నిత్యానంద వీడియో రిలీజ్... పిచ్చి పీక్ స్టేజ్‌కి చేరిందిగా...

Nityananda : రేప్ కేసులో నిందితుడైన నిత్యానంద విదేశాలకు పారిపోతుంటే... ఎందుకు అడ్డుకోలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా ఆయన రిలీజ్ చేసిన వీడియో చర్చకు దారితీసింది.

news18-telugu
Updated: December 8, 2019, 7:05 AM IST
నిత్యానంద వీడియో రిలీజ్... పిచ్చి పీక్ స్టేజ్‌కి చేరిందిగా...
నిత్యానంద వీడియో రిలీజ్...
  • Share this:
Nityananda : కర్ణాటకలో ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకొని... రేపులు, అరాచకాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద ఇప్పుడు ఎక్కడున్నాడు? రేపు ఎక్కడుంటాడు? ఈ ప్రశ్నలకు సమాధానం పోలీసుల దగ్గర లేదు. ఈమధ్యే ఈక్వెడార్‌లో ఓ దీవిని కొనేసి, కొత్త దేశం క్రియేట్ చేసినట్లు చెప్పుకున్న నిత్యానందకు... అంత సీన్ లేదనీ, అసలు తాము ఏ దీవినీ నిత్యానందకు అమ్మలేదని ఈక్వెడార్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు... ఆశ్రయం కోసం నిత్యానంద చేసుకున్న శరణార్థి దరఖాస్తును తిరస్కరించింది. వెంటనే నిత్యానంద అజ్ఞాతంలోకి చెక్కేశాడు. తాజాగా ఆయన మాట్లాడుతున్న ఓ వీడియో రిలీజైంది. అందులో... నిత్యానంద చెప్పిన మాటలు విని... ఆయనకు పిచ్చి బాగా ముదిరిందనీ, వెంటనే ఎవరికైనా చూపించాలని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ నిత్యానంద ఏం స్పీచాడన్నదేగా మీ డౌట్. ఇలా అన్నాడు. "నన్ను ఎవ్వరూ టచ్ చేయలేరు. ఏ స్టూపిడ్ కోర్టూ నన్ను ప్రాసిక్యూట్ చేయలేదు. నేను పరమశివుడిని. నేను నిజం చెప్పగలను. మీ ముందు నా నిజాయితీని నిరూపించుకోగలను" అని తన ముందు ఉన్న అనుచరులతో నిత్యానంద మాట్లాడిన వీడియో అది. ఎప్పుడు మాట్లాడాడు? ఎక్కడ మాట్లాడాడు? అన్నది తెలియట్లేదు. సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అయ్యింది.
రేప్ కేసు, ఇతర చాలా కేసుల్లో నిందితుడైన నిత్యానంద విదేశాలకు పారిపోతుంటే... ఎందుకు అడ్డుకోలేదన్న విమర్శలు కేంద్ర ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వంపై వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నిత్యానంద పాస్‌పోర్ట్‌ శుక్రవారం రద్దైంది. ఆయన ఆచూకీ తెలుసుకోవడం కోసం భారత విదేశాంగ శాఖ ప్రయత్నిస్తోంది. 

Pics : అందాల తమిళ పొన్ను ఐశ్వర్య మీనన్ క్యూట్ స్టిల్స్
ఇవి కూడా చదవండి :

IND VS WI : వెస్టిండీస్‌తో నేడు రెండో టీ20... గెలిస్తే సిరీస్ భారత్‌దే...

జరిగింది ఎన్‌కౌంటరేనా? NHRC ఏం చెప్పబోతోంది?

జగన్‌కి మేలుచేసిన కేసీఆర్... వైసీపీ హ్యాపీ

Health Tips : పట్టులాంటి జుట్టు కావాలా... ఉల్లిపాయలతో ఇలా చెయ్యండి

Health Tips : ఎంతకీ చుండ్రు తగ్గట్లేదా? ఇలా చెయ్యండి చాలు

First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు