NORTH KOREANS ORDERED BY KIM JONG UN TO HAND OVER PET DOGS FOR MEAT AMID FOOD SHORTAGES SAYS REPORT NK
North Koreaలో ఆహార కొరత...పెంపుడు కుక్కలపై కన్నేసిన Kim Jong Un
ఆహార కొరత ఉంది... పెంపుడు కుక్కల్ని తిందాం... కిమ్ జోంగ్ ఉన్ షాకింగ్ ఆదేశం
North Korea: అదేం చిత్రమో గానీ... కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) ఎప్పుడూ ప్రపంచానికి ఆశ్చర్యం కలిగిస్తూనే ఉంటాడు. కరోనా కాలంలో ఆయన జారీ చేసిన తాజా ఆర్డర్... ప్రపంచం ఉలిక్కి పడేలా చేస్తోంది.
ఎంత ఆకలేసినా... ఎంత కరవు ఉన్నా... పెంచుకుంటున్న కుక్కల్ని తింటారా... చాలా మంది వాటిని కుటుంబ సభ్యుల్లా భావిస్తూ... ప్రేమానురాగాలు పంచుతారు. ఆ మూగజీవాలైతే ఏకంగా ప్రాణాలే అడ్డేస్తాయి. అలాంటిది ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un)... దేశ ప్రజలకు షాకింగ్ ఆర్డర్ జారీ చేసినట్లు తెలిసింది. దేశంలో తీవ్ర ఆహార కొరత ఉంది కాబట్టి... ప్రజలు తమ పెంపుడు కుక్కల్ని ప్రభుత్వానికి ఇవ్వాలనీ... వాటిని రెస్టారెంట్లకు పంపి... మాంసంగా మార్చి... ఆహార కొరత తీర్చుతామని ఆదేశించినట్లు సమాచారం. న్యూజిలాండ్ హెరాల్డ్ ప్రకారం... ఇప్పుడు ఉత్తర కొరియా(North Korea)లో తీవ్ర ఆహార కొరత ఉంది. దేశ ఆర్థిక పరిస్థితి అస్సలు బాలేదు. ప్రజలు కరవుతో అల్లాడుతున్నారు. పంటలు చేతికి రాలేదు.
కిమ్ జోంగ్ ఉన్ ఈ ఆదేశం జారీ చేయడం వెనక ఓ బలమైన కారణం ఉంది. ఉత్తర కొరియాలో పేదలు... పందుల్ని, కోళ్ల వంటి వాటిని పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. దేశ రాజధాని ప్యాంగ్యాంగ్లో మాత్రం ధనవంతులు కుక్కల్ని, ఇతర జంతువుల్ని పెంచుకుంటున్నారు. ఇలా కుక్కల లాంటి పెంపుడు జంతువుల్ని పెంచుకోవడం అవసరానికి మించిన లగ్జరీ లైఫ్ కింద ప్రభుత్వ అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. అవి లేకపోయినా కొంపలేమీ మునిగిపోవు అనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. దక్షిణ కొరియాకి చెందిన చోసన్ ఇల్బో న్యూస్ పేపర్ ప్రకారం... కుక్కల్ని పెంచుకోవడాన్ని కిమ్ జులైలో బ్యాన్ చేశాడు. ఇళ్లలో కుక్కల్ని పెంచుకోవడం... పొగరుబోతు విధానంగా ఆయన అభిప్రాయపడినట్లు తెలిసింది.
ఇప్పుడు నార్త్ కొరియా అధికారులు... ఏ ఇళ్లలో పెంపుడు కుక్కలు ఉన్నాయో వెతుకుతున్నారు. బలవంతంగా వాటిని లాక్కుంటున్నారు. వాటిలో కొన్నింటిని ప్రభుత్వం నిర్వహిస్తున్న జూలకు పంపుతున్నారు. మరికొన్నింటిని రెస్టారెంట్లకు మాంసం కోసం అమ్ముతున్నారని తెలిసింది. ఈ పరిణామంపై అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు... కానీ కిమ్‌తో పెట్టుకుంటే... ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే కదా... అందుకే కిక్కురుమనట్లేదు.
కొరియా దేశాల్లో కుక్క మాంసానికి చాలా డిమాండ్ ఉంది. అక్కడి ప్రజలు ఆ మాంసాన్ని ఇష్టంగా తింటారు. ఐతే... ఈ సంప్రదాయాన్ని దక్షిణ కొరియా క్రమంగా తగ్గించింది. కానీ పూర్తిగా రద్దు చేయలేకపోయింది. ఇప్పటికీ దక్షిణ కొరియాలో ఏటా దాదాపు 10 లక్షల కుక్కల్ని చంపి తింటున్నారు.
ఈ మధ్య ఐక్యరాజ్యసమితి రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం... ఉత్తరకొరియాలో... 60 శాతం మంది... అంటే... 2.55 కోట్ల మంది... ఆహార కొరతతో అల్లాడుతున్నారు. ఆ దేశ అణ్వాయుధాల తయారీ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ... అంతర్జాతీయంగా ఆంక్షలు ఉండటంతో... చాలా దేశాలు... నార్త్ కొరియాకి ఆహార సప్లై నిలిపివేశాయి. దానికి తోడు... పంటలు చేతికొచ్చే సమయంలో పెద్ద ఎత్తున వరదలు వచ్చి... పంటలు నాశనం అయ్యాయి. ఇక కరోనా వల్ల ఆహార సప్లై చైన్ కూడా దెబ్బతింది.