ని రికవరీ చేయడం కష్టమే అని భావించారు.

అయితే సెకండ్ వీక్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా చూపకపోవడంతో వీరరాఘవుడు చెలరేగిపోతున్నాడు. 12 రోజులకు ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల గ్రాస్ సాధించింది ‘అరవింద సమేత వీరరాఘవ’ మూవీ. దేశవ్యాప్తంగా వచ్చిన గ్రాస్ వసూళ్లు రూ.105.6 కోట్లు ఉండడం మరో విశేషం. తెలుగురాష్ట్రాల్లోనే నూరు కోట్ల షేర్‌కి దగ్గర్లో ఉన్నాడు తారక్. ఇంతకు ముందు ‘బాహుబలి 2’, ‘బాహుబలి’, ‘రంగస్థలం’, ‘ఖైదీ నెం. 150’ సినిమాలు మాత్రమే తెలుగురాష్ట్రాల్లో వందకోట్ల కలెక్షన్లు రాబట్టగలిగాయి. ఇప్పుడు ఆ లిస్టులో ‘అరవింద సమేత వీరరాఘవ’ చేరింది.ఈ సినిమాను దాదాపు 93 కోట్లకు అమ్మారు. నెట్ కలెక్షన్లు ప్రస్తుతం 87 కోట్ల రూపాయలను దాటాయి. ఇంకో 6 కోట్లు వసూళ్లు చేయగలిగితే బయ్యర్లు సేఫ్ అయినట్టే! ఇందులో యూఎస్‌లో ఈ సినిమాను భారీ రేట్‌కి అమ్మడంతో ఆ మొత్తం వసూలు చేయడం కష్టంగానే కనిపిస్తోంది. ఎంత లేదన్నా అక్కడ హాఫ్ మిలియన్ నష్టాలు వచ్చేలా కనిపిస్తోంది. ఆ మొత్తం కాకుండా మిగిలిన 3 కోట్లు మాత్రమే. దాంతో సినిమా యావరేజ్ జోన్ దాటి, హిట్టు దిశగా సాగుతోంది. రాయలసీమను ఫ్యాక్షన్ పుట్టినిల్లుగా చూపించారనే వివాదాలతో పాటు బాలయ్యబాబు ముఖ్యఅతిథిగా చేసిన సక్సెస్ మీట్ కార్యక్రమం కూడా మూవీ ప్రమోషన్‌కి బాగా ఉపయోగపడుతోంది.


First published: October 22, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading