మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ సంస్థ హెచ్ఎండీ గ్లోబల్ మరో న్యూ మొబైల్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. నోకియా ఎక్స్ 71 పేరుతో వస్తున్న ఈ మొబైల్ని ఏప్రిల్ 2న తైవాన్ మార్కెట్లో ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈవెంట్ కోసం అందరికీ ఇన్విటేషన్లను కూడా పంపింది సంస్థ. ఇప్పటికే ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ లీకయ్యాయి. అవేంటో చూద్దాం.. Nokia X71 Features :
ప్రాసెసర్ : స్నాప్డ్రాగన్ 660
ర్యామ్ : 6జీబీ
ఆండ్రాయిడ్ : 9
స్క్రీన్ : 6.22 ఇంచెస్
కెమెరా : 48 ఎంపీ
ట్రిపుల్ రియర్ కెమెరా
అయితే, ఫోన్ పేరుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం, నోకియా ఎక్స్ 71 అని ఉండగా.. ఇతర మార్కెట్లలో ఈ ఫోన్ పేరు నోకియా 8.1 గా ఉండే అవకాశముంది. అంతేకాదు.. నోకియా 6 లేదా నోకియా 6. 2గా ఉండొచ్చనే వార్తలు షికారు చేస్తున్నాయి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.