హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Divorce Invitation : మగాళ్లకు మాత్రమే..పెళ్లిని మించి గ్రాండ్ గా విడాకుల పార్టీ

Divorce Invitation : మగాళ్లకు మాత్రమే..పెళ్లిని మించి గ్రాండ్ గా విడాకుల పార్టీ

విడాకుల పార్టీకి ఇన్విటేషన్

విడాకుల పార్టీకి ఇన్విటేషన్

ఈ విడాకుల వేడుక సెప్టెంబర్ 18న జరగనుంది. ఈ కార్యక్రమంపై తమకు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని భాయ్ సంక్షేమ సంఘం కన్వీనర్ జకీ అహ్మద్ తెలిపారు. అయితే విడాకులకు మద్దతు ఇవ్వడం తమ సంస్థ ఉద్దేశం కాదన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Divorce Invitation : సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత విడాకులు(Divorce) పొందిన 18 మంది మగవారికి ఒక ఎన్జీవో సంస్థ గ్రాండ్‌గా పార్టీ ఇస్తున్నది. ఈ వేడుకలో రకరకాలైన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసింది. అందులో ముఖ్యంగా జయమాల విసర్జన్ (వివాహ మాల నిమజ్జనం), మగవాళ్ల సంగీతం, సామాజిక సేవ కోసం ప్రతిజ్ఞలు, మనస్సాక్షిని శుభ్రపరిచే పవిత్రమైన అగ్ని ఆచారం వంటి ఈవెంట్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రిక(Divorce Invitation) సోషల్‌ మీడియాలో వైరల్‌(Viral) అయ్యింది.

2014లో మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌(Bhopal)లో "భాయ్ సంక్షేమ సంఘం" అనే స్వచ్ఛంద సంస్థ లేదా ఎన్జీవో ఏర్పడింది. విడాకులు కోరుతున్న పురుషులకు ఈ ఎన్జీవో(NGO) అండగా ఉంటోంది. వేధింపులతో నిత్యం నరకం చూపిస్తున్న భార్యల నుంచి భర్తలు విడాకులు పొందేందుకు న్యాయపోరాటంలో వారికి సహాయం చేస్తోంది. తమ అండతో విడాకులు పొందిన మగవారి కోసం ఘనంగా సంబరాలు కూడా జరుపుతోంది. అయితే కరోనా వల్ల గత మూడేళ్లుగా ఎలాంటి వేడుకలు నిర్వహించలేదు. అయితే గత మూడేళ్లలో భాయ్ సంక్షేమ సంఘం సహాకారంతో దీర్ఘకాల న్యాయ పోరాటం తర్వాత 18 మంది మగవారు విడాకులు పొందారు. ఈ నేపథ్యంలో కని వినీ ఎరగని రీతిలో విడాకుల తీసుకున్న ఆ 18మంది కోసం భోపాల్‌ శివారులోని రిసార్టులో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసేందుకు ఆ ఎన్జీవో సంస్థ సిద్ధమైంది. దీనికోసం "Divorce Invitation(విడాకుల ఆహ్వానం)"అనే పేరుతో ఓ ఇన్విటేషన్‌ కూడా ప్రింట్ చేయించింది. ఈ విడాకుల వేడుక సెప్టెంబర్ 18న జరగనుంది.

Rahul Gandhi : తమిళనాడు అమ్మాయితో రాహుల్ కి పెళ్లి..సిగ్గుపడుతున్నకాంగ్రెస్ యువరాజు!

ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు భాయ్ సంక్షేమ సంఘం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. ఈ వేడుకలో రకరకాలైన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసింది. వాటికి సంబంధించిన విశేషాలను సైతం ఆహ్వాన పత్రికలో ప్రింట్ చేయించింది. 18 మందిలో కొంతమంది ఏళ్ల తరబడి విడాకుల కోసం పోరాడాల్సి వచ్చిందని, వేచి చూడాల్సి వచ్చిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలో వారి విడాకులను సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో కొద్దిమందితో దీనిని ప్లాన్ చేశారు. కానీ ఆహ్వాన పత్రిక వైరల్ అవ్వడంతో ఈవెంట్‌ను గ్రాండ్‌గా జరపేందుకు రీ డిజైన్ చేశారు. విడాకులు తీసుకున్న ఈ మగవాళ్లు తమ కొత్త జీవితాలను సానుకూల మనస్తత్వంతో, మరింత ఆత్మ గౌరవంతో ముందుకు వెళ్లేందుకు ఈ వేడుక ఒక మార్గమని ఆ ఎన్జీవో తెలిపింది.

మరోవైపు ఈ కార్యక్రమంపై తమకు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని భాయ్ సంక్షేమ సంఘం కన్వీనర్ జకీ అహ్మద్ తెలిపారు. అయితే విడాకులకు మద్దతు ఇవ్వడం తమ సంస్థ ఉద్దేశం కాదన్నారు. చెడు వివాహం వల్ల తలెత్తే వేధింపులు కొన్నిసార్లు ఆత్మహత్యకు దారి తీస్తాయని చెప్పారు. ఇలాంటి వాటిని నివారించేందుకు బాధిత భర్తలకు తమ సంస్థ ఉచితంగా కౌన్సెలింగ్‌తోపాటు న్యాయ సహాయం అందజేస్తున్నదని వివరించారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Bhopal, Divorce

ఉత్తమ కథలు