Home /News /trending /

NO DJ DANCE ONLY CLEAN SHAVEN GROOMS ALLOWED RAJASTHAN COMMUNITYS NEW WEDDING RULES GO VIRAL PAH

రేయ్ ఏందిరా ఇది.. గడ్డం ఉంటే పెళ్లి చేసుకోరు.. డీజేలకు కూడా నో ఛాన్స్.. ఎందుకో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rajasthan: అక్కడ యువకులను పెళ్లి చేసుకొవాలంటే క్లీన్ షేవ్ మాత్రమే ఉండాలి. అదే విధంగా పెళ్లికి రానివ్వాలన్న ఎప్పుడు నీట్ గానే షేవ్ చేసుకొవాలి. ఇంకా పెళ్లికి ఇష్టమోచ్చినట్లు ఖర్చుపెడతామంటే కుదరదు.

పెళ్లి (Marriage) అంటేనే ఒక హాంగామా. డీజే ల హోరు.. స్నేహితులు, బంధువుల మధ్య మాస్ స్టెప్పులు వేస్తుంటారు. ఈ మధ్య అసలు పెళ్లిళ్ల (Wedding) ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఇంతలా ఆర్భాటాలు, హంగామాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు మాత్రం.. ప్రతి వేడుకను యువత .. జీవింతో మరిచిపోలేని విధంగా చేసుకొవాలని ప్లాన్ లు వేస్తున్నారు. దీని కోసం ఎంత ఖర్చైన చేస్తున్నారు.

ప్రీవెడ్డింగ్ షూట్ నుంచి హల్దీ, మెహందీ, ప్రతి వేడుక గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే, ఇక్కడ మాత్రం విచిత్రంగా పెళ్లిలో హల్దీ వేడుకకు అనుమతి ఇవ్వలేదు. అదే విధంగా గడ్డం ఉంటే అసలు పెళ్లి చేసుకోరు. ఎవరి పెళ్లికి కూడా రానివ్వరు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.పూర్తి వివరాలు.. యువత రకరకాల ఫ్యాషన్లు ఫాలో అవుతుంటారు. కొందరికి గడ్డం పెంచుకొవడం అంటూ ఇంట్రెస్ట్. ( No DJ Dance Only Clean Shave) మరికొందరికి వెంట్రుకలకు జెల్ లను పెట్టుకుంటున్నారు. రకరకాల ఫ్యాషన్లను ఫాలో అవుతుంటారు. ఇక పెళ్లి అంటే మాములుగా ఉండదు. దీనికోసం యువత ఒక రేంజ్ లో ప్లాన్ లు వేస్తుంటారు. కానీ రాజస్థాన్ లోని  (Rajasthan) 19 గ్రామాల్లోని ప్రజలు వింత సాంప్రదాయం పాటించాలని, గ్రామంలోని కుమావత్ సంఘం పెద్దలు తీర్మానించారు. దీనిప్రకారం.. పెళ్లి (Wedding) చేసుకొవాలంటే క్లీన్ షేవ్ మాత్రమే ఉండాలి.

హల్దీ వేడుకకు అనుమతి నిరాకరించారు. అదే విధంగా.. బండోలి డ్యాన్స్, నల్లమందు తాగడాన్ని నిషేధించారు. ఇక వధువు కూడా.. బంగారం, వెండిని ఎంత వేసుకొవాలని ప్రత్యేకంగా ఒక లిస్ట్ తయారు చేశారు. పెళ్లిలో ఇష్టమోచ్చినట్లు వంటకాలను వేస్ట్ చేయరాదని కుమావత్ సంఘం తాజాగా తీర్మానించింది. గడ్డం ఉంటే యువకులు అందంగా కనపడరని, గడ్డం తీసేస్తేనే.. యువకులు రాజుల్లాగా స్మార్ట్ గా కనపడతారని.. అందుకే క్లీన్ షేవ్ చేసుకోవాలని తమ సంఘం నిర్ణయిచిందని అన్నారు. సంఘంలో దాదాపు.. 20 వేల మంది సభ్యులు ఉన్నారు. కుమావత్ సంఘం మార్గదర్శకాలను అతిక్రమిస్తే.. జరిమాన విధిస్తామని సంఘం పెద్దలు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఫన్నీ నియమాలు నెట్టింట (Social media)  వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా ఒక ట్రాఫిక్ పోలీసు హైవే (Traffic constable) మీద కూడలి వద్ద చీపురు పట్టుకుని రోడ్డును శుభ్రం చేశాడు.

కూడలి వద్ద రోడ్డు డ్యామేజ్ అయ్యింది. కంకర పైకి తేలింది. ఇసుక కూడా పైకి తెలింది. దీంతో కొన్ని సార్లు.. ప్రయాణికులు అదుపుతప్పి పడిపోయే ఛాన్స్ ఉంది. దీన్ని గమనించిననన ట్రాఫిక్ కానిస్టేబుల్ తానే రంగంలోనికి దిగాడు. చీపురు పట్టుకుని రోడ్డుపైన తెలిన కంకరను, ఇసుకను శుభ్రం చేశాడు. (Traffic Cop Sweeps Busy Road) రోడ్డుపైన ప్రయాణికులు ఉన్న ట్రాఫిక్ అధికారి ఏమాత్రం మోహమాట పడలేదు.

కేవలం ప్రజలకు ఇబ్బంది కలగ కూడదనే మాత్రమే ఆలోచించాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ఈ వీడియోను (Viral video) ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (Social media)  తెగ హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు.. ప్రయాణికుల భద్రత కోసం ఇలాంటి చర్యలు తీసుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరీకొందరు మీ గొప్ప తననానికి మా సెల్యూట్ సర్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Marriage, Rajasthan, Trending news, VIRAL NEWS, Wedding

తదుపరి వార్తలు