టైటానిక్ మునిగిపోవడానికి అసలు కారణం అదే...!

టైటానిక్ ఓడ మునిగిపోయి ఎన్నేళ్లైనా, దానికి ఎదురైన ప్రమాదంపై ఎప్పుడూ ఏదో ఒక కొత్త సమాచారం బయట పడుతూనే ఉంది. మనకు మాత్రం పెద్ద మంచుకొండను ఢీకొట్టిన తరువాత టైటానిక్ మునిగిపోయిందని తెలుసు.

news18-telugu
Updated: September 22, 2020, 1:21 PM IST
టైటానిక్ మునిగిపోవడానికి అసలు కారణం అదే...!
టైటానిక్(ఫైల్ ఫొటో)
  • Share this:
టైటానిక్ ఓడ మునిగిపోయి ఎన్నేళ్లైనా, దానికి ఎదురైన ప్రమాదంపై ఎప్పుడూ ఏదో ఒక కొత్త సమాచారం బయట పడుతూనే ఉంది. పెద్ద మంచుకొండను ఢీకొట్టిన తరువాత టైటానిక్ మునిగిపోయిందని మనకు తెలుసు. కానీ అసలు ప్రమాదానికి మంచుతోపాటు సోలార్ ఫ్లేక్స్(సౌర తుపానులు) కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. ఐస్‌బర్గ్‌తో పాటు కమ్యూనికేష‌న్‌ను ప్రభావితం చేసే సోలార్ ఫేర్స్ టైటానిక్ మునిగిపోవడానికి దారితీశాయని తాజాగా వెల్లడించారు.

జేమ్స్ కామెరాన్ తీసిన టైటానిక్ సినిమాలో కూడా అది మంచుకొండను ఢీకొట్టిన తరువాతే మునిగిపోయిందని చూపించారు. కానీ మునిగిపోవడానికి ఆస్కారం లేనట్టుగా రూపొందించిన ఈ ఓడకు జరిగిన ప్రమాదంపై ఇప్పటికీ శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 14, 1912న టైటానిక్ మునిగిపోయింది. ఈ ప్రమాదానికి దారితీసిన అంశాలపై ఓ వార్తాపత్రిక అధ్యయనం మొదలుపెట్టింది. టైటానిక్ ఓడ మునిగిపోవడానికి సౌర మంటలు ముఖ్య కారణమని స్వతంత్ర పరిశోధకుడు మిలా జింకోవా చెబుతున్నారు. సూర్యుడి ఉపరితలంపై ఏర్పడే సౌర తుపానులు భూమిపై కమ్యూనికేషన్ వ్యవస్థను ప్రభావితం చేస్తాయని ఆమె వివరిస్తున్నారు.

ఆ రెండు తుపానులు తప్పడు సంకేతాలిచ్చాయి
సముద్రం వద్ద ఏర్పడిన భూ అయస్కాంత తుఫాను(జియో మ్యాగ్నటిక్ స్ర్టోమ్స్)లతో పాటు సోలార్ ఫ్లేర్స్ కారణంగా టైటానిక్ మునిగిపోయే అవకాశం ఉందని జింకోవా పేర్కొన్నారు. వెదర్ జర్నల్లో దీనికి సంబంధించిన ఓ పరిశోధనా పత్రం కూడా ప్రచురించారు. దీని ప్రకారం ఏప్రిల్ 14, 1912న రాత్రి 11.40కి ఓడ మంచుకొండను ఢీకొట్టింది. ఆ సమయంలో ఓడలో ఉన్న నాలుగో అధికారి జోసెఫ్ బాక్స్హాల్ SOS పాయింట్ వద్ద ఉన్నారు. ఆ సమయంలో నమోదైన అతడి లొకేషన్.. ఒరిజినల్ లొకేషన్కు 13 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. టైటానిక్ మంచుకొండను ఢీకొట్టిన తరువాత సహాయం కోసం అతడు SOS ను పంపాడు. రెస్క్యూ షిప్ కార్పాథియా కూడా ఈ తప్పుడు లొకేషన్ను అందుకుంది. కానీ టైటానిక్ మునిగిపోయిన తరువాత సముద్రంలో పడిన లైఫ్బోట్ల గమనం ఆధారంగా కార్పాథియా నేరుగా ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లగలిగింది. అంతరిక్షంలో ఏర్పడిన సౌర తుపానుల కారణంగానే కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిని తప్పడు లొకేషన్ నమోదైనట్టు తెలుస్తోంది.

దిక్సూచిని ప్రభావితం చేశాయి
అంతరిక్షంలో చోటుచేసుకున్న వివిధ పరిణామాలే టైటానిక్ నావిగేషన్ను తప్పుపట్టించాయనడానికి ఆమె ఆధారాలు చూపిస్తున్నారు. సౌర తుపానులు, వేడి గాలుల కారణంగా భూ అయస్కాంత క్షేత్రం ప్రభావితమైందని పేర్కొన్నారు. దీని కారణంగానే కమ్యూనికేషన్ సిస్టమ్, మ్యాగ్నటిక్ కంపాస్(దిక్సూచి), నావిగేషన్.. వంటివన్నీ మారిపోయి టైటానిక్కు తప్పుడు మార్గాన్ని సూచించాయని ఆమె విశ్లేషిస్తున్నారు. వీటి కారణంగానే ఓడ మార్గం మార్చుకుని మంచుకొండను ఢీకొట్టిందని వివరిస్తున్నారు.

ఆధారాలు నమ్మదినవేనా?టైటానిక్ మునిగిపోయినరోజు రాత్రి ఉత్తర అట్లాంటిక్‌లో బలమైన భూ అయస్కాంత తుఫానును తాము గుర్తించామని Meaww.com కూడా నిర్ధారించిందని జింకోవా చెబుతున్నారు. 1900లో నావిగేషన్కు వాడే దిక్సూచి చిన్నపాటి మార్పులకు కూడా స్పందిస్తుందని ఆమె చెబుతున్నారు. కానీ ఈ తప్పుడు లొకేషన్ కారణంగానే ఎంతోమంది ప్రాణాలతో బయటపడ్డారు. మ్యాగ్నటిక్ ఫీల్డ్ కారణంగా దిక్సూచి చూపించిన తప్పుడు డైరెక్షన్లోనే సాయం చేయడానికి బయలుదేరిన కార్పాథియా ఓడ శిధిలాల దగ్గరకు వచ్చింది. అప్పట్లో బౌగోళిక తుపానుల గురించి, దాని ప్రభావం గురించి ఇప్పుడు ఉన్నంత సమాచారం లేనందున ప్రమాదానికి సిగ్నల్, నావిగేషన్ మార్పులే ప్రమాదానికి కారణాలని చెప్పలేకపోయారని జింకోవా వివరిస్తున్నారు.
Published by: Sumanth Kanukula
First published: September 22, 2020, 1:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading