హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral: వాటి కోసం ఇంత పెద్ద క్యూలో నిల్చున్నారా..? తెలిస్తే మీరూ షాక్ అవుతారు..!

Viral: వాటి కోసం ఇంత పెద్ద క్యూలో నిల్చున్నారా..? తెలిస్తే మీరూ షాక్ అవుతారు..!

క్యూలో నిల్చున్న విద్యార్థులు (Image credit : twitter)

క్యూలో నిల్చున్న విద్యార్థులు (Image credit : twitter)

డిజిటల్ విప్లవం వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగింది. ఇంటర్నెట్లోనే అన్ని విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది. ముఖ్యంగా పుస్తకాలు చదివే అలవాటును స్మార్ట్ ఫోన్ హరించిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ కాలంలోనూ పుస్తక ప్రియుల సంఖ్య పెద్దగా తగ్గలేదని తాజా ఘటన వెల్లడిస్తోంది. పూర్తి వివరాలివే..

ఇంకా చదవండి ...

డిజిటల్ విప్లవం వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగింది. ఇంటర్నెట్లోనే అన్ని విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది. ముఖ్యంగా పుస్తకాలు చదివే అలవాటును స్మార్ట్ ఫోన్ హరించిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ కాలంలోనూ పుస్తక ప్రియుల సంఖ్య పెద్దగా తగ్గలేదని తాజా ఘటన వెల్లడిస్తోంది. ఇంకా చెప్పాలంటే క్యూలో నిల్చుని మరీ ప్రజలు బుక్స్ కొనుగోలు చేస్తున్నారు. కోల్‌కతాలోని ఓ బుక్‌స్టోర్ ముందు పుస్తకాల కోసం జనం బారులు తీరిన ఫోటో వైరల్ అవుతోంది. ముందు చాలామంది మద్యం అమ్మే వైన్స్ ముందు ప్రజలు వేచి చూస్తున్నారేమో అనుకున్నారు. కానీ ఆ తరువాత అసలు విషయం తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. తమ వంతు వచ్చే వరకు క్యూలో నిల్చుని ఎదురుచూసి మరీ కోల్‌కతా వాసులు బుక్స్ కొన్నారు.

పుస్తకాలపై భారీ డిస్కౌంట్..

ఆల్కహాల్ కోసం వైన్స్ షాపుల ముందు బారులు తీరడం, కరోనా కాలంలోనూ ఎలాంటి భయం లేకుండా మందుబాబుల ఎదురుచూపులకు సంబంధించిన ఫొటోలు చాలా చూసి ఉంటారు. కానీ కోల్‌కతాలోని ఓ బుక్ స్టోర్ ముందు మాత్రం.. ప్రజలు పుస్తకాల కోసం బారులు తీరారు. బుక్స్ పై ప్రత్యేక రాయితీలను ప్రకటించడంతో ప్రజలు లైన్లో ఎదురుచూసి మరీ తమకిష్టమైన బుక్స్ కొనుగోలు చేస్తున్నారు. ఈ ఫొటోను ఓ ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశారు. "కోల్‌కతాలో ఓ పబ్లిషర్ స్టోర్ ముందు క్యూలో నిల్చున్న ప్రజల ఫొటో ఇది. ప్రతి నగరంలో ఖాళీగా ఉన్న పుస్తక దుకాణాలు కనిపిస్తాయి. కానీ కోల్‌కతాలో మాత్రం బారుల తీరిన జనంతో ఈ బుక్‌స్టోర్ సందడిగా ఉంది" అని పోస్ట్ పెట్టారు. పంద్రాగస్టు సందర్భంగా పుస్తకాలపై 50 శాతం డిస్కౌంట్ ప్రకటించారని, అందువల్ల స్టోర్ వెలుపల క్యూ ఉందని మరో యూజర్ పేర్కొన్నారు.

నెటిజన్ల విశేష స్పందన..

వైరల్ అవుతున్న ఈ ఫోటోపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే ఈ పోస్టుకు 10 వేల లైకులు వచ్చాయి. ఎంతో మంది తమ స్పందనలను తెలియజేస్తున్నారు. కోల్‌కతా ప్రజలను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. సాహిత్యంపై ఇప్పటికీ ఎంతో ప్రేమ చూపిస్తున్నారని నగరవాసులను కొనియాడారు. "యువత పుస్తకాలు చదవడం మర్చిపోయిందని చాలా మంది సోషల్ మీడియాను తప్పుపడుతున్నారు. ఈ ఫొటో చూస్తే వారికి తాజా పరిస్థితి అర్థమవుతుంది" అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. కొంతమంది మాత్రం విభిన్నంగా స్పందించారు. కోవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలో రద్దీని తగ్గించడానికి పుస్తకాల కోసం ఆన్ లైన్ ప్లాట్‌ఫాంలను ఉపయోగించాలని సూచించారు.

Published by:Veera Babu
First published:

Tags: Kolkata, Reading books, Students, West Bengal

ఉత్తమ కథలు