మనం ఏ పని చేసిన క్రమశిక్షణ అనేది తప్పనిసరి. క్రమశిక్షణ లేకపోతే ఎంతటి ధనవంతుడైన నేలరాలక తప్పదు. అలానే క్రమశిక్షణ ఉంది పనిపై నిబద్దత అనేది ఉంటే కటిక పేదరికంలో ఉన్న వారు కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక ఈ నినాదాన్నే నమ్మేవారు మహానటుడు ఎన్టీఆర్. ఇక అలానే మొదటిసారిగా నటి లక్ష్మి, మహానటుడు ఎన్టీఆర్ కలిసి ఒకే కుటుంబం అనే చిత్రంలో నటించారు.
ఈ సినిమాను నాగభూషణం నిర్మించగా దర్శకుడు ఎ.భీమ్‌సింగ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్, కాంతారావు, లక్ష్మి కాంబినేషన్లో ఓ సీన్ చిత్రీకరించాలి. కానీ ఆ రోజు షూటింగ్ కు కాంతారావు లేటుగా వచ్చారు. అయితే ఆ విషయాన్నీ ఎన్టీఆర్ సహించలేకపోయారు. ఎన్టీఆర్ కోపాన్ని చూసి సెట్ లో అందరూ వణికిపోయారు.
ఆతర్వాత కాసేపటికి కాంతారావు భయపడుతూ సెట్ లోకి వచ్చారు.. ఆ సమయంలో కాంతారావును ఏమీ అనలేదు. కానీ షూటింగ్ పూర్తయిన తర్వాత అందులో బాగా నటించావ్ కాంతారావు అంటూ అభినందించి అనంతరం వృత్తిలో క్రమశిక్షణ ముఖ్యం అంటూ క్లాస్ తీసుకున్నారు.
ఆ సినిమా షూటింగ్ పూర్తయ్ ఎన్టీఆర్ తో కలిసి మళ్లీ నటించే అవకాశం దక్కించుకున్నరు నటి లక్ష్మి. అయితే మొదటి సినిమా కాంతారావు అనుభవంతో ఎన్టీఆర్ సెట్ లోకి రావడానికి ముందే మేకప్ తో నటి లక్ష్మి సిద్ధంగా ఉండేవారు. కానీ రెండొవ సినిమా షూటింగ్ సమయంలో నటి లక్ష్మికి అనుకోకుండా లెట్ అయ్యింది.
దీంతో ఆమె భయపడుతూనే ఎన్టీఆర్ వద్దకు వెళ్లి ''సారీ సార్.. కొంచెం లేట్ అయింది'' అంటూ క్షమాపణలు చెప్పారు. ఎన్టీఆర్ చిరునవ్వుతో ''ఇట్స్ అల్ రైట్'' అన్నారు. అంతేకాదు.. లెట్ గా వచ్చినందుకు మీకు శిక్ష విధించాల్సిందే అంటూ ఇంటి దగ్గర నుంచి తన కోసం వచ్చిన టిఫిన్ అంతా ఆమెతో తినిపించారు ఎన్టీఆర్. ఈ చిలిపి శిక్ష ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kantharao, Lakshmi, NTR, Oke kutumbam film, Tollywood