మా ఆయన బంగారం.. నిక్ జోనస్‌పై ప్రియాంక చోప్రా ప్రశంసలు..

Priyanka Nick: ప్రతి రోజు ఉదయం నిద్ర లేవగానే నా ఫేస్‌ను తీక్షణంగా చూస్తుండిపోతాడని, మస్కరా.. మాయిశ్చురైజర్ పెట్టుకొని వస్తానని అంటే.. ఇలాగే బాగున్నావ్ అని, సూపర్ స్వీట్ అంటాడని వెల్లడించింది.

news18-telugu
Updated: August 13, 2019, 4:45 PM IST
మా ఆయన బంగారం.. నిక్ జోనస్‌పై ప్రియాంక చోప్రా ప్రశంసలు..
ప్రియాంక చోప్రా- నిక్ జోనస్
  • Share this:
ప్రియాంక చోప్రా, నిక్ జోనస్.. ఇప్పుడు నెట్టింట్లో సందడి చేస్తున్న మోస్ట్ లవబుల్ కపుల్. వీరిద్దరు ఏ చిన్న పోస్ట్ చేసినా, ఫోటో పెట్టినా.. క్షణాల్లోనే వైరల్ అయిపోతోంది. పెళ్లికి ముందు కంటేనూ పెళ్లి తర్వాతే సెక్సీ లుక్స్‌తో, ఫిగర్‌తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న ప్రియాంక చోప్రా.. సోషల్ మీడియా ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంటోంది. పార్టీలకు వెళ్లినా, బీచ్‌లకు వెళ్లినా, విహార యాత్రలకు వెళ్లినా.. అక్కడ దిగిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వార్తలకు కూడా హీట్ ఎక్కిస్తోంది. ఇప్పుడు తాజాగా, తన భర్త గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన భర్త బంగారం అంటూ ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో సిగ్గులొలికించింది. ‘నీ జీవితం నీ ఇష్టమొచ్చినట్లు జీవించు.. అనే వ్యక్తిత్వం నాది. నిక్ కూడా నాలాగే’ అని తెలిపింది. ఇక, ప్రతి రోజు ఉదయం నిద్ర లేవగానే నా ఫేస్‌ను తీక్షణంగా చూస్తుండిపోతాడని, మస్కరా.. మాయిశ్చురైజర్ పెట్టుకొని వస్తానని అంటే.. ఇలాగే బాగున్నావ్ అని, సూపర్ స్వీట్ అంటాడని వెల్లడించింది.

ఇంతలా బాగా చూసుకునే భర్త ఉండగా ఇంకేం కావాలని.. ఎంతైనా తన భర్త బంగారం అని, సూపర్ యాక్టివ్ అని చెప్పుకొచ్చింది. తమ తమ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా, ప్రపంచంలో ఏ మూలన ఉన్నా పది రోజులకు ఒక్కసారైనా కలుసుకుంటామని తెలిపిందీ భామ.

First published: August 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...