నమాజులకు నో పర్మిషన్... చైనా కంపెనీల తీరుపై పాక్‌లో నిరసనలు

ఇన్నాళ్లూ చైనాను వెనకేసుకొచ్చిన పాకిస్థాన్‌కు ఇప్పుడు తెలిసొస్తోంది. జిత్తుల మారి డ్రాగన్ తమను కూడా ఇబ్బంది పెడుతోందని గ్రహిస్తోంది.

news18-telugu
Updated: July 1, 2020, 8:35 AM IST
నమాజులకు నో పర్మిషన్... చైనా కంపెనీల తీరుపై పాక్‌లో నిరసనలు
నమాజులకు నో పర్మిషన్... చైనా కంపెనీల తీరుపై పాక్‌లో నిరసనలు (File)
  • Share this:
ఇండియా ఎంతో శాంతియుత దేశం. మన దేశంలో ఓ రాష్ట్రం అంత విస్తీర్ణం ఉంటే పాకిస్థాన్‌లో పాలకులు ఎప్పుడూ ఇండియాపై పడి ఏడుస్తూ ఉంటారు. చైనాతో జట్టు కట్టి... భారత్‌పై కుట్రలు పన్నుతారు. కానీ... అదే చైనా ఇప్పుడు పాకిస్థాన్‌కి షాక్ ఇచ్చింది. ఏంటంటే... పాకిస్థాన్‌లోని చైనా కంపెనీల్లో పనిచేసే ముస్లింలు... పని వేళల్లో నమాజులు చెయ్యకూడదని చైనా ఆదేశించింది. ఓ ముస్లిం మత పెద్ద... పాకిస్థాన్‌లోని ఓ చైనా కంపెనీలో పనిచేస్తూ... డ్యూటీ టైమ్‌లో నమాజు చేసుకుంటుంటే... ఆ కంపెనీ అడ్డుకుంది. నమాజు చెయ్యడానికి వీల్లేదంది. ఎందుకంటే... రూల్స్ తెలుసుకోండి అని చెప్పడంతో... ఇప్పుడు ఆ వీడియో పాకిస్థాన్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. చైనాకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు.

నమాజు అనేది అత్యంత పవిత్రమైన కార్యక్రమం. ఇస్లాంలోని ఐదు ప్రధాన మూల స్తంభాల్లో అల్లాను ప్రార్థించడం అనేది ఓ ప్రధాన అంశం. రోజూ ఐదు సార్లు ముస్లింలు నమాజు చేస్తారు. అది వారి దినచర్యలో భాగం. ఈ నియమాన్ని వారు ఎంతో నిష్టగా పాటిస్తారు. అలాంటిది నమాజు చెయ్యవద్దని ఆర్డర్ వెయ్యడం... అందులోనూ పాకిస్థాన్‌లో అలా ఆర్డర్ వెయ్యడం తీవ్రమైన అంశంపై అక్కడి ప్రజలు భావిస్తున్నారు. తమ దేశంలో కంపెనీలు పెట్టుకొని... తమకే ఇబ్బంది పెడతారా... ఇదెక్కడి న్యాయం... చైనా గో బ్యాక్ అంటూ పాకిస్థాన్ ప్రజలు ఇప్పుడు రగిలిపోతున్నారు.

తనను నమాజు చెయ్యవద్దనడంతో... ఆ మత పెద్ద చాలా ఆవేదన చెందారు. అదే వీడియోలో... "చైనా కంపెనీలు... స్థానిక చట్టాల్ని గౌరవించాలి. ఈ దేశం మీది కాదు" అని నినాదం చేశారు. అంతే కాదు... "మేం నమాజును నిర్లక్ష్యం చెయ్యం. ఉద్యోగాలు పోతాయనే భయం ప్రజల్లో ఉండొచ్చు. కానీ ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం" అని ఆ వీడియోలో తెలిపారు.

ఒకప్పుడు బ్రిటిషర్లు కూడా ఇలాగే... ఇండియాలో వ్యాపారాలు చేసుకుంటామని వచ్చి... ఆ తర్వాత ఇండియన్లనే బానిసలుగా మార్చారు. అందుకే పాక్ ప్రజలు తాజా ఘటనపై తీవ్ర ఆవేదనతో, ఆగ్రహంతో ఉన్నారు. నిజానికి చైనా... పాకిస్థాన్‌లో పెద్ద ఎత్తున దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టేందుకు డీల్స్ కుదుర్చుకుంది. ఇప్పుడు చైనా ఇలాంటి చర్యలకు దిగితే... కచ్చితంగా పాక్ ప్రజల ఆగ్రహం చూడక తప్పదు.


ఇప్పటికే చైనా... జింజియాంగ్‌లోని కరామే నగరంలో ముస్లింలు గెడ్డంతో, మహిళలు తలపై బురఖాతో తిరగరాదని ఆర్డర్ జారీ చేసింది. అలాగే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ముస్లింలు పవిత్రమైన నెలవంక సింబల్ వాడకూడదని స్థానిక ప్రభుత్వం ఆదేశించింది. ఈ చర్యలతో ఇస్లాం ప్రపంచం చైనాపై ఆగ్రహంతో ఉంది.

చైనా రాన్రానూ ముస్లింలకు వ్యతిరేక నిర్ణయాలే తీసుకుంటోంది. పాకిస్థాన్‌తో జట్టు కట్టడం వెనక తన వ్యాపార లాభాపేక్ష కోసమే తప్ప... పాక్‌పై ప్రేమతో కాదు. ఈ విషయాన్ని పాకిస్థాన్ ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిదంటున్నారు నిపుణులు.
First published: July 1, 2020, 8:35 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading