• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • NIFT STUDENT FROM BHOPAL DESIGNS MOVABLE TOILET FOR COVID PATIENTS MK GH

Movable toilet: కరోనా రోగుల కోసం కదిలే మరుగుదొడ్డి.. డిజైన్ చేసిన భోపాల్ విద్యార్థిని

Movable toilet: కరోనా రోగుల కోసం కదిలే మరుగుదొడ్డి.. డిజైన్ చేసిన భోపాల్ విద్యార్థిని

Movable toilet: కరోనా రోగుల కోసం కదిలే మరుగుదొడ్డి.. డిజైన్ చేసిన భోపాల్ విద్యార్థిని

మధ్యప్రదేశ్ భోపాల్ కు చెందిన ఓ విద్యార్థిని మూవబుల్ టాయ్ లెట్ (కదిలే మరుగుదొడ్డి)ను డిజైన్ చేసింది. మహమ్మారి కాలంలో కరోనా రోగులకు సహాయం చేయాలనే తలంపుతో ఈ టాయ్ లెట్ ను రూపొందించింది.

  • Share this:
ప్రస్తుతం దేశంలో కోవిడ్-19 ప్రభావం తీవ్రంగా ఉంది. ముఖ్యంగా భారీ సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడి అవస్థలు పడుతున్నారు. ఆసుపత్రుల్లో పడకలు దొరక్క కొంత మంది, పడకలు దొరికినా ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో మరికొంత మంది తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మధ్యప్రదేశ్ భోపాల్ కు చెందిన ఓ విద్యార్థిని మూవబుల్ టాయ్ లెట్ (కదిలే మరుగుదొడ్డి)ను డిజైన్ చేసింది. మహమ్మారి కాలంలో కరోనా రోగులకు సహాయం చేయాలనే తలంపుతో ఈ టాయ్ లెట్ ను రూపొందించింది.

భోపాల్ కు చెందిన ప్రత్యక్షా మాఝే అనే యువతి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో(NIFT) చదువుకుంటోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగుల సహాయంగా మూవబుల్ టాయ్ లెట్ చేసినట్లు ఆమె తెలిపింది. కరోనా రోగులకు మూవబుల్ టాయ్ లెట్ సహాయకరంగా ఉంటుందని చెప్పింది. ఇది సాధారణ వీల్ ఛైర్ మాదిరిగానే ఉంటుందని ఆమె పేర్కొంది.

కరోనా రోగుల సహాయంగా మూవబుల్ టాయ్ లెట్


వీటిని ఆసుపత్రులకు దానం చేస్తానని చెబుతోంది ప్రత్యక్ష. దీన్ని రూపొందించాలనే ఆలోచన ఎలా వచ్చిందని అడిగితే.. ఆమె ఇలా వివరించింది. "మా అంకుల్ రాజేశ్ మాఝే ఇటీవలే కోవిడ్ బారిన పడ్డారు. ఆయనకు ఆక్సిజన్ అవసరమైంది. ఆక్సిజన్ అందించినప్పటికీ టాయ్ లెట్ కోసం వెళ్లినప్పుడు ఆక్సిజన్ అందక ఇబ్బంది పడ్డారు. ఈ విషయాన్ని గమనించిన నేను మా నాన్నతో చర్చించి ఈ ఐడియాతో వచ్చాను. వెంటనే ఈ మూవబుల్ టాయ్ లెట్ ను రూపొందించాను" అని ప్రత్యక్షా మాఝే తెలిపింది.

ఈ మరుగుదొడ్డిని ఉపయోగించిన రాజేశ్ కూడా దీని తయారీ వెనుక ఉన్న కారణాలను పంచుకున్నారు. కరోనాకు చికిత్స తీసుకుంటున్న వారికి ఈ మూవబుల్ టాయ్ లెట్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఐదు, ఆరు సార్లు వినియోగించిన తర్వాత ఈ మరుగుదొడ్డిని శుభ్రం చేసుకోవాలి. ఈ టాయ్ లెట్ లో 80 లీటర్ల వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది. అంతేకాకుండా వెస్ట్రన్ టాయ్ లెట్ సీటుతో పాటు నాలుగు వైపులా కవర్ చేసేలా ఈ మరుగుదొడ్డిని డిజైన్ చేశారు. దీనికోసం దాదాపు 25 వేల రూపాయలు ఖర్చు అయింది.
Published by:Krishna Adithya
First published: