హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

శర వేగంగా వ్యాపిస్తున్న Monkeypox.. రాజధానిలో నమోదైన రెండో కేసు.. దేశంలో ఎన్నంటే..

శర వేగంగా వ్యాపిస్తున్న Monkeypox.. రాజధానిలో నమోదైన రెండో కేసు.. దేశంలో ఎన్నంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Delhi: నైజీరియన్ కు చెందిన వ్యక్తికి కొన్నిరోజులుగా మంకీపాక్స్ సింప్టమ్స్ తో బాధపడుతున్నాడు. దీంతో ఆయనను డాక్టర్ లు ప్రత్యేకంగా వార్డులో ఉంచారు. ఈ క్రమంలో అతని శాంపుల్ తీసుకుని పూణేలోని ల్యాబ్ లో టెస్ట్ చేయడానికి పంపించారు.

దేశంలో మంకీపాక్స్ (Monkeypox) కేసులు చాపకింద నీరులా వ్యాపిస్తుంది. ఇప్పటికే మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఢిల్లీలో గత వారం తొలి మంకీపాక్స్ కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా, రెండవ మంకీపాక్స్ కేసు వెలుగులోనికి వచ్చింది. ఈ సంఘటనతో ఢిల్లీలో ప్రజలు తీవ్ర భయాందోళనలు గురౌతున్నారు. ఢిల్లీలో (Delhi)  నివసిస్తున్న నైజీరియన్‌కు చెందిన 35 ఏళ్ల వ్యక్తికి ఇటీవలి మంకీపాక్స్‌కు పాజిటివ్‌గా తేలింది.

అయితే.. ఇతను ఎలాంటి విదేశీ పర్యటనలు చేయలేదని తెలుస్తోంది. అయిన కూడా వైరస్ ఎలా సోకిందని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో దేశంలో మొత్తం సోకిన వారి సంఖ్య ఆరుకు చేరుకుందని అధికారిక వర్గాలు సోమవారం తెలిపాయి. నైజీరియన్ జాతీయుడు ఇన్ఫెక్షన్ చికిత్స కోసం నోడల్ ఆసుపత్రి అయిన ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించే LNJP హాస్పిటల్‌లో చేరాడు.

అతనికి గత ఐదు రోజులుగా బొబ్బలు, జ్వరం ఉన్నాయి. అతని నమూనాలను పూణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి)కి పంపారు. సోమవారం సాయంత్రం వచ్చిన నివేదిక అతను బాగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆఫ్రికన్ మూలానికి చెందిన ఇద్దరు మంకీపాక్స్ అనుమానిత రోగులు కూడా LNJP ఆసుపత్రిలో చేరారు. ఇప్పటికే మంకీపాక్స్ సోకిన ఒక వ్యక్తి  కేరళలో చనిపోయిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా కేరళకు చెందిన మొదటి మంకీపాక్స్ రోగి పూర్తిగా కోలుకున్నాడు.

కేరళకు తిరిగి వచ్చి మంకీపాక్స్ లక్షణాలు కనిపించి ఆసుపత్రి పాలైన కొల్లం వాసికి జూలై 14న వ్యాధికి పాజిటివ్‌గా తేలింది. దేశంలో మంకీపాక్స్‌ తొలి పాజిటివ్‌ కేసుగా తేలిన 35 ఏళ్ల వ్యక్తి పూర్తిగా కోలుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కొల్లంకు చెందిన వ్యక్తిని త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని ఆమె చెప్పారు. దేశంలోనే మంకీపాక్స్ సోకిన తొలి కేసు కావడంతో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సూచనల మేరకు 72 గంటల వ్యవధిలో రెండుసార్లు పరీక్షలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు. అన్ని నమూనాలు రెండుసార్లు నెగిటివ్‌గా వచ్చాయని ఆమె తెలిపారు. అతడు రోగి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాడని.. చర్మపు గడ్డలు పూర్తిగా నయమవుతాయని అన్నారు. అతడితో ప్రాథమిక కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న అతని కుటుంబ సభ్యుల పరీక్ష ఫలితాలు కూడా నెగిటివ్‌గా ఉన్నాయని మంత్రి చెప్పారు.

ప్రస్తుతం ఇన్‌ఫెక్షన్‌కు పాజిటివ్‌గా తేలిన మరో ఇద్దరు వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగా ఉందని, నివారణ, నిఘా చర్యలు అదేరకంగా కొనసాగుతాయని మంత్రి తెలిపారు. మంకీపాక్స్ వ్యాధికి సంబంధించిన నాలుగు ధృవీకరించబడిన కేసుల్లో కేరళలోనే మూడు ఉన్నాయి. ఇప్పుడు పూర్తిగా కోలుకున్న వ్యక్తి , ఢిల్లీ నుండి ఒకటి ఇప్పటివరకు దేశంలో నివేదించబడ్డాయి.

Published by:Paresh Inamdar
First published:

Tags: Delhi, Monkeypox