ఆధార్‌తో సోషల్ మీడియా అకౌంట్ల లింకేజీపై కేంద్రం వివరణ..

Aadhaar Facebook Linkage : సోషల్ మీడియా అకౌంట్లతో ఆధార్ అనుసంధానం చేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు.

news18-telugu
Updated: November 20, 2019, 8:24 PM IST
ఆధార్‌తో సోషల్ మీడియా అకౌంట్ల లింకేజీపై కేంద్రం వివరణ..
ఫేస్ బుక్ లోగో, ఆధార్ కార్డ్
  • Share this:
ఫేక్ వార్తలను అదుపులో పెట్టేందుకు ఫేస్‌బుక్, వాట్సాప్, తదితర సోషల్ మీడియా అకౌంట్లను ఆధార్‌తో లింక్ చేస్తుందని బోలెడన్ని వార్తలు వచ్చాయి. అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది. అయితే.. దీనిపై కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ తాజాగా స్పందించారు. సోషల్ మీడియా అకౌంట్లతో ఆధార్ అనుసంధానం చేసే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. కాగా.. అన్ని సోషల్ మీడియా అకౌంట్లకు ఆధార్ లేదా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఓ గుర్తింపు నంబరును లింక్ చేయాలంటూ మద్రాస్ హైకోర్టులో రెండు, మధ్యప్రదేశ్, బోంబే హైకోర్టుల్లో చెరో పిటిషన్ దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై స్పందించిన ఫేస్ బుక్ అన్నీ కలసి సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ గతంలో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు పొందే వారి బ్యాంకు ఖాతాలకు మాత్రమే ఆధార్‌ను అనుసంధానించే అవకాశం ఉన్నందున కొత్తగా సోషల్‌ మీడియా ఖాతాలకు కూడా లింక్‌ చేయాలని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే.. ఆధార్‌ చట్ట ప్రకారం భారత సంచిత నిధితో సంబంధం లేని విషయాలతో ఆధార్‌ నంబరును అనుసంధానించడం కుదరడం వీలు కానందున ఆ నిర్ణయాన్ని కేంద్రం పక్కనపెట్టేసినట్లు తెలుస్తోంది.

First published: November 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>