• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • NILANSHI PATEL INDIAN RAPUNZEL WHO HELD GUINNESS RECORD FOR WORLDS LONGEST HAIR CHOPS IT OFF AFTER 12 YEARS SK GH

Nilanshi Patel: ఇంత పొడవైన జుట్టు ఎవరికీ లేదు.. కానీ 12 ఏళ్ల తర్వాత కత్తిరించిన గిన్నిస్ బ్యూటీ.. ఎందుకంటే

Nilanshi Patel: ఇంత పొడవైన జుట్టు ఎవరికీ లేదు.. కానీ 12 ఏళ్ల తర్వాత కత్తిరించిన గిన్నిస్ బ్యూటీ.. ఎందుకంటే

నీలాంషి పటేల్

పన్నెండు సంవత్సరాల పాటు ఎంతో పొడవైన తన జుట్టును మెయిన్ టెయిన్ చేసిన నీలాంషి తాజాగా వాటిని కత్తిరించుకుంది. తన జుట్టు కత్తిరించినప్పుడు కూడా వాటితో ఏం చేయాలని నిర్ణయించుకుంది.

  • Share this:
నీలాంషీ పటేల్.. ఈ పేరు కంటే రియల్ లైఫ్ రపంజిల్ అనే పేరుతోనే ఆమె ఎక్కువగా ఫేమస్.. తన జుట్టును ఏమాత్రం కట్ చేయకుండా సుమారు 200 సెంటీ మీటర్లు (6.7 అడుగుల) ఎత్తు పెంచి గిన్నిస్ రికార్డు కూడా సాధించిందామె. తాజాగా ఆమె తన జుట్టును కత్తిరించుకొని వార్తల్లో నిలుస్తోంది. పొడవాటి జుట్టు అంటే అందరికీ ఎంతో ఇష్టం. కానీ పొడవు జుట్టున్న తను ఎందుకు దాన్ని కట్ చేసుకుందన్న విషయం తెలియాలంటే ముందు ఆమె గురించి తెలుసుకోవాల్సిందే.

గుజరాత్ లోని మొడోసా కి చెందిన నీలాంషీ పటేల్ పొడవాటి జుట్టున్న టీనేజర్ గా గిన్నిస్ రికార్డు సాధించింది. ఆరేళ్ల వయసున్నప్పుడు హెయిర్ డ్రస్సర్లతో ఎదురైన ఇబ్బంది వల్ల ఆమె జుట్టు కటింగ్ సరిగ్గా జరగలేదు. దీంతో ఇక తానెప్పుడూ జుట్టు కత్తిరించుకోకూడదని నిర్ణయించుకుంది నీలాంషి. ఆ తర్వాత పన్నెండేళ్ల పాటు తన నిర్ణయాన్ని అలాగే కొనసాగించింది. పొడవాటి జుట్టును పెంచుకొని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లోనూ స్థానం పొందింది. 16 సంవత్సరాల వయసులో ఆమె జుట్టు పొడవు 170.5 సెంమీ (5.7 అడుగులు) ఉండడమే విశేషమైతే.. గత జులైతో మరింత పొడవు పెంచిన జుట్టుతో అత్యంత పొడవైన జుట్టున్న టీనేజర్ గా రికార్డు సాధించింది. ఈ సమయంలో ఆమె జుట్టు పొడవు 200 సెంమీ (6.7 అడుగులు) ఉండడం గమనార్హం. ఇలా ఆమె మూడు సార్లు గిన్నిస్ రికార్డులు సాధించింది. తన రికార్డులను తానే రెండు సార్లు బద్దలు కొట్టింది.

చుట్టుపక్కలే కాదు.. గుజరాత్ లోనే రియల్ లైఫ్ రపంజిల్ గా పేరు సాధించిన నీలాంషి తన జుట్టే తనకు లక్కీ ఛార్మ్ అని చెబుతుండడం విశేషం. పన్నెండు సంవత్సరాల పాటు ఎంతో పొడవైన తన జుట్టును మెయిన్ టెయిన్ చేసిన నీలాంషి తాజాగా వాటిని కత్తిరించుకుంది. తన జుట్టు కత్తిరించినప్పుడు కూడా వాటితో ఏం చేయాలని నిర్ణయించుకుంది నీలాంషి. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. “నా జుట్టు నాకు చాలా ఇచ్చింది. దానివల్లే నేను రికార్డు సాధించాను. దానితోనే నాకు రియల్ లైఫ్ రపంజిల్ గా పేరు వచ్చింది. దానికి కూడా నేను ఏదైనా చేయాలనుకున్నాను. నా పొడవైన వెంట్రుకలను కట్ చేసి వాటిని వేలం వేయడం లేదా స్వచ్ఛంద సంస్థలకు దాన్ని అందించడం లేదా ఏదైనా మ్యూజియానికి దాన్ని అందించడం వంటి మూడు ఆప్షన్ల గురించి నేను ఆలోచించాను. మా అమ్మ కామినీ బెన్ తో మాట్లాడిన తర్వాత నా జుట్టు మిగిలిన వారికి స్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ దాన్ని మ్యూజియంకి అందించాలని నిర్ణయించుకున్నా. మా అమ్మ జుట్టు కూడా కాస్త పొడుగ్గానే ఉంటుంది. ఆమె తన జుట్టును క్యాన్సర్ పేషంట్లకు సహాయం చేసే స్వచ్ఛంధ సంస్థలకు అందించేందుకు సిద్ధమైంది. ” అని వెల్లడించింది నీలాంషి.

ఈ జుట్టు కత్తిరించడం తన జీవితంలోనే ఎమోషనల్, జీవితాన్ని మార్చే సందర్భం అని పేర్కొన్న నీలాంషి.. ఈ ఫీలింగ్ చాలా కొత్తగా ఉందని వెల్లడించింది. తన జుట్టును తన అస్తిత్వంలో భాగం.. తన జీవితంగా మారిపోయిందని.. నాలో ఒక భాగాన్ని నా నుంచి దూరం చేస్తున్నట్లుగా నాకు అనిపిస్తోందని ఆమె వెల్లడించింది. జుట్టు కట్ చేసే ముందు ఆమె చాలా ఎక్సైటింగ్ గా, కాస్త నెర్వస్ గా ఫీలవుతున్నా అని చెప్పింది. “నాకు చాలా నెర్వస్ గా, ఎక్సైటింగ్ గా అనిపిస్తోంది. ఈ కొత్త హెయిర్ స్టైల్ లో నేను ఎలా కనిపిస్తానో నాకు తెలీదు. కానీ అది బాగానే ఉంటుందని అనిపిస్తోంది.” వెల్లడించింది. పొడవాటి జుట్టులో ఆమె అద్భుతంగా ఉన్నా పొట్టి జుట్టులోనూ ఆమె చాలా అందంగా కనిపిస్తోంది. ఈ వెంట్రుకలు కట్ చేయడాన్ని వీడియో తీసి దాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పేజీలో అప్ లోడ్ చేశారు.
Published by:Shiva Kumar Addula
First published: