NORTH KOREAN LEADER KIM JONG UN LOOKED SLIMMER LEADS SPECULATION ABOUT HIS HEALTH READ FULL STORY GH SRD
Viral News : దేవుడా..బొద్దుగా ఉండే కిమ్ ఇలా గుర్తుపట్టలేకుండా ఉన్నాడేంటి..? అతని వాచ్ ధర ఎంతో తెలుసా..?
Photo Credit : Twitter
Viral News : ఉత్తర కొరియా అధ్యక్షుడు, నియంత కిమ్ జింగ్ ఉన్ ముద్దుగా బొద్దుగా ఉంటాడు. కానీ, ఈ మధ్య అతను గుర్తుపట్టలేనంతగా తయారయ్యాడు. అయితే ఇప్పుడు ప్రపంచం దృష్టి అంతా అతడు ధరించిన వాచ్ పైనే పడింది.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు సంబంధించిన ఏ విషయమైన ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. ఆయన నియంత పాలన, తీసుకునే సంచలన నిర్ణయాలతో ఎప్పుడూ చర్చల్లో ఉంటారు. అటువంటి కిమ్ గత కొన్ని నెలలపాటు అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో కిమ్ చనిపోయారనే వార్తలు అంతర్జాతీయ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తర్వాత వివిధ అధికారిక కార్యక్రమాల్లో కిమ్ పాల్గొన్న ఫోటోలను అక్కడి మీడియా విడుదల చేయడంతో ఆ వార్తలకు పుల్‌స్టాప్ పడింది. ఇదిలా ఉంటే, తాజాగా కిమ్ అధ్యక్షతన ఉత్తర కొరియాలో ఓ కీలక ఆర్థిక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలు దక్షిణ కొరియా సీక్రెట్ ఏజెన్సీ ద్వారా బయటకు పొక్కాయి. అయితే, అందులో కిమ్ రూపం మారిపోయి ఉండటం చర్చకు దారి తీస్తోంది. ఆయన ముఖం, మెడ, చేతులు, ఛాతి భాగం సన్నబడిపోయి శరీరాకృతిలో మార్పు కనిపిస్తుంది. ఇందులో అతని ఎడమ మణికట్టు మునుపటి కంటే సన్నగా కనిపిస్తుంది. ఆయన ధరించిన వాచ్ వదులుగా ఉండటాన్ని బట్టి నిపుణులు ఈ విషయాన్ని నిర్దారిస్తున్నారు.
ఆయన ధరించిన వాచ్ ఖరీదు దాదాపు 12 వేల డాలర్ల ఉండొచ్చని అంచనా. అయితే, 2020 నవంబర్‌లో జరిగిన సమావేశాల్లో కూడా కిమ్ ఇదే వాచ్ ధరించారు. దీంతో అప్పటి ఫోటోలకు, ఇప్పటి ఫోటోలతో జత చేసి పరీక్షించగా అతడు సన్నబడ్డట్లు తేలింది. అయితే, ఆయన కావాలనే సన్నబడ్డారా? లేదా అనారోగ్య కారణాల వల్ల సన్నబడ్డారా? అనే విషయంపై స్పష్టత లేదు. అయితే, కిమ్ తన ఆరోగ్యాన్ని మొరుగుపర్చుకోవడంలో భాగంగానే ఇలా బరువు తగ్గి స్లిమ్‌గా తయారయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, కిమ్ ఫ్యామిలీలో స్థూలకాయం సమస్య వారసత్వంగా వస్తోంది, ఆయన కుటుంబంలో చాలా మంది గుండె పోటుతో మరణించారు. కిమ్‌కు కూడా గుండె జబ్బు సమస్య ఉంది. అందుకే, కిమ్ సన్నబడటానికి శస్త్ర చికిత్స చేయించుకొని ఉంటాడని కొందరు భావిస్తున్నారు.
Kim Jong Un walking into the politburo meeting, from KCTV June 5. Also some hummingbird applause on the left there pic.twitter.com/Cpbum5Txgs
కాగా, సియోల్‌కు చెందిన కవూహపన్ అనే దినపత్రిక మాత్రం కిమ్ గురించి ఆసక్తికర కథనం ప్రచురించింది. ఉత్తర కొరియాలో కిమ్ అధికారంలోకి వచ్చే నాటికి 90 కేజీల బరువున్నాడు. ఆ తర్వాత 2019 నాటికి 50 కేజీల బరువు పెరిగి ఏకంగా 140 కిలోలకు చేరుకున్నాడు. దీని ప్రకారం, కిమ్ 2011లో అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి ఏటా దాదాపు 6 నుంచి 7 కిలోల బరువు పెరిగినట్లు సదరు వార్తా కథనం అంచనా వేసింది. ది గార్డియన్ ప్రకారం, కిమ్ చైన్ స్మోకర్, విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతాడు. కిమ్ విపరీతంగా మాంసాన్ని తింటాడు. తన హెల్త్ కేర్‌ను అస్సలు పట్టించుకోడు. ఈ కారణాలన్నీ గతంలో కిమ్ బరువు పెరగడానికి దోహదం చేశాయని తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ, కిమ్ సన్నబడ్డ ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.