శబరిమల ఆలయంలోకి మహిళలందరికీ ప్రవేశం..

Sabarimala : శబరిమల ఆలయాన్ని తెరిచిన నేపథ్యంలో ఇప్పుడు ఆలయంలోకి మహిళలకు ప్రవేశం ఉందా? లేదా? అన్న సందిగ్ధం కొనసాగుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ స్పందించారు. రివ్యూ పూర్తయ్యే వరకు మహిళలకు ప్రవేశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

news18-telugu
Updated: November 20, 2019, 1:28 PM IST
శబరిమల ఆలయంలోకి మహిళలందరికీ ప్రవేశం..
శబరిమల ఆలయం
  • Share this:
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ గత ఏడాది సెప్టెంబరులో ఇచ్చిన తీర్పును కొనసాగిస్తున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. శబరిమల వివాదంపై తీర్పును పున:పరిశీలించేందుకు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తూ వారం క్రితం సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. శబరిమల ఆలయాన్ని తెరిచిన నేపథ్యంలో ఇప్పుడు ఆలయంలోకి మహిళలకు ప్రవేశం ఉందా? లేదా? అన్న సందిగ్ధం కొనసాగుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ స్పందించారు. రివ్యూ పూర్తయ్యే వరకు మహిళలకు ప్రవేశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. దీన్ని బట్టి ప్రస్తుతం మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చు. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వాళ్లు అయ్యప్ప స్వామిని దర్శించుకోవచ్చు.

అటు.. టీటీడీ తరహాలో శబరిమల ఆలయ బోర్డు ఏర్పాటుకు ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలని కేరళ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలల్లో కొత్త చట్టాన్ని కోర్టు ముందు ఉంచాలని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. టీటీడీ తరహాలో ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారిని అయ్యప్పస్వామి దేవాలయానికి కేటాయించాలని, ఇప్పటి వరకు ఎందుకు జాప్యం చేస్తున్నారని మండిపడింది ధర్మాసనం. అటు అయ్యప్ప కొండకు బస్సుల సంఖ్యను కూడా పెంచాలని తెలిపింది.
Published by: Shravan Kumar Bommakanti
First published: November 20, 2019, 12:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading