Home /News /trending /

NIRANJOY SINGH A YOUNG MAN FROM MANIPAL WHO BROKE THE GUINNESS WORLD RECORD WITH 109 PUSH UPS PER MINUTE SNR

నిమిషంలో గిన్నీస్‌ వరల్డ్ రికార్డ్‌ బద్దలు కొట్టాడు..ఆడు మగాడ్రా బుజ్జీ..

Photo Credit: Instagram

Photo Credit: Instagram

OMG: 60సెకన్లలో 109పుష్‌ అప్స్ చేశాడు మణిపూర్‌కి చెందిన 24ఏళ్ల యువకుడు. గతంలో యూకేకి చెందిన వ్యక్తి 105పుష్‌ అప్స్‌ చేసిన రికార్డును బద్దలు కొట్టాడు నిరంజోయ్‌సింగ్‌. అద్భుతమైన రికార్డు నెలకోల్పిన యువకుడ్ని కేంద్రమంత్రి కిరణ్‌ రిజూజు అభినందించారు.

ఇంకా చదవండి ...
గిన్నీస్‌ బుక్ ఆఫ్ వరల్డ్‌ రికార్డ్‌ సాధించడం అంత ఆషామాషి విషయం కాదు. అలాంటి రికార్డ్‌ సృష్టించిన వ్యక్తిని తలదన్ని కొత్త రికార్డు సృష్టించడం ఇంకా కష్టం. మణిపూర్‌కి చెందిన బాడీ బిల్డర్‌ గిన్నీస్‌ బుక్‌ ఆఫ్ వరల్డ్‌ రికార్డ్‌ని అతి సునాయాసంగా బద్దలు కొట్టాడు. పట్టుమని పాతిక సంవత్సరాలు (24-year-old)కూడా లేని తౌనోజామ్‌ నిరంజోయ్‌సింగ్‌ (Thounaojam Niranjoy Singh)అనే యువకుడు కేవలం నిమిషంలో చేతి వేళ్లను నేలపై మోపి అత్యధిక పుష్‌ అప్‌లు చేశాడు. గతంలో 2009 మే 25న(May 25, 2009 యునైటెడ్ కింగ్డమ్‌( United Kingdom)కి చెందిన గ్రాహం మాలీ (Graham Maly)నిమిషంలో 105 పుష్‌ అప్‌ చేసి గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్ (Guinness World) Recordనెలకోల్పితే...అతడి రికార్డును బద్దలు కొట్టాడు ఇంపాల్‌కి చెందిన నిరంజోయ్‌సింగ్‌. జనవరి 14న ఇంపాల్‌లో ఈ అరుదైన రికార్డును సృష్టించాడు నిరంజోయ్‌సింగ్‌. గిన్నీస్‌ వరల్డ్ రికార్డ్‌ ప్రతినిధులు, స్థానికుల సమక్షంలో కేవలం 60సెకన్లలో 109 పుష్‌ అప్స్‌ చేసి తన పేరును గిన్నీస్‌ బుక్‌లో ఎక్కేలా చేశాడు నిరంజోయ్‌సింగ్. మణిపూర్‌కి చెందిన యువకుడు సాధించిన ఈఘనతను కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు (Kiren Rijiju)అభినందించారు. ఊహించని విజయాన్ని దక్కించుకున్నావు అంటూ ట్వీట్‌ (Tweeted)చేశారు కిరణ్‌ రిజిజు.

మణిపాల్‌ ఆణిముత్యం ..
ఇంపాల్‌కి చెందిన నిరంజోయ్‌సింగ్‌కు పుష్‌ అప్స్‌లో గిన్నీస్‌ వరల్డ్ రికార్డ్ సాధించడమే కాదు గతంలో కూడా ఎన్నో క్రీడలు, ఆటలతో పాటు బాడి బిల్డింగ్‌లో పతకాలు సాధించాడు. 24సంవత్సరాల యువకుడు నిమిషంలో 109 పుష్‌ అప్స్ చేయడం గొప్ప విషయమని మణిపూర్‌ మంత్రులు, జిల్లా కలెక్టర్‌ చెప్పుకొచ్చారు. నిరంజోయ్‌సింగ్‌ని సన్మానించారు.

యువతకు ఆదర్శం..
యువకుల్లో చురుకుదనం, శరీర దారుడ్యం జిమ్‌లకు వెళ్తేనే రాదని..సహజమైన పద్దతిలో ఎక్సర్‌సైజ్‌లు చేయడం వల్ల కూడా ఫిట్‌నెస్‌గా ఉంటారని నిరంజోయ్‌సింగ్‌ నిరూపించాడు. మణిపాల్‌లోని ఇంపాల్‌ ప్రాంతంలో ఇలాంటి యువకులు చాలా మంది యువకులు నిరంజోయ్‌సింగ్‌ని ఆదర్శంగా తీసుకొని క్రీడలపై ఆసక్తి పెంచుకుంటున్నారు.

 నిమిషంలో 120 పుష్‌ అప్స్ చేసేందుకు ప్రయత్నిస్తానంటున్నాడు నిరంజోయ్‌సింగ్‌. అతని ప్రయత్నం సఫలం కావాలని..మరో రికార్డు నెలకోల్పాలని ఆశిద్దాం.
Published by:Siva Nanduri
First published:

Tags: Guinness World Record, Manipur

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు