NITIN GADKARI LAUNCHES PORTAL FOR YOU TO BUY GROCERIES DIRECTLY FROM FARMERS ALONG WITH THESE BENEFITS NK
రైతుల నుంచి ప్రజలు నేరుగా కొనుక్కునే ఛాన్స్... కొత్త పోర్టల్ ప్రారంభించిన కేంద్రం
రైతుల నుంచి ప్రజలు నేరుగా కొనుక్కునే ఛాన్స్... కొత్త పోర్టల్ ప్రారంభించిన కేంద్రం
నిజంగానే ఇదో విప్లవాత్మక నిర్ణయం. ఎందుకంటే... ఇలా డైరెక్టుగా ఉత్పత్తులు కొనుక్కుంటే... తక్కువ రేటుకి రావడమే కాదు మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో తెలుసుకుందాం.
Technology for MSMEs: చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఇప్పుడు రైతులు తెగ మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే... సోమవారం ఆయన... వేదకృషి డాట్ కామ్ (VedKrishi.com)ని ప్రారంభించారు. ఈ సైట్ పేరు ఓ చోట రాసిపెట్టుకోండి. భవిష్యత్తులో దీనితో మనకు చాలా ప్రయోజనాలుంటాయి. ఈ పోర్టల్ ద్వారా రైతులు తమ విషపూరితం కాని ఉత్పత్తుల్ని డైరెక్టుగా అమ్ముకుంటారు. ఈ విధానాన్ని మహారాష్ట్ర... నాగపూర్‌కి చెందిన ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్... వేదకృషి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ పోర్టల్‌లో వస్తువుల కోసం ఆర్డర్ ఇస్తే చాలు... డైరీ ఉత్పత్తులు, కూరగాయలు, ధాన్యాలు, పప్పులు, పచ్చల్లు, జ్యూస్‌లు, సాస్‌లను హోమ్ డెలివరీ చేస్తారు. రైతులు అమ్మితే, ప్రజలు కొనుక్కుంటారు. మధ్యలో మధ్యవర్తులెవరూ ఉండరు. అందువల్ల అటు రైతుకూ, ఇటు కస్టమర్‌కూ ఇద్దరికీ కలిసొస్తుంది.
వేదకృషి పోర్టల్‌లో ఉత్పత్తులు
ఇందులో రిజిస్టర్ అయిన కస్టమర్లు... ఏడాది ముందే తమ ఆర్డర్ ఇవ్వొచ్చు. వేదకృషి సంస్థ... ఆర్గానిక్ ఫార్మింగ్‌ను ప్రోత్సహిస్తూ... దాన్ని రైతులకు నేర్పిస్తూ... మరింతమందిని ఈ వెబ్సైట్లో చేర్చుతోంది. ప్రస్తుతం ఈ ఆన్లైన్ పోర్టల్ ఇంకా సర్వీసులు ప్రారంభించలేదు. కొద్దిగా టైమ్ పడుతుందంటున్నారు. కారణం కరోనా వైరస్సే. ఒకట్రెండు నెలల్లో దీన్ని ప్రారంభిస్తామంటున్నారు. మొదట్లో... నాగపూర్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సరుకుల్ని హోమ్ డెలివరీ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 300 మంది రైతులు ఈ ఉత్పత్తుల్ని అందించనున్నారు. ఆ తర్వాత... మహారాష్ట్ర అంతటా దీన్ని విస్తరిస్తారు. ఆ తర్వాత దేశమంతా విస్తరిస్తారు.
ఇప్పటికే బిగ్ బాస్కెట్ లాంటి ఈ-కామర్స్ సైట్లు వ్యవసాయ ఉత్పత్తుల్ని వినియోగదారులకు హోమ్ డెలివరీ చేస్తున్నాయి. వేదకృషి ద్వారా... పూర్తిగా సేంద్రియ ఎరువులతో పండించిన ఉత్పత్తుల్ని మాత్రమే సప్లై చేయనున్నారు. అందువల్ల ఇది ప్రజలకు బాగా నచ్చుతుందని భావిస్తున్నారు.