Google Pay: అదృష్టం అంటే ఇదే.. నిజామాబాద్ వాసికి గూగుల్ పేలో లక్ష రూపాయల రివార్డు

ప్రతీకాత్మక చిత్రం

గూగుల్ పే ద్వారా లావాదేవీలు నిర్వహించే వారు చాలా మంది రివార్డుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తాజాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి గూగుల్ పే లో లక్ష రూపాయల రివార్డు లభించింది.

  • Share this:
    గూగుల్ పే ద్వారా లావాదేవీలు నిర్వహించే వారు చాలా మంది రివార్డుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అవతలి వ్యక్తులకు డబ్బులు పంపాక వచ్చే స్క్రాచ్ కార్డు‌ను చూసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. కానీ చాలా సందర్భాల్లో నిరాశే మిగులుతుంది. కొన్ని సందర్భాల్లో స్క్రాచ్ కార్డు రివార్డు లభించించిన అది 100 రూపాయలలోపే ఉంటుంది. అతి కొద్ది సందర్బాల్లో మాత్రమే వంద రూపాయలకు పైగా రివార్డు లభిస్తోంది. అయితే ఓ వ్యక్తి ఏకంగా లక్ష రూపాయల గూగుల్ పే రివార్డు లభించింది. లక్ష రూపాయల రివార్డు లభించడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. నిజామాబాద్ జిల్లాకు చెందిన నాగమల్ల సంపత్ నగరంలో ఖిలీల్ వాడీలో సౌమ్య కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ నిర్వహిస్తున్నాడు.

    సంపత్ తన బ్యాంక్, కిరాణా షాపు లావాదేవీలను నిర్వహించడానికి గూగుల్ పే బిజినెస్ యాప్‌ను వినియోగిస్తున్నాడు. రోజువారి తన లావాదేవీలను ఆ యాప్ ద్వారానే చేపడుతున్నాడు. సోమవారం కూడా ఓ లావాదేవీని చేసిన సంపత్‌కు స్క్రాచ్ కార్డు వచ్చింది. అందులో ఏముందో చూడగా.. రూ. లక్ష రూపాయలు రివార్డు వచ్చినట్టు కనిపించింది. గతంలో చిన్న మొత్తంలో రివార్డులు చూసిన సంపత్.. ఒక్కసారిగా లక్ష రూపాయలు రావడంతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలిపి ఆనందంతో పొంగిపోయాడు. ఇక, సంపత్‌కు నేడు గూగుల్ పే లోకల్ యూనిట్ నిర్వాహకులు సన్మానం చేయనున్నట్టుగా సమాచారం.
    Published by:Sumanth Kanukula
    First published: