#MenToo: స్త్రీల ‘మీటూ’ వేధింపులకు వ్యతిరేకంగా ‘మెన్‌టూ’ ఉద్యమం

మహిళల వేధింపులు, ‘మీటూ’ అసత్య ఆరోపణలపై పోరాటం చేసేందుకు ‘మెన్‌టూ’ ఉద్యమాన్ని ప్రారంభించిన బెంగళూరులోని ‘క్రిస్ప్’ స్వచ్ఛంద సంస్థ!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: October 22, 2018, 10:17 PM IST
#MenToo: స్త్రీల ‘మీటూ’ వేధింపులకు వ్యతిరేకంగా ‘మెన్‌టూ’ ఉద్యమం
ప్రతీకాత్మక చిత్రం (File Photo: Reuters)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: October 22, 2018, 10:17 PM IST
‘మీటూ’ ఉద్యమం దేశాన్ని అతలాకుతం చేస్తోంది. సినిమా ఇండస్ట్రీతో పాటు రాజకీయ, క్రీడా, మీడియా రంగాల్లోని మహిళలు, తమకు గతంలో ఎదురైనా చేదు అనుభవాలను బయటపెట్టడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే చాలామంది రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ‘మీటూ’ బారిన పడి అప్రతిష్ట మూటకట్టుకున్నారు. పురుషుల లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ‘మీటూ’ ఉద్యమం వస్తే, స్త్రీల వేధింపులను వ్యతిరేకంగా ‘మెన్‌టూ’ ఉద్యం శ్రీకారం చుట్టుకుంది. బెంగళూరులోని ‘క్రిస్ప్’ అనే స్వచ్ఛంద సంస్థ ఈ ‘మెన్‌టూ’ ఉద్యమాన్ని ప్రారంభించింది.

మహిళలు తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను ‘మీటూ’ పేరుతో వెల్లడిస్తున్నారు. మరి మహిళల కారణంగా వేధింపులు ఎదుర్కొంటున్న పురుషుల సంగతేంటి? అందుకే ‘మెన్‌టూ’ ఉద్యమాన్ని మొదలెడుతున్నాం. ‘మీటూ’ ఉద్యమానికి మేం ఏ మాత్రం వ్యతిరేకం కాదు. కాని ‘మీటూ’ పేరుతో తప్పుడు ఆరోపణలు చేసి, మగాళ్ల మనోభావాలతో ఆడుకుంటున్న వారిని బయటపెట్టేందుకు ‘మెన్‌టూ’ ఉద్యమం...
జాగీర్దార్, క్రిస్ప్ (చిల్డ్రెన్ రైట్స్ ఇనీషియేటివ్ ఫర్ షేర్డ్ పేరెంటింగ్) సంస్థ నిర్వాహకుడు


‘మెన్‌టూ’ ఉద్యమంలో ఇప్పటికే 15 మంది పురుషులు తమకు జరిగిన అనుభవాలను వెల్లడించారు. స్వయంగా ఫ్రాన్స్ మాజీ రాయబారి పాస్కల్ మజురియర్ కూడా వీరిలో ఉండడం విశేషం. సొంత కుమార్తెనే పాస్కల్ లైంగికంగా వేధించాడంటూ ఆయన భార్య కేసు పెట్టింది. అయితే అవన్నీ తప్పుడు ఆరోపణలని కోర్టు నిర్ధారించింది. ఇలా భార్యలు, తోటి ఉద్యోగులైన మహిళలు చేసే వేధింపులకు వ్యతిరేకంగా ‘మెన్‌టూ’ ఉద్యమం నడుస్తుందని చెప్పాడు జాగీర్దార్. జాగీర్దార్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం ‘భార్యాబాధితుల సంఘం’, ‘భారతీయ కుటుంబ సంక్షేమ సంఘం’ వంటి వాటిల్లో సభ్యుడిగా చేరి, చురుగ్గా పాల్గొంటున్నారు. గృహ హింస చట్టంలో సవరణలు చేయాలంటూ 15 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాడు జాగిర్దార్. లైంగిక ఆరోపణల విషయంలోనూ ‘లింగ సమానత్వం’ పాటించాలని, మహిళా పక్షపాతం పనికి రాదని పోరాడుతున్న జాగిర్దార్... స్త్రీలకు అన్యాయం జరిగినా పోరాటం చేసేందుకు సిద్ధమంటూ ప్రకటించాడు.
First published: October 22, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...