news18-telugu
Updated: January 13, 2021, 9:04 AM IST
ఎలాన్ మస్క్ 1993 నాటి ఫొటో (Twitter image)
టెస్లా సీఈవో, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఇటీవలే ప్రపంచ అత్యంత ధనికుడిగా అవతరించారు. అమెజాన్ వ్యవస్థపకుడు జెఫ్ బెజోస్‌ను వెనక్కినెట్టి ప్రపంచంలో టాప్‌లో నిలిచాడు. అయితే గతంలో ఒకానొక సమయంలో తన కారును రిపేరు చేయించుకునేందుకు డబ్బు లేక ఎలాన్ మస్క్ ఎంతో ఇబ్బందులు పడ్డారట. 1978కు చెందిన బీఎండబ్ల్యూ 320ఐ కారును మస్క్ 1993లో కొన్నారు. ఆయనకు అదే తొలి కారు. అప్పుడు 20 డాలర్లు పెట్టి గ్లాస్ రిప్లేస్ మెంట్ చేసున్నారు. అయితే మెకానిక్ ఇచ్చేందుకు సరిపడా డబ్బు లేక ఆయనే స్వయంగా గ్లాస్ ను ఫిట్ చేసుకున్నారట. ఈ విషయం ఫొటోతో సహా ట్విట్టర్లో ఓ వ్యక్తి ట్వీట్ చేశారు.
“కార్ రిపేర్ల కోసం డబ్బు చెల్లించే స్థోమత లేక 1995లో ఎలాన్ మస్క్ స్వయంగా రిపేర్ చేసుకున్నారు” అంటూ ప్రణయ్ పథోల్ అనే ట్విట్టర్ యూజర్ ఫొటోతో సహా ట్వీట్ చేశాడు.
దీనికి ఏకంగా ఎలాన్ మస్క్ స్పందించారు. తాను రిప్లేస్మెంట్ గ్లాస్‌ను 20 డాలర్లకు జంక్ యార్డ్ నుంచి కొన్నానని, అప్పట్లో కార్ల గురించి తనకు తెలియదని రిప్లై ఇచ్చారు.
ఈ విషయంపై ఎలాన్ మస్క్ తల్లి మయే మస్క్ కూడా ట్వీట్ చేశారు. 1995లో మస్క్ తనకు కార్ల గురించి తెలియదంటున్నాడు అంటూ నవ్వుతున్న ఎమోజీలను పెట్టారు. ఈ ట్వీట్‌కు మస్క్ స్పందించారు.
Couldn’t afford to pay for repairs, so I fixed almost everything on that car from parts in the junkyard. Ironically, that’s me replacing broken side window glass. The circle is complete lol.
“ఆ కారును రిపేర్లు చేయించుకునేందుకు డబ్బు లేక నేను మరమ్మతులు చేసుకునే వాడిని. అది నేనే. సైడ్గ్లాస్ మారుస్తున్నా. సర్కిల్ కంప్లీట్ అయింది” అని మస్క్ ట్వీట్ చేశారు.
కాగా 2017 నుంచి ప్రపంచ అత్యధిక ధనవంతుడిగా ఉన్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌ను ఎలాన్ మస్క్ గత వారం అధిగమించారు. వరల్డ్ మోస్ట్ రిచెస్ట్ పర్సన్‌గా అవతరించారు.
Published by:
Krishna P
First published:
January 13, 2021, 9:04 AM IST