కిక్కెక్కే వార్త.. 25 శాతం తక్కువ రేటుకే లిక్కర్..

కిక్కెక్కించే వార్త చెప్పింది ఢిల్లీ సర్కారు. ఉన్న రేటు కంటే 25 శాతం తక్కువ రేటుకే మద్యాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించింది.

news18-telugu
Updated: December 8, 2019, 8:48 PM IST
కిక్కెక్కే వార్త.. 25 శాతం తక్కువ రేటుకే లిక్కర్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కిక్కెక్కించే వార్త చెప్పింది ఢిల్లీ సర్కారు. ఉన్న రేటు కంటే 25 శాతం తక్కువ రేటుకే మద్యాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించింది. అయితే.. ఒక్క నిమిషం. ఎక్సైజ్ శాఖ తనిఖీల్లో దొరికే మద్యానికి మాత్రమే ఈ రేటు వర్తిస్తుందని తెలిపింది. తనిఖీల్లో పట్టుబడే విదేశీ లేదా.. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్‌‌ను 25 శాతం తక్కువ రేటుకు అమ్ముతామని, ఆ బాటిళ్లపై ఆథరైజ్‌డ్ కాన్ఫిస్కేటెడ్ లిక్కర్ అని రాసి ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం సీజ్ అయిన లిక్కర్‌ను పారబోయడం, ధ్వంసం చేయడం లాంటివి చేస్తున్నారు. దాని బదులు తక్కువ రేటుకు అమ్మాలని కేజ్రీవాల్ సర్కారు నిర్ణయించింది. మద్యం దొరగ్గానే ముందుగా వాటిని ల్యాబ్ టెస్టుకు పంపి.. నాణ్యమైనదేనని తేలితేనే ఆ మద్యాన్ని అమ్మనున్నట్లు వివరణ ఇచ్చింది.

ఈ నిర్ణయాన్ని అమలు చేసే తొలి నగరంగా ఢిల్లీ నిలవనుంది. కాగా, అధికారిక సమాచారం ప్రకారం.. ఆబ్కారీ శాఖ ఏటా 2.5 లక్షల బాటిళ్లను స్వాధీనం చేసుకుంటోంది. 2018-19లోనే రూ.15 కోట్ల విలువైన మద్యాన్ని పట్టుకుంది.

First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>