• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • NORTH KOREA SUPREME LEADER KIM JONG UN STOPS HIS TRAIN FOR CIGARETTE BREAK BA

కిమ్ జోంగ్ ఉన్‌పై వైరల్ న్యూస్.. ఈ సారి సిగరెట్ కోసం..

కిమ్ జోంగ్ ఉన్‌పై వైరల్ న్యూస్.. ఈ సారి సిగరెట్ కోసం..

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ (File)

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టుగా కిమ్ జోంగ్ ఉన్ సిగరెట్ తాగాలనుకోగానే.. వెంటనే రైలును ఆపేశారు.

  • Share this:
    ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తీరే వేరు. ఆయన గురించి ప్రపంచం మొత్త కథలు కథలుగా చెప్పుకుంటుంది. కిమ్ జోంగ్ ఉన్ వింత వింత నిర్ణయాలు కూడా బాగా పాపులర్. అలాంటి కిమ్ జోంగ్ ఉన్ మరోసారి ఇంటర్నెట్‌లో పాపులర్ అయ్యాడు. ఈ సారి సిగరెట్‌తో. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కలసి వియత్నాంలో ఓ శాంతి చర్చలో పాల్గొనాల్సి ఉంది. అందుకోసం తన మంది మార్బలం, ఆయుధాలతో కలిపి ఓ ట్రైన్ నిండా నింపి కిమ్ జోంగ్ ఉన్ బయలుదేరాడు. సుమారు నాలుగు వేల కిలోమీటర్ల ఆ ప్రయాణం మధ్యలో మనోడికి సిగరెట్ తాగాలని నోరు పీకేసింది.

    Kim Jong Un, North Korea, Buzz, Trending, Viral video, Smoking, Kim Jong-un smoking, Kim Jong-un smoking in China, Nanning Railway Statuon, Hanoi, కిమ్ జోంగ్ ఉన్, ఉత్తర కొరియా, ఉత్తర కొరియా కిమ్ జోంగ్ ఉన్, కిమ్ జోంగ్ ఉన్ ఉత్తరకొరియా, సిగరెట్ తాగిన కిమ్ జోంగ్ ఉన్, కిమ్ జోంగ్ ఉన్ సిగరెట్, రైలు ఆపేసి సిగరెట్ తాగిన కిమ్ జోంగ్ ఉన్
    కిమ్ జోంగ్ ఉన్ సిగరెట్ తాగుతుంటే యాష్ ట్రే పట్టుకున్న సోదరి (Image:Twitter)


    రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టుగా కిమ్ జోంగ్ ఉన్ సిగరెట్ తాగాలనుకోగానే.. వెంటనే రైలును ఆపేశారు. అదృష్టవశాత్తూ ఎక్కడో అడవిలో కాకుండా ఓ ఊళ్లో ఫ్లాట్ ఫాం మీదే ఆపారు. ఎంచక్కా తన బోగీలో నుంచి కిందకు దిగిన కిమ్ జోంగ్ ఉన్ తనివితీరా దమ్ముకొట్టి ఆ తర్వాత మళ్లీ ట్రైన్ ఎక్కాడు. కిమ్ జోంగ్ ఉన్ సిగరెట్ తాగుతూ ఉంటే, అతని చెల్లెలు ఓ క్రిస్టల్ యాష్ ట్రే పట్టుకుని నిలబడి ఉంది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    Kim Jong Un, North Korea, Buzz, Trending, Viral video, Smoking, Kim Jong-un smoking, Kim Jong-un smoking in China, Nanning Railway Statuon, Hanoi, కిమ్ జోంగ్ ఉన్, ఉత్తర కొరియా, ఉత్తర కొరియా కిమ్ జోంగ్ ఉన్, కిమ్ జోంగ్ ఉన్ ఉత్తరకొరియా, సిగరెట్ తాగిన కిమ్ జోంగ్ ఉన్, కిమ్ జోంగ్ ఉన్ సిగరెట్, రైలు ఆపేసి సిగరెట్ తాగిన కిమ్ జోంగ్ ఉన్
    ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ (File)


    కిమ్ జోంగ్ ఉన్ బహిరంగంగా సిగరెట్లు తాగడం ఇదే మొదటిసారి కాదు. 2017లో ఓ బాలిస్టిక్ క్షిపణి పక్కనే నిలబడి రెండు వేళ్ల మధ్య సిగరెట్ పెట్టుకుని గుప్ గుప్ మంటూ పొగ వదులుతున్న ఫొటో వైరల్‌గా మారింది. అంతకు ముందు ఓ అనాధ ఆశ్రమానికి వెళ్లిన సందర్భంలో కూడా కిమ్ జోంగ్ ఉన్ ఇలాగే బహిరంగంగా ధూమపానం చేస్తూ ఫొటోలకు చిక్కాడు.
    First published: