హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Madame Tussauds Museum : ఇండియాలోనే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం .. ఎక్కడా ..? ఎంట్రీ టికెట్ ఎంతంటే..?

Madame Tussauds Museum : ఇండియాలోనే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం .. ఎక్కడా ..? ఎంట్రీ టికెట్ ఎంతంటే..?

(Photo Credit:Twitter)

(Photo Credit:Twitter)

Madame Tussauds Museum: గొప్ప గొప్పవాళ్లు, వివిధ రంగాల్లో బాగా పాపులర్ అయిన వ్యక్తుల మైనపు బొమ్మలు కొలువై ఉండే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఇప్పుడు ఇండియాలో ప్రారంభమైంది. దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఈ మ్యూజియం సందర్శించేందుకు టికెట్‌ ధర ఎంతో తెలుసా.

ఇంకా చదవండి ...

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యక్తులు(Celebrities), వివిధ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖుల మైనపు బొమ్మలను(Wax figures)తయారు చేసి ప్రత్యేకంగా ప్రదర్శనకు ఉంచే అరుదైన ప్రదేశం మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం(Madame Tussauds Museum). లండన్(London). సింగపూర్‌(Singapore). లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలలో ప్రపంచంలోని బాగా గుర్తింపు పొందిన లెజెండ్‌ పర్సనాలిటీ(legendS)ల మైనపు బొమ్మలను అచ్చు వేసినట్లుగా చిత్రీకరించి ఏర్పాటు చేశారు. గతంలో లెజెండ్ పర్సనాలిటీల మైనపు బొమ్మలు చూడాలంటే లండన్, సింగపూర్‌ వెళ్లాల్సి ఉండేది. ఎందుకంటే వరల్డ్ టూరిస్ట్‌ ప్లేసులుగా సింగపూర్, లండన్‌ బాగా పాపులర్ కాబట్టి ఈ మ్యూజియంలను అక్కడ ఏర్పాటు చేశారు.

Air Ambulance: అద్భుతం..గుండె ఆపరేషన్ కోసం .. అమెరికా నుంచి చెన్నైకు ఎయిర్ అంబులెన్స్.. చదివితే చేతులెత్తి మొక్కుతారు !వరల్డ్ బెస్ట్ మ్యూజియం..

గతంలో విదేశాల్లో మాత్రమే మేడమ్ టుస్సాడ్స్ వాక్స్ మ్యూజియం నెలకోల్పబడి ఉన్నాయి. ఇప్పుడు భారతదేశంలోని నొయిడాలో కూడా ఐకానిక్ మేడమ్ టుస్సాడ్స్ మైనపు మ్యూజియంను ప్రారంభించారు నిర్వాహకులు. నొయిడాలోని డీఎల్‌ఎఫ్‌ మాల్‌ ఆఫ్ ఇండియాలో ఏర్పాటు చేశారు. ఈనెల 19వ తేదిన మంగళవారం ఈ మైనపు బొమ్మల మ్యూజియం సందర్శకులను ఆకర్షించే విధంగా ఏర్పాటు చేశారు. నొయిడాలో ప్రారంభమైన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మొదటి సారిగా సింగర్ ఆశా భోంస్లే మైనపు బొమ్మతో పాటు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, జాతిపిత మహాత్మగాంధీ విగ్రహాలను అద్భుతంగా చిత్రీకరించి నెలకోల్పారు.

ఇప్పుడు ఇండియాలో..

వరల్డ్‌ వైడ్‌గా ఈ టుస్సాడ్స్‌ మ్యూజియంలకుకు ఎంతో ప్రత్యేకత ఉంది. రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార, స్వాతంత్ర్య సమరయోధులు, చరిత్రకారులకు చెందిన ఎందరో గొప్ప వాళ్ల విగ్రహాలను మైనంతో తయారు చేయించి ఇందులో ఉంచేవారు. ప్రస్తుతం నొయిడాకు తరలివచ్చిన ఐకానిక్ మేడమ్ టుస్సాడ్స్‌ వాక్స్ మ్యూజియం కన్నాట్ ప్రదేశం నుంచి షిప్ట్ చేశారు. అక్కడ గతంలో ఏర్పాటు చేసిన మైనపు విగ్రహాలను ఇప్పుడు నొయిడాలో ప్రతిష్టించారు. ఇలా కన్నాట్ నుంచి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం నొయిడాకు మార్చడానికి కారణం ఉంది.

అందుబాటులో ఎంట్రీ టికెట్స్ ..

2020లో ప్రపంచ దేశాల్ని కరోనా కారణంగా కన్నాట్‌లోని టుస్సాడ్స్‌ మైనపు మ్యూజియం మూతపడింది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని విడిచిపెట్టినప్పటికి అప్పటి నుంచి మ్యూజియం తెరుచుకున్న పరిస్థితి లేదు.అందుకే అక్కడి విగ్రహాలతో పాటు మరికొన్ని కొత్త వాటిని రూపొందించి ఇండియాలోని నొయిడాలోని డీఎల్‌ఎఫ్‌ మాల్ ఆఫ్ ఇండియాలో నూతనంగా ప్రారంభించడం జరిగింది. అంతే కాదు ఇకపై భారతదేశంలోని ఏ ప్రాంతాల వారైన మేడమ్ టుస్సాడ్స్‌ మ్యూజియంలో కొలువుదీరిన ప్రముఖుల మైనపు బొమ్మలను చూసేందుక ఆన్‌లైన్‌ ప్రీ బుకింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు నిర్వాహకులు. మోస్ట్ క్రేజీ మ్యూజియంగా పిలవబడే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఎంట్రెన్స్ టికెట్‌ ధర పెద్దలకు 960రూపాయలుగా ..పిల్లలు అంటే 4సంవత్సరాల నుంచి 11ఏళ్లలోపు వారికి ఎంట్రీ టికెట్‌ను 760 రూపాయలుగా నిర్ణయించారు.

Snake Fest: అందరి చేతుల్లో పాములు.. నోటితో పట్టుకొని.. తలపై పెట్టుకొని నృత్యాలు.. ఫొటోలు వైరల్


టూరిస్టులు పెరిగే ఛాన్స్..

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలోని మైనపు విగ్రహాలు చూడాలనుకునే వారు ఇప్పటి వరకు విదేశాలకు వెళ్లాలని ..ఎక్కువ ఖర్చు అవుతుందని భావించేవారు. కాని ఇప్పుడు ఇండియాలో అది కూడా దేశ రాజధానికి అత్యంత సమీపంలో ఉన్న నొయిడాలోనే ఏర్పాటు చేయడంతో ప్రపంచ దేశ పర్యాటకులతో పాటు దేశ పర్యటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యూజియం ప్రారంభించడం కారణంగా నొయిడాకు టూరిస్టుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పటి వరకు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం చూడలేమని ఫీలయ్యే వాళ్లు టికెట్స్‌ బుక్ చేసుకోండి.

Published by:Siva Nanduri
First published:

Tags: India news, Madame tussauds, Noida

ఉత్తమ కథలు