మందుబాబులకు మోదీ సర్కార్ బిగ్ షాక్..

మద్యం అమ్మకాలపై ఈ నెల 20 తేదీ సడలింపులు ఉంటాయని, మద్యం దొరుకుతుందేమోనని ఆశపడ్డ మందు బాబులకు మోదీ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది.

news18-telugu
Updated: April 17, 2020, 2:43 PM IST
మందుబాబులకు మోదీ సర్కార్ బిగ్ షాక్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మద్యం అమ్మకాలపై ఈ నెల 20 తేదీ సడలింపులు ఉంటాయని, మద్యం దొరుకుతుందేమోనని ఆశపడ్డ మందు బాబులకు మోదీ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. మద్యం అమ్మకాలకు సడలింపు ఇవ్వబోమని, వైన్ షాపులు తెరుచుకోవని స్పష్టం చేసింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఏప్రిల్ 20 తర్వాత ఇవ్వనున్న సడలింపులో మద్యం దుకాణాలు లేవు. మద్యం రోగ నిరోధక శక్తిని చంపేస్తుంది. అందుకే కేంద్రం ఎలాంటి ఎలాంటి సడలింపు ఇవ్వడం లేదు. అమ్మకాలపై నిషేధం విధిస్తూ మార్గదర్శకాలిచ్చాం కూడా. కానీ, కొన్ని రాష్ట్రాలు ఆన్‌లైన్‌లో మద్యం అమ్మాలని చూస్తున్నాయి. వాటిపై నిర్ణయం రాష్ట్రాలదే’ అని తేల్చి చెప్పారు. గ్రీన్ జోన్లలో ఆంక్షలను తొలగించనున్నట్లు చెప్పిన ఆయన.. కొన్ని దుకాణాలు, నిర్మాణ పనులు వంటివి చేసుకోవడానికి సడలింపులు ఇస్తున్నట్లు చెప్పారు. కేంద్ర హోం శాఖ నేతృత్వంలో 24 గంటలు అన్ని రాష్ట్రాలతో నిరంతరం పర్యవేక్షణ జరుపుతున్నామని అన్నారు.

అటు.. డాక్టర్ల మీద, వైద్య సిబ్బంది మీద దాడులపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్లపై దాడికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రాలకు ఆదేశాలు కూడా ఇచ్చామని వెల్లడించారు.
First published: April 17, 2020, 2:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading