హోమ్ /వార్తలు /trending /

ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్.. అది లేనిదే నెల జీతం రాదు..

ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్.. అది లేనిదే నెల జీతం రాదు..

ప్రభుత్వ ఉద్యోగులకు పిడుగులాంటి వార్త. ప్రస్తుతానికి ఇది ఒక రాష్ట్రమే అమలు అమలు చేస్తోన్నా, రాబోయే అతి కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా ఇలాంటి విధానాలే రానున్నాయి. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ నిర్బంధం కాకున్నా ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో సీన్ మొత్తం మారిపోయింది..

ఇంకా చదవండి ...

  కరోనా మహమ్మారి దెబ్బకు మన దేశంలో గడిచిన రెండేళ్లుగా ఎపిడమిక్ యాక్ట్ నిరంతరాయంగా అమలులో ఉంది. ఆ చట్టం ప్రకారమే కొవిడ్ ఆంక్షల ప్రకటన, సామూహిక టీకాల పంపిణీ (మాస్ వ్యాక్సినేషన్)ను ప్రభుత్వాలు చేపట్టాయి. అయితే, భారత్ లో వ్యాక్సినేషన్ నిర్బంధమేమీ కాదు. ఆ మాటకొస్తే ప్రపంచమంతటా పౌరులు వ్యాక్సిన్లు పొందడం అనేది ఐశ్చికమే తప్ప నిర్బంధం కానేకాదు. కానీ, ఒమిక్రాన్ వ్యాప్తితో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రెండో వేవ్ లో లక్షల మందిని పొట్టన పెట్టుకున్న డెల్టా కంటే ఐదారు రెట్లు ప్రమాదకరమైనదిగా భావిస్తోన్న ఒమిక్రాన్ రాబోయే రోజుల్లో సృష్టించబోయే విలయాన్ని దృష్టిలో ఉంచుకుని పలు రాష్ట్రాలు దాదాపు నిర్బంధ వ్యాక్సిన్ విధానంవైపు మళ్లుతున్నాయి.

  ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో ప్రపంచ దిగ్గజ కంపెనీల నుంచి గల్లీ స్థాయి సంస్థల దాకా దాదాపు అన్నీ తమ ఉద్యోగులు వ్యాక్సిన్ పొందడాన్ని తప్పనిసరి చేశాయి. ప్రభుత్వాల పరంగా చూస్తే కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి కొద్ది రోజుల కిందట నిర్బంధ వ్యాక్సిన్ విధానాన్ని తీసుకొచ్చింది. అయితే బయటి నుంచి పాండిచేరే వేళ్లే వారికి మాత్రమే అది వర్తిస్తుంది. తాజాగా పంజాబ్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధన మాత్రం అక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ కొట్టేలా ఉంది.

  లోదుస్తులు లేకుండా బిగువైన బాడీసూట్‌.. ఎయిర్‌పోర్టులో Poonam Pandey పోజులపై రచ్చ

  ఒమైక్రాన్‌ ఆందోళనల మధ్య.. పండుగలు రానుండడంతో రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. కర్ణాటకలో కొత్త ఏడాది వేడుకలపై నిషేధం విధించగా, ఢిల్లీ క్రిస్మ్‌సతో పాటు కొత్త సంవత్సర వేడుకలనూ నిషేధించింది. సామూహిక కార్యక్రమాలకు అనుమతి తప్పనిసరని ముంబై కార్పొరేషన్‌ ఆదేశాలిచ్చింది. టీకా ఒక డోసు పొందినా, రెండు డోసులు తీసుకున్నా.. ధ్రువపత్రాన్ని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తేనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇవ్వాలని పంజాబ్‌ నిర్ణయించింది. ఈ మేరకు చన్నీ సర్కారు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

  నో వ్యాక్సిన్.. నో శాలరీ విధానాన్ని ప్రకటించిన పంజాబ్ సర్కారుపై ఉద్యోగ సంఘాలు గుర్రుగా ఉన్నాయి. తప్పనిసరి వ్యాక్సినేషన్ చట్టంలో లేకుననా ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు దిగడమేంటని ప్రశ్నిస్తున్నాయి. తాము వ్యాక్సిన్లకు వ్యతిరేకం కానప్పటికీ, జీతం ఆపివేత లాంటి తీవ్ర నిర్నయాలు సరికాదని, టీకాలు పొందేందుకు ఉద్యోగులు అందరికీ గడువు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

  Hyderabad హడలెత్తిస్తోన్న కొత్త వ్యాధి.. ఒక్క గాంధీలోనే 15 కేసులు.. Scrub Typhus వ్యాప్తి ఇలా..

  కొవిడ్ వ్యాక్సిన్ పూర్తిగా పొందనివారిని జనవరి 1 నుంచి దుకాణ సముదాయాలు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లకు అనుమతించకూడదని హర్యానా సర్కారు ఉత్తర్వులిచ్చింది. యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ భార్య, మాజీ ఎంపీ డింపుల్‌ యాదవ్‌కు కరోనా సోకింది. అఖిలేశ్‌ ఇంతవరకు టీకా పొందలేదు. ఎన్నికలున్నందున.. వైరస్‌ కట్టడికి తీసుకుంటున్న చర్యలను చెప్పాలని యూపీ సర్కారును ఎన్నికల సంఘం కోరింది.

  First published:

  ఉత్తమ కథలు