Viral Video: చీరకట్టులో అలవోకగా పామును పట్టేసిన వనిత

పాములను చూస్తునే చాలా మంది హడలిపోతారు. ముఖ్యంగా మహిళలలో ఎక్కువ మంది పాము పేరు వినిపిస్తేనే పరుగులు తీస్తారు. కానీ ఓ మహిళ మాత్రం పాములను ఇట్టే పట్టేస్తోంది.

news18-telugu
Updated: September 17, 2020, 8:20 AM IST
Viral Video: చీరకట్టులో అలవోకగా పామును పట్టేసిన వనిత
పామును పట్టిన అనంతరం నిర్జర చిట్టి(క్రెడిట్-గురుకుల్ ఎడ్యూటెక్ యూట్యూబ్)
  • Share this:
పాములను చూస్తునే చాలా మంది హడలిపోతారు. ముఖ్యంగా మహిళలలో ఎక్కువ మంది పాము పేరు వినిపిస్తేనే పరుగులు తీస్తారు. కానీ ఓ మహిళ మాత్రం పాములను ఇట్టే పట్టేస్తోంది. ఏ మాత్రం భయపడకుండా.. పాములను పట్టడమే కాకుండా వాటిని రక్షించే పని కూడా చేస్తున్నారు. ఆ మహిళ చీరకట్టులో ఉండి కూడా పాములను చాలా తేలికగా చేతుల్లోకి తీసుకుని జౌరా అనిపిస్తున్నారు. ఇక, గతేడాది ఏప్రిల్‌లో ఆమె ఒకరి ఇంట్లో దూరిన పామును పట్టుకున్నారు. అయితే ఆ సమయంలో తీసిన వీడియో.. గత మూడు రోజులుగా సోషల్ మీడియా వైరల్‌గా మారింది.

వివరాలు.. కర్ణాటకలోని బెల్గాంకు చెందిన నిర్జరా చిట్టి అలవోకగా పాములను బంధిస్తారు. ఒక రోజు బంధువుల ఇంట్లో వివాహ కార్యక్రమానికి బయలుదేరిన సమయంలోనే ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తమ ఇంట్లో పాము దూరిందని.. మీ సాయం చేయాలని బాధితులు నిర్జరాకు విషయాన్ని వివరించారు. ఆ సమయంలో నిర్జరా చీరకట్టులో బాగా ముస్తాబై ఉన్నారు. అయినప్పట్టికీ అవేమీ పట్టించుకోకుండా.. ఘటన స్థలానికి చేరుకున్నారు. తన చేతిలో ఎలాంటి ఆయుధాలు లేకున్నా.. అక్కడ ఉన్న కర్ర సాయంతో కప్‌బోర్డ్స్ మధ్య చిక్కిన పామును పట్టుకునే పనిలో పడ్డారు. చాలా సులువుగా పామును బంధించి.. తన చేతుల్లోకి తీసుకున్నారు. అయితే చీరకట్టులో ఉన్నప్పుడు పామును పట్టుకోవడం అనేది కొద్దిగా కష్టమైన పని అని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. ఏ మాత్రం భయపడకుండా ఆమె పామును పట్టుకున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.




డాక్టర్ అజయిత అనే ట్విటర్ యూజర్ షేర్ చేసిన వీడియోను 46 లక్షల మంది వీక్షించారు. ట్విటర్ మాత్రమే కాకుండా పలు సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది. దీని చూసిన నెటిజన్లు నిర్జరపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొందరైతే ఆమె దైర్యానికి సెల్యూట్ చేస్తున్నారు.
Published by: Sumanth Kanukula
First published: September 17, 2020, 8:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading