హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

'మాస్క్‌డ్ ఆధార్' గురించి మీకు తెలుసా?

'మాస్క్‌డ్ ఆధార్' గురించి మీకు తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

'మాస్క్‌డ్ ఆధార్' ఫీచర్ ఇ-ఆధార్‌లోనే ఉంటుంది. అందులో మీ ఆధార్ నెంబర్‌ కనిపించకుండా చేస్తారు. 'మాస్క్‌డ్ ఆధార్'లో చివరి 4 నెంబర్లు మాత్రమే కనిపిస్తాయి. మొదటి 8 నెంబర్లు మాత్రం కనిపించవు. డిజిటల్ సిగ్నేచర్ ఉంటుంది కాబట్టి దీన్ని మీరు తరచూ ఉపయోగించే ఇ-ఆధార్‌లానే ఉపయోగించుకోవచ్చు. మీరు పూర్తి ఆధార్ నెంబర్ షేర్ చేయరు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

ఇంకా చదవండి ...

  మీరు మీ ఆధార్ నెంబర్‌‌ని రహస్యంగా ఉంచాలనుకుంటున్నారా? ఆ నెంబర్ ఎవరికీ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారా? అది సాధ్యమే. ఇకపై మీ ఆధార్ నెంబర్ మీకే సొంతం. దాన్ని ఎవరూ చూడలేరు. ఆ వివరాలు ఎవరూ తెలుసుకోలేరు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) సరికొత్త ఫీచర్‌‌ని తీసుకొస్తోంది. అదే 'మాస్క్‌డ్ ఆధార్'.

  'మాస్క్‌డ్ ఆధార్' ఫీచర్ ఇ-ఆధార్‌లోనే ఉంటుంది. అందులో మీ ఆధార్ నెంబర్‌ కనిపించకుండా చేస్తారు. 'మాస్క్‌డ్ ఆధార్'లో చివరి 4 నెంబర్లు మాత్రమే కనిపిస్తాయి. మొదటి 8 నెంబర్లు మాత్రం కనిపించవు. డిజిటల్ సిగ్నేచర్ ఉంటుంది కాబట్టి దీన్ని మీరు తరచూ ఉపయోగించే ఇ-ఆధార్‌లానే ఉపయోగించుకోవచ్చు. మీరు పూర్తి ఆధార్ నెంబర్ షేర్ చేయరు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

  'మాస్క్‌డ్ ఆధార్' ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

  ముందుగా మీరు www.uidai.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

  'డౌన్‌లోడ్ ఆధార్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

  మీ ఆధార్ నెంబర్, పేరు, పిన్‌ కోడ్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి.

  మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి.

  ఆ తర్వాత మీరు మాస్క్‌డ్ ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

  మీరు వర్చువల్ ఐడీ నుంచి కూడా 'మాస్క్‌డ్ ఆధార్' డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

  ఇవి కూడా చదవండి:

  ఆధార్ ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ వచ్చేస్తోంది!

  ఆధార్ నెంబర్‌ చెప్తే అప్పు ఇచ్చేస్తారు!

  గూగుల్‌లో మీ డేటాను ఎలా డిలిట్ చేయాలో తెలుసా?

  వాట్సప్ డేటా బ్యాకప్: నవంబర్ 12 డెడ్‌లైన్!

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Aadhaar Card, AADHAR, Personal Data, Smartphone, UIDAI

  ఉత్తమ కథలు