• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • NORTH KOREA EXECUTED 5 OFFICIALS AFTER FAILED TRUMP SUMMIT

ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ దాష్టీకం...ఐదుగురు దౌత్య అధికారులు హతం

ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ దాష్టీకం...ఐదుగురు దౌత్య అధికారులు హతం

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(ఫైల్ ఫోటో)

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌-ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ మధ్య జరిగిన రెండో విడత చర్చలు విఫలం కావడంతో ఐదుగురు దౌత్య అధికారులను కిమ్ అంతమొందించారు. సుప్రీమ్ నేతకు నమ్మక ద్రోహానికి పాల్పడినందుకు ఈ చర్యకు పాల్పడినట్లు దక్షిణ కొరియాకు చెందిన ఓ పత్రిక వెల్లడించింది.

  • Share this:
    ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ దాష్టీకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌‌-కిమ్ మధ్య వియత్నాంలో జరిగిన చర్చలు విఫలం కావడంతో ఐదుగురు దౌత్య అధికారులను కిమ్ అంతమొందించారు. ఆ మేరకు దక్షిణ కొరియాకు చెందిన ఓ ప్రముఖ పత్రిక(ది చోసన్ ఐల్బో) ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. వీరిలో అమెరికా ప్రత్యేక రాయబారి కిమ్ హ్యాక్ చోల్‌ కూడా ఉన్నారన్నది ఆ సంచలన కథనంలోని ప్రధాన సారాంశం. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌-కిమ్ మధ్య రెండోసారి జరిగిన హ‌నోయి స‌మావేశానికి గ్రౌండ్ ప్లాన్ చేసింది కిమ్ హ్యాక్ చోల్‌ కావడం విశేషం. హనోయికి కిమ్‌తో కలిసి ప్రైవేటు రైలులో కూడా కిమ్ హ్యాక్ చోల్ ప్రయాణించారు.

    north korea, kim executed, trump summit, kim jong un news, executed, ఉత్తర కొరియా, నార్త్ కొరియా, కిమ్ జోంగ్ ఉన్, ఉరిశిక్ష
    హ‌నోయిలో ట్రంప్-కిమ్ మధ్య చర్చలు(ఫైల్ ఫోటో)


    ఉత్తర కొరియా ‘సుప్రీం నేత’కు నమ్మక ద్రోహానికి పాల్పడినందుకు కిమ్ హ్యాక్ చోల్‌ను ఫైరింగ్ స్క్వాడ్ హ‌త‌మార్చిన‌ట్లు దక్షణ కొరియా పత్రిక తెలిపింది. మార్చి మాసంలో అమెరికా నుంచి ఉత్తర కొరియాకు వెనుదిరిగి వచ్చిన కిమ్ హ్యాక్ చోల్‌ను మిరిమ్ విమానాశ్రయంలో ఉత్తర కొరియాకు చెందిన ఫైరింగ్ స్క్వాడ్ ఆయనతో పాటు మరో నలుగురు సీనియర్ విదేశాంగ అధికారులను కాల్చి చంపినట్లు వెల్లడించింది. ఫైరింగ్ స్క్వాడ్ చేతిలో హతమైన మిగిలన నలుగురు అధికారులు ఎవరో ఆ పత్రిక వెల్లడించలేదు. ఓ ద‌ర్యాప్తు నివేదిక ఆధారంగా కిమ్ ఆదేశాల మేరకు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
    First published: